పట్టుగొమ్మలకు పట్టం కట్టే రిస్క్-2017  

తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన కాంక్లేవ్

0

గ్రామీణ ఆవిష్కరణలకు సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కాంక్లేవ్ 2017 లాంఛనంగా ప్రారంభమైంది. రాజేంద్రనగర్ ఎన్‌ఐఆర్ డీపీఆర్‌లోని వికాస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రం మంత్రి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కాంక్లేవ్‌ ని ప్రారంభించారు.

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభిప్రాయ పడ్డారు. కొత్త కొత్త ఆవిష్కరనలు జరగాలని ఆయన అభిలషించారు. ప్రతీ గ్రామం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సుజన ఆకాంక్షించారు. బ్యాంకులు కూడా తమ శాఖలను చిన్న చిన్న గ్రామాలలో పెడుతున్న ఈ సందర్భంలో, రుణ సదుపాయానికి ముద్రా బ్యాంకుని కేంద్రం తీసుకువచ్చిందని మంత్రి గుర్తు చేశారు. పల్లె ఆవిష్కరణలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూరల్ ఏరియాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్‌ఐఆర్ డీపీర్ డైరెక్టర్ డా. డబ్ల్యూఆర్ రెడ్డి అన్నారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితైన ఇంక్యుబేషన్ సెంటర్లు మారుమూల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గ్రామీణ యువకుల్లో క్రియేటివిటీకి కొదవలేదన్న ఆయన.. క్రియేటివ్ కెపాసిటీ పెంచుకోవాలంటే పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. రూరల్ స్టార్టప్ లకు సాంకేతిక, ఆర్ధక తోడ్పాటు అందించే సదుపాయం ఇప్పటిదాకా లేదని, అటువంటి ఐడియాలకు మెంటారింగ్ ఇవ్వడానికే రిస్క్ 2017 అనే వేదిక ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటిసారి ఏర్పాటు చేసిన కాంక్లేవ్ వి మంచి స్పందన రావడంతో, ప్రతీ సంవత్సరం పెడతామని డబ్ల్యూఆర్ రెడ్డి అన్నారు.

ఈ కాంక్లేవ్ లో పాల్గొనడానికి 71 మంది ఇన్నోవేటర్స్ ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకున్నారు. ఎగ్జిబిషన్ లో 69 ప్రోటోటైప్స్ స్టార్టప్స్ కొలువుదీరాయి. సానిటేషన్, వాటర్, అగ్రికల్చర్ రిలేటెడ్ మీద ఇంట్రస్టింగ్ ప్రోటోటైప్స్ పలువురిని ఆకర్షించాయి. వాటిలో కొన్ని అత్యుత్తమైన వాటిని గుర్తించి, వారికి మెంటారింగ్ ఇప్పిస్తారు. ఏ స్టార్టప్ అయితే వెంటనే మార్కెట్లోకి తీసుకురావచ్చో, దాన్ని ప్రియారిటీగా తీసుకుని, ఏంజిల్ ఇన్వెస్టర్లు లేదా వెంచర్ కేపటిలిస్టుల సాయంతో వారికి ఫండింగ్ ఇచ్చేలా సహకరిస్తారు. దాంతో పాటు ఆవిష్కర్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 6 అత్యుత్తమ స్టార్టప్‌ లను ఎంపిక చేసి లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. ఇన్నోవేట్ ఐడియాలకు కూడా రూ.50వేలు ఎన్‌ఐఆర్ డీపీఆర్ తరుపున ఇస్తారు. అంతే కాకుండా అందరి ఐడియాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొస్తారు. వాటిలో ఇన్వెస్ట్ పాజిబిలిటీ ఉన్న ఏరియాలో ఫండింగ్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు.

రెండో రోజు (మార్చి 24) ఉదయం 9 గంటలకు రూరల్ టెక్నాలజీ పార్క్ సందర్శన ఉంటుంది. పది గంటలకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై వక్తలు ప్రసంగిస్తారు. పదిన్నరకు రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం తాగునీరు, ఆరోగ్యం, పారిశుధ్యం అనే అంశంపై వక్తలు ప్రసంగిస్తారు. దాని తర్వాత సస్టెయినబుల్ హౌజింగ్ టెక్నాలజీ, వేస్ట్ టు వెల్త్, లైవ్‌లీ హుడ్స్ టెక్నాలజీస్ తదితర అంశాలపై పై స్పీకర్స్ మాట్లాడతారు. లంచ్ బ్రేక్ తర్వాత బిజినెస్ సెషన్ లో పిచింగ్ ఉంటుంది. సాయంత్రం నాలుగున్నరకు బెస్ట్ స్టార్టప్ లకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. సాయంత్రం ఐదింటికి వోట్ ఆఫ్ థాంక్స్ తో రెండ్రోజుల కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. 

Related Stories