కొత్త నగరంలో ఫ్లాట్ మేట్స్ ను పరిచయం చేస్తున్న ‘ఫ్లాట్ చాట్’

రూమ్ షేరింగ్, ఫ్లాట్ మేట్స్ సమస్యను తీరుస్తున్న ‘ఫ్లాట్ చాట్’.వివరాలతో పాటు ఓ అసిస్టెంట్‌గా కూడా సహాయపడే యాప్

0

ఓ కొత్త నగరానికి మారుతున్నప్పుడు మనలో చాలా మంది ఎదురుకునే సమస్య అక్కడ ఉండటానికి మంచి ప్రదేశం. సరైన ప్రాంతం, అపార్ట్ మెంట్‌తో పాటు మీతో ఉండే ఫ్లాట్ మేట్స్ వివరాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్లు కేవలం పక్కింటి వారో... లేక రూమ్ మేట్స్ మత్రామే కాదు. మన కలీగ్స్ తరువాత ఎక్కువగా చూసేది,..ఉండేది వారితోనే... ! అందుకే అలాంటి వారి ఎంపిక జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇలాంటి వారి వివరాలు తెలుసుకుని వారితో ఉండే ప్రదేశాన్ని షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది ఫ్లాట్ చాట్. కామన్ అకామిడేషన్ షేర్ చేసుకోవాలని అనుకునే వారి కోసం ఓ మంచి నెట్వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది ఈ యాప్.

ఫ్లాట్ చాట్ యాప్‌
ఫ్లాట్ చాట్ యాప్‌

‘ఫ్లాట్.టు’ టీమ్ ప్రారంభించిన ‘ఫ్లాట్ చాట్’ను, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ‘కామన్ ఫ్లోర్.కామ్’ తీసుకుంది.

“ఫ్లాట్ మేట్స్, అకామడేషన్ షేర్ చేసుకునే వారికోసం ఇప్పటికీ అదో పెద్ద సమస్యే. ముఖ్యంగా ముంబయి, డిల్లీ, బెంగుళూరు లాంటి నగరాల్లో ఈ సమస్య కొత్తవాళ్లను మరింతగా వేధిస్తుంది. ప్రస్తుతానికి ఫేస్ బుక్ గ్రూప్స్ పై చాలా మంది ఆధారపడుతూ షేరింగ్ చేసుకునే వారిని, ఫ్లాట్ మేట్స్‌ను వెతుక్కుంటున్నారు. ఇదే ఫ్లాట్ చాట్ ఏర్పాటుకు మూలం అంటారు వ్యవస్ధాపకులు గౌరవ్ ముంజల్.”

ఫ్లాట్‌చాట్ అసిస్టెంట్

ఇక ఆ గ్రూప్స్ లో ఉన్న మెంబర్స్‌తో చాట్ చేయడమే కాకుండా, మీకు పర్సనల్‌గా అసిస్ట్ చేస్తుంది. మీకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం అసిస్టెంట్ పనైతే, బ్యాక్ ఎండ్‌లో ఉండే టీమ్, మీ అవసరాలను బట్టి మీకు వివరాలు అందిస్తూ కాల్స్ చేస్తుంటారు. అకామడేషన్ కోసం వెతుకుతున్న వ్యక్తి నేరుగా అసిస్టెంట్‌ను సంప్రదించవచ్చు. అతనితో చాటింగ్ చేస్తూ మన అవసరాల గురించి వివరించవచ్చు.

ఈ మధ్యే సాఫ్ట్ లాంచ్ చేసిన ఫ్లాట్ చాట్, అక్టోబర్ 18న యువర్ స్టోరీ టెక్ స్పార్క్ స్ గ్రాండ్ ఫినాలే లో అధాకారికంగా బెంగుళూరులో ప్రారంభించనున్నారు.

Visit http://flatchatapp.com/ for more details.

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD