ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చిందోచ్..!!

Thursday February 25, 2016,

2 min Read

ఆ మధ్యలో ఎలక్ర్టిక్ స్కూటర్లు వచ్చాయి గానీ, అవి అంతపెద్దగా క్లిక్ అవలేదు. దానికి కారణాలు అనేకం. ఆ అనేక కారణాలను, అనేక సమస్యలు ఎందుకు సాల్వ్ చేయకూడదు? స్మార్ట్ గా ఆలోచిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్- స్మార్ట్ ఎందుకు అవదు? సరిగ్గా ఇలాంటి ఐడియా మీదనే వర్కవుట్ చేశారు. అనుకున్నట్టే సక్సీడ్ అయ్యారు. దేశంలోనే తొలి స్మార్ట్ స్కూటర్ ను సగర్వంగా లాంఛ్ చేశారు.

తరుణ్ మెహతా, స్వాప్నిల్ జైన్. ఇద్దరూ మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు. దేశంలోనే తొలి స్మార్ట్ స్కూటర్ తయారుచేయాలనేది వీరి సంకల్పం. అలా 2013లో స్టార్టప్ మొదలుపెట్టారు. కంపెనీకి ఏథర్ ఎనర్జీ అని పేరు పెట్టారు. లిథియం ఆయాన్ బ్యాటరీ బ్యాకప్ తో స్కూటర్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అనేక బాలారిష్టాలను దాటుకుని దాదాపు మూడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత, స్కూటరును ముస్తాబు చేసి మార్కెట్ లోకి తీసుకు వచ్చారు. మొన్న బెంగళూరులో జరిగిన ఓ స్టార్టప్ ఈవెంట్ లో ఫస్ట్ ప్రాడక్టుని ఘనంగా లాంఛ్ చేశారు.

లిథియం అయాన్ బ్యాటరీ బ్యాకప్ తో నడిచే ఈ స్కూటర్ ఫీచర్లు అమోఘం.. అద్భుతం. డిజిటల్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డు. మనకు ఇష్టం వచ్చిన ప్రొఫైల్స్ అందులో పెర్సనలైజ్ చేసుకోవచ్చు. నచ్చిన రైడింగ్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే లైట్ వెయిట్ అల్యూమినియం ఛాసిస్. మాగ్జిమం స్పీడ్ 72 వరకు ఉంటుంది. డిజిటల్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డులో వెహికిల్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అది డ్రైవ్ చేసేవారి బిహేవియర్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. గంటలో బండి బ్యాటరీ 80 పర్సెంట్ చార్జ్ అవుతుంది. జీపీఎస్ ద్వారా బ్యాటరీ ఇంకెంత దూరం వస్తుందో ముందే ఇండికేట్ చేస్తుంది. ఇన్ బిల్ట్ నేవిగేషన్ ద్వారా ఎంత సేపట్లో గమ్యం చేరబోతున్నాం.. రోడ్ల పరిస్థితి ఏంటి, డ్రైవింగ్ చేసే పద్ధతిని బట్టి డెస్టినేషన్ చేరడానికి పట్టే సమయం ఎంత.. తదితర వివరాలను అందిస్తుంది.

undefined

undefined


దీంట్లో ఏమేం అద్భుతమైన ఫీచర్లున్నాయంటే..

• టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ విత్ 24X7 కనెక్టివిటీ

• ఆన్ బోర్డ్ నేవిగేషన్

• ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే మినిమం 60 కిలోమీటర్లు గ్యారెంటీ

• గంటలో బ్యాటరీ 80శాతం చార్జింగ్

• టాప్ స్పీడ్ గంటకు 72కి.మీ

• 15 పేటెంట్ అప్లికేషన్స్

• బెంగళూరులో మాన్యుఫ్యాక్చరింగ్

• సేల్స్ కేవలం ఆన్ లైన్ లోనే

• డోర్ డెలివరీతో పాటు సర్వీస్ కూడా ఉంది

అయితే, వెహికిల్ కొన్నవారికి పూర్తిగా మెయింటెనెన్స్ తెలియాలి. దాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలి. ఏదైనా ట్రబుల్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మా సలహాలు సూచనలతో ప్రాబ్లమ్ సార్టవుట్ చేసుకోవచ్చుంటారు తరుణ్ మెహతా.

ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు బన్సల్ బ్రదర్స్ తో పాటు, మరో ఔత్సాహిక పారిశ్రామికవేత్త మెడ్ ఆల్ సీఈఓ రాజు వెంకట్రామన్ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. టైగర్ గ్లోబల్ సంస్థ 12 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇంకేముంది, స్కూటర్ ప్రొడక్షన్, టెస్టింగ్, డెవలప్మెంట్ అన్నీ చకచకా సాగిపోయి, మార్కెట్లోకి రయ్యున దూసుకొచ్చింది.

మనిషి జోక్యం అంతగా అవసరం లేని ఈ స్కూటర్ చాలా తెలివైంది. అయితే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ దీన్ని వీలైనంత తొందరగా క్యాచ్ చేయగలిగితే మార్కెట్ ను ఓ రేంజిలో దున్నేయొచ్చు.