మూన్‌ వాకర్‌.. టీమిండియాకు హాట్ ఫేవరెట్

గ్లోబల్ క్రికెట్ కు డిజైన్ ను ఇచ్చిన భారతీయ స్టార్టప్- తక్కువ బరువుతో ప్యాడ్స్ తయారు చేసి సరికొత్త రికార్డు- సచిన్ నుంచి వచ్చిన పిలుపుతో ఉత్సాహం- అంతర్జాతీయస్థాయి క్రికెటర్లకు హాట్ ఫేవరేట్ -

మూన్‌ వాకర్‌.. టీమిండియాకు హాట్ ఫేవరెట్

Saturday July 25, 2015,

3 min Read

కాళ్లకు రెండు ప్యాడ్లు. తలకు హెల్మెట్‌. మోచేతికి ఆర్మ్‌ గార్డ్‌. తొడకు లోయర్ గార్డ్‌. చేతులకు గ్లోవ్స్. షూ. డీఫాల్టుగా బ్యాట్‌. క్రికెట్‌లో ఒక పరుగు తీయాలంటే ఇవన్నీ చచ్చుకుంటూ మోయాలి. బ్యాట్ సంగతి పక్కన పెడితే- కాళ్లకు కట్టే ప్యాడ్సే 3 కిలోల బరువుంటాయి. ఏమీ లేకుండా పరిగెత్తినప్పుడు మూడడుగులు వేస్తే- ప్యాడ్స్ తో ఒకడుగు మాత్రమే వేయగలం. మరి దీనికేం పరిష్కారం లేదా? అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా -లైట్ వెయిట్ ప్యాడ్లు తయారుచేస్తే పరుగు ఇంకా ఈజీ కాదా? ఈ ప్రశ్నకు సమాధానమే మూన్‌ వాకర్ స్టార్టప్.

image


2011 లో మొదటిసారి ఫంక్షనల్ నమూనా

సనత్ రెడ్డి. బెంగళూరులో స్టేట్ లెవెల్ క్రికెట్ ఆటగాడు. టీంలో ఓపెనర్. వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ కూడా. మూన్ వాక్ ఐడియా తనదే. అజయ్ వైజె అనే ఫ్రెండు, మరో మాజీ క్రికెటర్ కృష్ణ వశిష్ట్ తో కలసి దీన్ని ప్రారంభించారు. కానీ అప్పటికే మార్కెట్లో విపరీతమైన పోటీ. క్రికెట్‌కి సంబంధించిన 21 బ్రాండ్లలో 18 ఇండియాలోనే తయారవుతాయి. మీరట్, జలంధర్ కు చెందిన కంపెనీలు- వేరే వాటిని తొక్కిపడేస్తున్నాయి. వాటి మోనోపలీపై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది. అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సనత్ అతని టీం 2011 లో మొదటిసారి ఫంక్షనల్ నమూనాని తయారు చేశారు.

20 శాతం ఎక్కువ ప్రొటెక్షన్

మెటీరియల్ కోసమే చాలా కష్టపడ్డారు. జర్మనీకి చెందిన ఫ్రాన్ హోఫర్ ఇనిస్టిట్యూట్ సాయం తీసుకున్నారు. దాదాపు పది నెలలపాటు కుస్తీ పట్టారు. నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ తో పరీక్ష చేయించారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ టెస్టింగ్ డేటాను విడుదల చేసింది. అన్నిరకాల పరీక్షలను తట్టుకుని ప్రాడక్టు చివరికి ఫైనల్ అయింది. రెగ్యులర్ ప్యాడ్స్ కంటే ఇవి 20 శాతం ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తాయని తేలింది. పైగా కాళ్లకు ఉన్నా- లేనంత తేలికగా అనిపిస్తాయి.


image


ఒకసారి డైలమాలో పడ్డారు

మార్కెట్‌లో బీభత్సమైన కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏ స్టార్టప్ అయినా జంకుతుంది. మూన్ వాకర్ అందుకు అతీతం కాదు. ఒకసారి డైలమాలో పడింది. లైసెన్స్ దొరుకుతుందా? అసలు పెద్ద ప్లేయర్లు ఆ ప్యాడ్స్ వాడటానికి ముందుకొస్తారా? వాళ్లు వస్తేగానీ దానికి లైసెన్స్ దొరకదు! వన్స్ వాళ్లు వాడటం మొదలుపెట్టాక మార్కెట్ లోకి రిలీజ్ చేయడం పెద్ద కష్టం కాదు. తర్వాత సేల్స్ వద్దన్నా వచ్చి పడతాయి.

సచిన్ పిలుస్తాడని అనుకోలేదు

కానీ స్టార్‌ క్రికెటర్లు ముందుకు రావాలి! ఎవరొస్తారు? ఎవరి దగ్గరికి డెమో పంపాలి? ఈ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు సచిన్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఇంటికివచ్చి డెమో ఇవ్వండని ఆ ఇన్విటేషన్ సారాంశం. తర్వాత రాహుల్ ద్రవిడ్ పిలిచాడు. అలా అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ఆటగాళ్లందరి నుంచీ ఇన్విటేషన్స్ అందాయి. ప్రాడక్టులో దమ్ముంటే అవన్నీ వాటంతట అవే జరిగి పోతుంటాయి. ఇక్కడ క్రికెటర్ చటేశ్వర్ పుజారా విషయం కూడా ప్రస్తావించాలి. పుజారాకు ఆ మధ్య మోకాలి సర్జరీ అయింది. అయినా కెరీర్‌ తొందరలోనే గాడిలో పడింది. అదంతా మా ప్యాడ్స్ క్రెడిటే అంటారు మూన్ వాకర్ టీం సభ్యులు. ఇది పూజారాతో ఆగిపోలేదు. టీమిండియా అంతా ఇప్పుడు తేలికైన మూన్ వాకర్ ప్యాడ్సే వాడుతున్నారు. వాటితో సింగిల్స్ తీయడం యమా ఈజీ. రెగ్యులర్ ప్యాడ్లతో పోల్చుకుంటే సగం బరువే ఉంటాయి. ప్రొటెక్షన్ విషయంలోనూ కింగే. సాధారణ ప్యాడ్లతో పోలిస్తే 18-20 శాతం ఎక్కువు భరోసా ఇస్తాయి.

image


ధర కేవలం రూ. 2, 999 మాత్రమే.

క్రికెటర్ల నుంచి ఓకే అని సిగ్నల్ రావడమే ఆలస్యం -అమ్మకాలు ఊపందుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మనదగ్గర 12 నగరాల్లో దొరుకుతున్నాయి. ఈకామర్స్ లోనూ కొనవచ్చు. ఎక్కడ మార్కెటింగ్ కు స్కోప్‌ ఉంటే అక్కడ చేశారు. రోజురోజుకీ మెటిరియల్, టెక్నాలజీ, ధరలతో కాంప్రమైజ్ అవుతూ సాగిపోతున్నారు. ఇంపోర్టెడ్ బ్రాండ్ ప్యాడ్స్ రూ. 8వేలు కంటే పైనే ఉంది. కానీ మూన్ వాకర్ ప్రాడక్ట్ మాత్రం రూ. 2, 999 మాత్రమే.

image


సనత్ రెడ్డి మూన్ వాకర్‌ని నిబూట్ స్ట్రాపెడ్ కంపెనీగా ప్రారంభించాడు. యాడ్ వెంచర్స్ నుంచి కోటిన్నర సీడ్ ఫండింగ్ అందింది. కొందరు పెట్టుబడులు పెట్టడానికే మొగ్గు చూపలేదు. ఇలా అయితే లాభం లేదని- మార్కెట్ స్ట్రాటజీ ఉపయోగించారు. ఈకో సిస్టమ్ లోనెట్ వర్క్ క్యాపిటల్ ని తీసుకురాగలిగారు. వారి డొమైన్లో నెట్ వర్క్ క్యాపిటల్ ని తీసుకొనే వెసులుబాటు కల్పించారు. ఇది ఎంత డబ్బులు పెట్టినా రానిది.

ప్యాడ్స్‌ ఒక్కటే కాదు. గ్లోవ్స్, థిక్ గార్డ్స్, హెల్మెట్స్ , లెగ్ గార్డ్స్‌. ఇలా క్రికెట్ యాక్ససిరీస్ అన్నిటినీ పూర్తి స్థాయిలో మార్చేయాలనేది మూన్ వాకర్ ముందున్న లక్ష్యం.