రిటర్న్స్ తయారీ మొదలు పన్ను చెల్లింపు వరకూ.. అన్ని సేవలూ అందించే 'మేక్ యువర్ ట్యాక్స్'

0

దేశ జనాభాలో 3 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. కొందరికి పన్ను చెల్లింపు అన్నది ఒక సంక్లిష్టమైన లెక్కల ప్రక్రియగా అనిపిస్తే.. మరికొందరు దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆదాయ పన్ను విషయంలో గందరగోళం, ఎవరు పన్ను చెల్లించాలన్న విషయంలో క్లారిటీ లేకపోవడం, రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి గడువు ఏదనే దానిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇన్‌కం ట్యాక్స్ తక్కువ శాతం మంది చెల్లించడానికి కారణం.

అయితే తర్వాత ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చే నోటీసులు చూసుకొని జరిమానాలు చెల్లించుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి సమయంలో పన్నుకు సంబంధించి అన్నీ పూసగుచ్చినట్టు వివరించి, పన్ను దాఖలు ప్రక్రియను చాలా సులభతరం చేసేందుకు Makeyourtax.com ఆవిర్భవించింది.

అలోక్ పాట్నియా 2009లో ట్యాక్స్ మంత్ర (Taxmantra) ప్రారంభించారు. భారత్‌లోని ఎన్నో స్టార్టప్ కంపెనీలు సులువుగా పన్ను చెల్లించడానికి ఇప్పుడు ఇదే ఉత్తమ మార్గంగా ఉండగా.... ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఇండస్ నెట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన అభిషేక్ రుంగ్తాతో కలిసి అలోక్ పాట్నియా Makeyourtax.com ప్రారంభించారు.

అభిషేక్ రుంగ్తా(ఎడమ) అలోక్ పాట్నియా(కుడి)
అభిషేక్ రుంగ్తా(ఎడమ) అలోక్ పాట్నియా(కుడి)

అసలు ఈ Makeyourtax ఏమిటి ?

మేక్ యువర్ ట్యాక్స్ అన్నది ఇండస్ నెట్ టెక్నాలజీస్, ట్యాక్స్ మంత్రలు కలిసి నిర్మించిన సంస్థ. వ్యాపారస్తులు, వ్యక్తులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఆన్ లైన్‌లో ట్యాక్స్ రిటర్నులు రూపొందించడానికి, ఫైలింగ్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. క్లౌడ్ ఆధారిత ఆన్ లైన్ అప్లికేషన్ కావడం వల్ల దీన్ని ఒకేసారి పలువురు ఉపయోగించవచ్చు. ట్యాక్స్ చెల్లింపుదారుడికి, కన్సల్టెంట్లకు మధ్య మంచి సమన్వయం ఉండడానికి కూడా ఇది తోడ్పడుతుంది. కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కు వైట్ లేబుల్ ట్యాక్స్ ఫైలింగ్ గేట్ వే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తుంది.

దీనిపై అలోక్ మాట్లాడుతూ..‘‘Makeyourtaxలో ఫీజులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. నిపుణుల సలహా అవసమైనప్పుడు తగిన సలహాలు ఇచ్చే విధానంతోపాటు పలు అదనపు సేవలు కూడా అందుబాటులో ఉంటాయి’’ అని చెప్పారు.


మేక్ యువర్ ట్యాక్స్‌లో ఉన్న మూడు దశల నావిగేషన్ విధానం వల్ల ఆదాయపు పన్ను రిటర్నులు ఫైలు చేయడం, డాక్యుమెంట్లు హ్యాండిల్ చేయడం చాలా సులభతరమైన పని. ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయ్యే ఐటీఆర్ ఫామ్ విధానం.. మీరు పన్ను చెల్లించడానికి ఏ ఫామ్ సరైందన్న కన్ఫ్యూజన్ లేకుండా చేస్తుంది.

ఆ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ఫీచర్లు -

  • - అన్ని రకాల ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ విధానం.
  • - అన్ని వర్గాల వ్యాపారవేత్తలకూ అనువైనది
  • - ఐటీఆర్ 5, 6 కూడా అందుబాటులో ఉన్నాయి.
  • - ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 6 వరకు అన్ని రకాల ఐటీఆర్ ఫైలింగ్ సేవలు. దీంతోపాటు క్లైంట్ మేనేజ్మెంట్‌కు సంబంధించి ఇతర సదుపాయాలు. ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్స్‌కూ చాలా అనువైనది.
  • - ఎవరైనా సరే తమంతట తాముగా ఇందులో ఆదాయపు పన్ను రిటర్నులను చాలా సులువుగా, పూర్తిస్థాయిలో ఫైల్ చేయవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఇది.
  • - పన్ను దాఖలు ప్రక్రియలో గందరగోళం లేకుండా చేసేందుకు, ట్యాక్స్ సినాప్సిస్ రిపోర్టు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. 24*7 ఈ-మెయిల్, 24*5 ఫోన్/వాట్సాప్ సపోర్ట్.
  • - ఇన్‌స్టలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
  • - యూజర్లు ఇంత మందే ఉండాలన్న నిబంధన లేదు, వాడకం కూడా చాలా సులువు.
  • - క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ అయిన నేపథ్యంలో డాటా కరప్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.
  • - ఇది పూర్తిగా వెబ్ ఆధారిత అప్లికేషన్. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రొఫెషనళ్లు, వ్యాపారవేత్తలందికీ ఇది చాలా అనువైనది.

website