చర్మ సమస్యలకు ఆన్‌లైన్‌ వైద్యం - 'మై డెర్మీ'

దేశంలో 19 కోట్ల మందికి చర్మ సంబంధిత సమస్యలుఆన్ లైన్‌లో డెర్మటాలజీ సమస్యలకు పరిష్కారం అందిస్తున్న మైడెర్మీఇమేజెస్ చూసి పరిష్కారం చూపుతున్న మైడెర్మీ లిస్టెడ్ డాక్టర్లునెలలో లక్షమంది పేషంట్ల సమస్యలను పరిష్కరించిన మైడెర్మీదేశవ్యాప్తంగా 150 వర్చువల్ స్కిన్ క్లినిక్స్ ఏర్పాటు

చర్మ సమస్యలకు ఆన్‌లైన్‌ వైద్యం - 'మై డెర్మీ'

Wednesday September 02, 2015,

3 min Read

ప్రపంచవ్యాప్తంగా రోజుకో కొత్త ఆరోగ్య సమస్య పుట్టుకొస్తోంది. పేషెంట్లు పెరిగిపోతుండటంతో స్పెషలిస్టులు కూడా వచ్చేస్తున్నారు. ఆస్పత్రులకు వెళ్లలేని బిజీ జనాలకు.. ఆన్‌లైన్‌లోనూ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి కొన్ని సార్టప్ కంపెనీలు. అందులో ఒకటి మైడెర్మీ సార్టప్. ఈ సంస్థను వ్యవస్థాపకుడు అంకిత్ ఖురానా అనుకోకుండా ప్రారంభించారు.

యురేకా మూమెంట్

‘‘నేను చాలా ప్రయాణాలు చేస్తాను. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చర్మ సంబంధిత స్పెషలిస్ట్ వద్దకు వెళ్లేందుకు మాత్రం బద్ధకం. ఓ సారి ప్రయాణంలో నాకు సాక్స్ రాష్ ఏర్పడినట్టు గుర్తించాను. దాన్ని ఫొటో తీసి డాక్టర్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నాను’’ అని అంకిత్ తెలిపారు. అలా ఏర్పాటైందే మైడెర్మసీ.
మైడెర్మసీ వ్యవస్థాపకులు అంకిత్, కుబేర్ శర్మ

మైడెర్మసీ వ్యవస్థాపకులు అంకిత్, కుబేర్ శర్మ


ఇలాంటి సమస్యలను తీర్చేందుకే మైడెర్మసీ స్టార్టప్ సంస్థ ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. ఒక్క సెల్ఫీ తీసుకుంటే చాలా ఈ స్టార్టప్ ద్వారా చర్మ, హెయిర్ సమస్యలను తీర్చేయొచ్చు’’ అని ఆయన వివరించారు.

ఇదీ చరిత్ర

ఓహియోలోని కేస్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో బయోమెడికల్ డిగ్రీ పూర్తి చేసిన అంకిత్.. డెర్మటాలజీ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఓ బలమైన కారణమే ఉన్నది. స్కిన్ కేర్ స్పేస్‌లోనే దశాబ్ద కాలంగా ఆయన పనిచేశారు. ఎంతో మంది డెర్మటాలజిస్టుల వివరాలు ఆయన వద్ద ఉన్నాయి. కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన క్యూబెర్ కూడా అంకిత్‌కు తోడుగా చేరారు.

2013లో అంకిత్, కుబేర్ శర్మ హై ఎండ్ ఈ కామర్స్ వెబ్ సైట్ మైడెర్మసీని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇతర స్టార్టప్ కంపెనీల్లాగే ఆన్ లైన్‌లో స్కిన్ క్లినిక్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.

‘‘ఈ- కామర్స్ వెబ్ సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మేం ఎంతో ఎగ్జయిట్ అయ్యాం. చర్మ సంబంధిత సమస్యలపై సలహాలు ఇస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని అనుకున్నాం. ఇలాంటి వెబ్ సైట్ ప్రారంభిస్తే దేశంలో మాదే మొదటిది అవుతుందని భావించాం’’ అంటారు అంకిత్. ఈ ఏడాది మే లో 20 లక్షల పెట్టుబడితో సంస్థను ప్రారంభించారు.

మంచి డిమాండ్

2015 కల్లా దేశంలో 19 కోట్ల మంది ప్రజలు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడతారని ఫ్రాస్ట్ అండ్ సులివాన్ 2014లో అంచనా వేసింది. స్కిన్ కేర్ రంగంలో అద్భుతమైన పురోగతి కూడా ఉన్నట్టు తన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడిదారులకు ఈ రంగం ఎంతో అనువుగా ఉంటుందని తెలిపింది.

మరోవైపు దేశవ్యాప్తంగా కేవలం ఏడువేల మంది మాత్రమే చర్మ సంబంధిత వ్యాధుల స్పెషలిస్టులున్నారు. అంటే ప్రతి లక్షమంది ప్రజలకు కేవలం 0.49 డెర్మటలాజిస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అదే అమెరికాలో 3.2 మంది ఉన్నారు.

ఈ అంకెల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చేందుకు మై డెర్మసీ ప్రయత్నం మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 150 మంది డెర్మటలాజిస్టులతో వర్చువల్ స్కిన్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చెందిన వైద్యులు స్కిన్, హెయిర్ సమస్యలతోపాటు లైంగిక ఆరోగ్య సంబంధిత సమస్యలకు కూడా పరిష్కారాలు చూపుతున్నారు.

అనుభవాన్ని బట్టి ఒక్కో సమస్యకు రూ. 300 నుంచి వెయ్యి రూపాయల వరకు వారు చార్జ్ చేస్తారు. గత మూడు నెలలుగా నెలకు లక్షమంది పేషంట్లకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో 90% మంది భారతీయులే.

‘‘ఏ సమస్య కూడా అంటరానిది కాదు. మేం వెబ్ సైట్ ప్రారంభించిందే ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు. కానీ కొంతమంది ఫన్నీ సమస్యలను మాకు వినిపిస్తారు. చాలామంది త్వరలో మాకు పెళ్లి కాబోతున్నది. మొహంపై పింపుల్స్ ఉన్నాయి ? ఏం చేయమంటారు ?, పిక్చర్‌ను పంపమంటారా? అని అడుగుతుంటారు’’ అని అంకిత్ వివరించారు.

దేశంలో ఎన్నో వర్చువల్ హాస్పిటల్స్ వీడియో కన్సల్టేషన్స్‌ను ఆఫర్ చేస్తుండగా, అంకిత్ మాత్రం అదంత ఉపయోగకరం కాదంటారు.

‘‘చర్మ పరిస్థితులకు సంబంధించిన ఇమేజెస్‌పై డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తారు. అందువల్ల మాకు వీడియోల అవసరం ఉండదు. స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెథడ్ కోసం టెలీ రేడియాలజీ, టెలీ డెర్మటాలజీ అనుకూలంగా ఉంటాయి. ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో టెలీ మెడిసిన్‌ను కేవలం సెకండ్ ఒపినీయన్ గా మాత్రమే ఉపయోగిస్తారు’’ అని అంకిత్ తెలిపారు.

స్టోర్, ఫార్వర్డ్ టెక్నాలజీ డిజిటల్ ఇమేజెస్, డాక్యూమెంట్స్, ప్రీ రికార్డెడ్ వీడియాల వంటి ఎలక్ట్రానిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్‌ను మెయిల్, ఎస్‌ఎంఎస్, లేదా ఇతర సురక్షితమైన అప్లికేషన్ల ద్వారా బదిలీ చేసేందుకు అనుమతి ఇస్తుంది.

డెర్మటాలజిస్టుల కన్సల్టేషన్ తోపాటు ఈ రంగంలో ఉన్న నిష్ణాతులైన డాక్టర్ల వివరాలు, డెర్మటలాజీ సంబంధిత క్లినిక్ ల వివరాలను కూడా పేషెంట్లు కోరితే మైడెర్మసీ అందజేస్తుంది.

‘‘ఈ కామర్స్ పోర్టల్స్‌లో మా సంస్థకు ఇతర వర్చువల్ హాస్పటల్స్ కున్న తేడా పేషంట్లపట్ల మేం ప్రదర్శించే జాగ్రత్తే. మా వేదిక ద్వారా పేషెంట్-డాక్టర్ ఇంటరాక్షన్లను, డాక్టర్- టెక్నాలజీ సప్లయర్స్ ఇంటరాక్షన్ లను అందిస్తాం’’ అని అంకిత్ తెలిపారు.

గట్టి పోటీ

డాక్టర్ కన్సల్టేషన్ రంగంలో చాలా సంస్థలు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. లైబ్రేట్, ఐక్లినిక్, హెల్త్ కేర్ మ్యాజిక్, ఆస్క్ డాక్టర్, మెడి ఏంజెల్స్, హెల్పింగ్ డాక్, ప్రాక్టో వంటి సంస్థలు ఆన్ లైన్ లో సేవలు అందిస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డెర్మ్, కల్రా, డెర్మటాలజిస్ట్ కాల్.కామ్, రియల్ సెల్ప్ వంటి సంస్థలు మైడెర్మసీతో నేరుగా పోటీపడుతున్నాయి.

చిన్న నగరాలకూ విస్తరణ

సంస్థను మరింత విస్తరించాలన్నయోచనలో ఉన్నారు అంకిత్, కుబేర్. చర్మ సమస్యలు, లైంగిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు తమ ఆన్ లైన్ కన్సల్టేషన్ ను చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలనుకుంటున్నారు.

‘‘మాకు దగ్గర్లోని క్లినిక్ ఎక్కడుంది అని చిన్న నగరానికి చెందిన పేషెంట్ ఎవరైనా అడిగితే, 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లినిక్ పేరు చెప్పేందుకు మాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. అందువల్ల చిన్న నగరాల్లోనూ అందుబాటులో ఉన్న డాక్టర్ల వివరాలను కూడా త్వరలో సేకరిస్తాం’’ అని అంకిత్ తెలిపారు. వారి ఉద్దేశం నెరవేరాలని ఆశిద్దాం.