ఫ్యాషన్‌ను సామాన్యులకు చేరువ చేసిన ముగ్గురు వనితలు

భారత దేశంలో ఫ్యాషన్‌ను సరళతరం చేయడమే వీరి లక్ష్యంఫ్యాషన్‌పై మక్కువ ఆ ముగ్గురినీ వ్యాపారవేత్తలుగా మలిచింది

ఫ్యాషన్‌ను సామాన్యులకు చేరువ చేసిన ముగ్గురు వనితలు

Wednesday April 22, 2015,

3 min Read

అనీషా దలాల్, నిరాలీ మల్జీ, పల్లవి దుగ్గల్... ఈ ముగ్గురు మహిళా వ్యాపారవేత్తల ఆసక్తి, వారి గమ్యం - ఫ్యాషన్ ! ముగ్గురిలో ఉన్న ఆ లక్షణాలే వారిని ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టించేటట్టు చేసింది. పల్లవి దుగ్గల్ ‘హ్యాష్ టాగ్ ఫాషన్’ ప్రారంభించగా, అనీషా దలాల్, నిరాలీ మల్జీ కలిసి ‘కప్ కేక్స్ ఆండ్ క్లోసెట్’ ప్రారంభించారు. ఆ ముగ్గురి లక్ష్యం సరసమైన ధరలకు ఫ్యాషన్‌ను అందుబాటులోకి తేవడం.

ఇమేజ్ క్రెడిట్ - shutterstock

ఇమేజ్ క్రెడిట్ - shutterstock


పల్లవీ దుగ్గల్ – ‘హ్యాష్ టాగ్ ఫ్యాషన్’

“ మీ లక్ష్యాలు దూరంగా, కఠినంగా కనిపించవచ్చు, కాని సరైన సమయంలో అడుగు ముందుకు వేయలంటున్నారు పల్లవి”. 2014 లో ‘హ్యాష్ టాగ్ ఫ్యాషన్’ ను ప్రారంభించిన పల్లవి, మహిళల బలహీనత కాకుండా, వారి బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాషన్ ఉండాలని సూచిస్తారు.

పల్లవీ దుగ్గల్

పల్లవీ దుగ్గల్


ఓ సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన పల్లవీ, తల్లిదండ్రుల మాదిరిగా చార్టర్డ్ అకౌంటెంట్ కాకుండా, తనకు నచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్‌ వైపు అడుగులు వేసింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ తరపున స్కాలర్షిప్‌తో తన కెరీర్ ప్రారంభంకాగా, ఆరు నెలల కోర్సు తరువాత, ఫ్యాషన్ ప్రపంచంలో మరిన్నీ అంశాలు నేర్చుకోవాలని పార్సన్స్ వెళ్లారు. అక్కడ బ్లూమింగ్డేల్స్‌లో తాను చేసిన ఇంటర్న్‌షిప్ తన ఖర్చులకు ఉపయోగపడేది. బ్లూమింగ్ డేల్‌లో సంవత్సరం పాటు ఇంటర్న్‌షిప్ తరువాత చేసిన ఉద్యోగం కారణంగా మర్కండైస్ , ఫైనాన్షియల్ అనాలిసిస్‌లో ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్ నేర్చుకున్నారు పల్లవి.

న్యూ యార్క్ లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసిన పల్లవి, ఇండియన్ మార్కెట్లో సరసంగా దొరికే ఫ్యాషన్ దుస్తులకు కరువు ఉందని భావించారు. ఇండియాలో పెద్దగా దొరకని ఫ్యాషన్ దుస్తులను తన కజిన్స్ కోసం కొనే వారు పల్లవి, నిత్యం ఎయిర్‌పోర్టులో ఆ ఎక్స్‌ట్రా బ్యాగేజ్ కోసం కడుతున్న డబ్బు చూసి, ‘హ్యాష్ టాగ్ ఫ్యాషన్’ ఐడియా పుట్టుకొచ్చింది.

బడ్జెట్‌తో పాటు, కొనుగోళ్లు, డిజైనింగ్, మార్కెటింగ్ వరకు అన్నీ చూసుకునే సామర్ధ్యం పల్లవిలో ఉంది. అంతర్జాతీయ బ్రాండ్ల కోసం పని చేసే ఫ్యాక్టరీలతో పల్లవి ఒప్పందం కుదుర్చుకున్నారు. “మా మెటీరియల్, డిజైనింగ్ ఏ అంతర్జాతీయ బ్రాండ్‌తోనైనా పోల్చుకోవచ్చంటున్నారు పల్లవి.” ఇక మహిళలు సరైన దుస్తులు వేసుకుని అందంగా కనిపిస్తే, వారి విశ్వాసం పెరుగుతుందని, దాని వల్ల వాళ్లంతా సంతోషంగా ఉంటారని అంటున్నారు. ఈ సంతోషం, చిరునవ్వు నేను సమాజానికి ఇవ్వాలనే కోరిక ఉందంటున్నారు.

అనీషా దలాల్, నిరాలీ మల్జీ – ‘కప్ కేక్స్ ఆండ్ క్లోసెట్’

చిన్న నాటి స్నేహితులు అనీషా, నిరాలీ ఇప్పుడు వ్యాపారంలో భాగస్వాములు. ఇద్దరికీ ఫ్యాషన్ పట్ల ఆసక్తితో ఫోన్లో సరదాగా మాట్లకుని ఓ ఫేస్‌బుక్ పేజ్‌ని ప్రారంభించారు. అలా మొదలై, ఎటువంటి ఫ్యాషన్ డిగ్రీలు చేయకుండా, కేవలం ఫ్యాషన్‌పై వారికున్న ఆసక్తి వారిని 2011లో ‘కప్ కేక్స్ ఆండ్ క్లోసెట్’ ప్రారంభించే విధంగా చేసింది.

అనీషా దలాల్, నిరాలీ మల్జీ

అనీషా దలాల్, నిరాలీ మల్జీ


తమ ఫేస్‌బుక్ పేజ్‌లో కొన్ని డిజైన్స్ పెట్టిన ఈ ఇద్దరు మిత్రులకు ఊహించని విధంగా స్పందన రావడంతో, ఈ రంగంపై మక్కువ మరింతగా పెరిగింది. లా, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్‌లో నిరాలీ డిగ్రీ చేయగా, అనీషాకి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉంది.

“కేవలం 20 ఏళ్ల వయసులోనే మేము వ్యాపారాన్ని ప్రారంభించాం. ఆ వయసులో మేము వ్యాపారవేత్తలుగా మారాము, మాకు సొంత ఆఫిస్ లేదు. పెద్దగా పెట్టుబడీ లేదు, వ్యాపారం చేయడానికి ఎంబిఏలు చేయలేదు లేదా ఎంబీఏలు చేసిన ఉద్యోగులు కూడా లేరు. రిస్క్ తీసుకుని ముందుకు సాగామంటున్నారు ఈ ఫ్యాషన్ గాల్స్.”

ఈ ఫ్యాషన్ ప్రయాణంలో సరైన వ్యక్తులను హైర్ చేయడం పెద్ద సమస్యగా మారిందంటున్నారు అనీషా. అయినప్పటికి కప్ కేక్స్ నాలుగో ఏటా ఎనిమిది మంది టీమ్ ఈ సంస్ధలో పనిచేస్తున్నారు. ఇక్కడి పని చేసే ప్రతీ ఉద్యోగి ఓ కుటుంబ సభ్యుడిగా, తమ పని ఎంజాయి చేసే విధంగా వాతావరణం ఉంటుందని అంటున్నారు.

ఇక వ్యాపారవేత్తలుగా వీరిచ్చే సలహా,'' చిన్నగా మొదలు పెట్టి చేసే ప్రతీ పనిని పర్ఫెక్ట్‌గా చేయాలని అంటారు అనీషా, నిరాలీ. "