అసలైన ప్రకృతి పలకరింపు ‘లెట్స్ క్యాంప్ ఔట్’

ట్రెక్కింగ్ కంపెనీ సేవలతో నిరుత్సాహంఅద్భుత సేవలతో మనమే ఎందుకు కంపెనీ పెట్టకూడదనే ఆలోచనదాచిన సొమ్ముతో వ్యాపారం మొదలుఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్

అసలైన ప్రకృతి పలకరింపు ‘లెట్స్ క్యాంప్ ఔట్’

Wednesday May 06, 2015,

3 min Read

నిత్యం పని ఒత్తిడితో బతికే మనకి, సముద్రానికి దగ్గరిలో, భూమికి ఎన్నో అడుగుల ఎత్తున ప్రకృతి ఒడిలో నిదురిస్తే అందులో కలిగే ఫీలింగే వేరంటున్నారు ‘లెట్స్ క్యాంప్ అవుట్ ’ ఫౌండర్ అభిజీత్ మాత్రే.

మనందరినీ చాలా విషయాలు మోటివేట్ చేస్తూ ఉంటాయి. కాని వీళ్లకి మాత్రం ఆ త్రిల్ అసలైన ప్రకృతి వాతావరణంలోనే దొరుకుతుందంటున్నారు.

క్యాంపింగ్ సైట్లో ఏర్పాటు చేసిన టెంట్స్

క్యాంపింగ్ సైట్లో ఏర్పాటు చేసిన టెంట్స్


మహారాష్ట్రాలోని అద్భుతమైన ప్రకృతి ఒడిలో బస చేసే సౌకర్యాలను కలిస్తుంది ‘లెట్స్ క్యాంప్ అవుట్’. ‘లోనావాలా’, రాజ్మచీ, ఫనాస్రాయి, తుంగర్లీ, శిరోటాతో పాటు కాశిద్, కాస్, మధేరన్, పంచ్గానీ వంటి అహ్లాదకరణమైన ప్రాంతాల్లో సైట్స్ ఏర్పాటు చేశారు.

గతంలో వివిధ ప్రాంతాల్లో క్యాంప్ అనుభవాలను చూసిన అభిజీత్, వాటి సర్వీస్ క్వాలిటీ, క్యాంపింగ్ పరికరాలు చూసి నిరాశ చెందారు. ఏదైన కొత్తగా చేయాలనుకున్న అభిజీత్ అప్పట్లో చైన్నైలోని ఓ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నారు. అప్పుడు దొరికే రోజువారి అలవెన్స్ మూడేళ్ల పాటు దాచుకుని, ఆ డబ్బే పెట్టుబడిగా ఉపయోగించి ‘లెట్స్ క్యాంప్ అవుట్’ ప్రారంభించారు.

ఇక అభిజీత్ ఆలోచనలకు తోడైన అతని మిత్రుడు అమిత్ జంబోత్కర్ ఆతిధ్య రంగంలో సీనియర్ పదవిని వదిలీ మరీ జట్టుకట్టారు.

పట్టణాలకు దూరంగా.. ప్రకృతి ఒడిలో సేద

పట్టణాలకు దూరంగా.. ప్రకృతి ఒడిలో సేద


“ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం, ఔట్ డోర్ క్యాంపింగ్‌ సాధ్యమైనంత సామాన్యంగా ఉంచుతూ, ప్రకృతిని ఆనందించే విధంగా ఏర్పాటు చేయాలని అనుకున్నామంటున్నారు అభిజీత్. ముందు కొన్ని టెంట్ల సహకారంతో ఒక్క క్యాంప్ గ్రౌండ్‌తోనే ప్రారంభించిన మాకు అనుకోని రీతిలో స్పందన వచ్చిందని అంటున్నారు.”

ఔట్ డోర్‌లో సాహసోపేతమైన క్యాంపింగ్‌పై మక్కువ ఉన్న వారితో ‘లెట్స్ క్యాంప్ అవుట్’ తొలి బ్యాచ్ ప్రారంభమైంది. “గత కొన్నేళ్లలో కుటుంబ సభ్యులు, మహిళలు, స్నేహితులు, జంటలు ఈ క్యాంపులో చేరుతున్నారు. ఈ మధ్య డైలీ లైఫ్‌లో ఉండే ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇలాంటి క్యాంపులను కోరుకుంటున్నారు. స్కై గేజింగ్, ఈ మధ్య కార్పొరేట్స్‌లో మంచి పాపులర్ అవుతోంది. ఇక ‘పెట్స్ క్యాంప్ అవుట్’, ‘ఔట్ అండ్ లౌడ్’ వంటి క్యాంప్స్ కూడా ప్రత్యేకతను చాటుతున్నాయి.

‘లెట్స్ క్యాంప్ అవుట్’ కు ఇప్పటికే మంచి స్పందన వస్తుంది, క్యాంపుల్లో వివిధ పరికరాలతో పాటు, మంచి సర్వీస్, తినడానికి బార్బీక్యూ, రాక్ క్లైంబింగ్, అడవుల్లో రాత్రి పూట జరిగే ట్రెకింగ్ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఖగోళ శాస్త్ర నిపుణుల ద్వారా క్లాసులు కూడా ఉంటాయి.

“ఇక అక్కడి ప్రాకృతిక వాతావరణంతో పాటు గ్రామస్ధులతో ఉన్న సంబంధం కారణంగా అంతా నాచురల్‌గా కనిపిస్తుంది, మా క్యాంప్ సైట్స్ మాకు సొంతంగా ఉండటంతో పాటు, భోజనం కూడా అక్కడి గ్రామాల నుండే ఆర్డర్ చేస్తాము. కార్బన్ ప్రభావం ఉండకూడదని సోలార్ లైట్స్ నే వాడుతున్నాము. క్యాంప్ ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు లేకుండా, అంతా నాచురల్ గా కనిపించే విధంగా స్దానికంగా లభించే వస్తువులనే వాడుతున్నాము, దాని వల్ల స్ధానికులు ఆర్ధికంగా కూడా లాభపడుతున్నారు.” – అభిజీత్.

అభిజీత్ మాత్రే, లెట్స్ క్యాంప్ ఔట్ వ్యవస్థాపకుడు

అభిజీత్ మాత్రే, లెట్స్ క్యాంప్ ఔట్ వ్యవస్థాపకుడు


నాలుగు సంవత్సరాల ఈ ప్రయాణంలో క్యాంపింగ్ రంగంలో అందరి కన్నా ఎక్కువ ఆదరణ పొందటంతో పాటు, దాని వల్ల గ్రామ స్ధాయిలో ఉద్యోగాలను పెంచడం, ఓ గ్రామం మొత్తానికి వనరుల సహకారం అందిస్తున్నందుకు గర్వంగా ఉందనేది వీళ్ల ఆనందం. “ఇప్పటి వరకు మా లక్ష్యం ముంబయి, పుణే మాత్రమే ఉండింది, కాని ఇప్పుడు ఉత్తర భారత దేశంతో పాటు దక్షిణం వైపు కూడా విస్తరించే ప్రణాళికలను సిద్ధం చేసాము. మా ఆలోచనలకు అనుకూలంగా ఉండే ‘సులాఫెస్ట్’, ‘ఎన్ హెచ్ 7’, ‘ఇండియా బైక్ వీక్’, ‘ది లాస్ట్ పార్టి’, లాంటి సంస్ధలతో కూడా పొత్తు పెట్టుకున్నామంటున్నారు అభిజీత్”.

ఖగోళ శాస్త్రంపై అవగాహన పెంచేలా నైట్ హట్స్ దగ్గరే టెలిస్కోప్స్

ఖగోళ శాస్త్రంపై అవగాహన పెంచేలా నైట్ హట్స్ దగ్గరే టెలిస్కోప్స్


మెల్లిమెల్లిగా ఎదుగుతున్న ‘లెట్స్ క్యాంప్ అవుట్’, నిత్యం నేర్చుకునే సాంప్రదాయాన్ని పాటిస్తోంది. 20 మంది గల ఈ టీమ్ ముంబయి, పుణేతో పాటు బెంగుళూరులో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

image


అనుభవం లేని వారు కొంత మంది ఈ రంగంలో రావడం వల్ల ఈ రంగానికే పెద్ద సవాలుగా మారింది, వారి వల్ల ప్రజలు ఇబ్బంది కూడా పడుతున్నారని అంటున్నారు అభిజీత్.

క్యాంపింగ్ అంటే కేవలం వినోదం కోసం చేసే ప్రక్రియ కాదని, ప్రకృతిని ఆస్వాదించే ఓ అవకాశమంటున్నారు అభిజీత్, ఇందులో సేఫ్టీ తో పాటు, వేస్ట్ మ్యానేజ్మెంట్, సోలార్ ప్యానెల్లను వాడటం, వంటి అంశాలు అవుట్ డోర్ క్యాంపింగ్ లో పెద్ద బాధ్యతాయుతమైన పనని అంటున్నారు అభిజీత్.