చీటీ డబ్బులతో కంపెనీ పెట్టాడు! వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు..!

చీటీ డబ్బులతో కంపెనీ పెట్టాడు! వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు..!

Thursday April 07, 2016,

3 min Read


మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అబ్బాయికి పెద్దగా ఆప్షన్స్ ఉండవు. కోర్ సబ్జెక్టులో ఉద్యోగం చేస్తే బాగానే ఉంటుంది. కానీ నవీన్ కథ దీనికి విరుద్దం.బీటెక్ పూర్తయిన తర్వాత విఎఫ్ ఎక్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత డిజైనింగ్ లో ఉద్యోగం. ఇక చివరగా నవీన్ ఇన్నోవేటిక్ అనే ఓ డిజైనింగ్ స్టార్టప్ ప్రారంభమైంది.

అనుకోకుండా వ్యాపారంలోకి

ఫాదర్ ఆరోగ్యం బాగాలేని కారణంగా నవీన్- సొంత వ్యాపారమైన ఫ్యాబ్రికేషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. రెండేళ్లు కొనసాగింది. అప్పటికే విఎఫ్ ఎక్స్ నేర్చుకుని ఉండటంతో అది వదిలేసి ఉద్యోగంలో చేరాడు. తాను పనిచేసిన సంస్థ ఫిల్మ్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ లాంటి కార్యకలాపాలు చేస్తుండంతో వాటిపై గ్రిప్ వచ్చిందని అంటాడు. వ్యాపారంలో నేర్చుకున్న పాఠాలన్నీ ఉద్యోగంలో ఎంతగానో ఉపయోగ పడ్డాయని చెప్పాడు. ఆ తర్వాత ఓయాడ్ ఏజెన్సీ లో జాయిన్ అయ్యాడు. చివరగా నాన్న చీటీ డబ్బులతో 2015లో సొంత కంపెనీ ప్రారంభించాడు నవీన్.

image


నవీన్ ఇన్నోవేటివ్ పనితీరు

కంపెనీ పేరులాగానే పనితీరు కూడా ఎంతో ఇన్నోవేషన్ తో ఉంటుందని నవీన్ చెప్పాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెహికల్ బ్రాండింగ్ చేయాలని తనకు సంప్రదించినప్పుడు దాన్ని ఒక చాలెంజ్ గా తీసుకున్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ కంటే సైబరాబాద్ వెహికల్స్ బ్రాండింగ్ విషయంలో మరింత బాగుండటానికి కారణం నవీన్ క్రియేషనే. లోగో డిజైనింగ్ లో తమ సంస్థ స్ట్రాంగ్ అని అంటాడు. ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లోగోలను డిజైన్ చేశారు. నాలుగు సినిమాలకు కూడా ఈ సంస్థ పనిచేసింది. వెడ్డింగ్ సెట్ డిజైనింగ్ లాంటివి కూడా చేసి పెడతారు. తన సినిమా పోస్టర్ బావుందని రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మరిచిపోలేనిదని అంటాడు నవీన్. వీరు చేసిన సినిమా లోగోలు, పోస్టర్లు చాలా పాపులర్ అయ్యాయి.

హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఓ జిమ్ కోసం పూర్తిస్థాయిలో పనిచేసి వారికి ఓ యాప్ ని కూడా తయారుచేశారు. కోడింగ్ లో ఔట్ సోర్సింగ్ టీం పని చేస్తోంది. ఇటీవలే డీటీవీ అనే ఓ టెలిబ్రాండింగ్ టీవి లోగో తో పాటు అనేక లోగోలు డిజైన్ చేసిందీ సంస్థ. హైదరాబాద్, బాంబే, చెన్నై, బెంగళూరుల్లో వందల మంది క్లయింట్స్ ఉన్నారు. అది అతిపెద్ద అచీవ్మెంట్ అంటాడు నవీన్. వీరితో కోటి రూపాయిలకు పైనే వ్యాపారా లావాదేవీలు జరిపామని చెప్పుకొచ్చాడు.

స్టార్టప్ కోసం డిజైనింగ్ సొల్యూషన్

సాధారణంగా స్టార్టప్ కంపెనీ వెబ్ సైట్ లేదా యాప్ లోగోను బట్టి ట్రాక్షన్ పెరుగుతుంది. లోగోతోనే కంపెనీలు బ్రాండింగ్ చేసుకుంటాయి. స్టార్టప్ ప్రారంభంలో పెద్దగా బడ్జెట్ ఉండదు. తక్కువ మొత్తంతో తమ దగ్గరకు వస్తారని.. వారి బడ్జెట్ లోనే ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్తున్నాడు నవీన్. ఇలా హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 30 స్టార్టప్ కంపెనీలకు పనిచేశానని చెప్పాడు. లోగో, వెబ్ సైట్, యాప్ ఇలా అన్ని రకాల సేవలు అందిస్తామని తెలిపాడు.

image


నవీన్ ఇన్నోవేషన్ టీం

టీం విషయానికొస్తే నవీన్ దీని ఫౌండర్. 2015లో లక్ష రూపాయిల ప్రారంభ పెట్టుబడితో దీన్ని ఆరంభించాడు. అనంతరం బంధువులు, ఫ్రెండ్స్ నుంచి మరో 20 లక్షలు జమచేశాడు. నవీన్ తోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు సంస్థలో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. వీరితో పాటు మరో 10 మంది ఫ్రీ లాన్సర్స్ పనిచేస్తున్నారు.

ప్రధాన సవాళ్లు, పోటీదారులు

ఎక్స్ పీరియన్స్ లేదని ప్రాజెక్ట్ ఇవ్వరు. ఎవరూ ప్రాజెక్టు ఇవ్వకుండా అనుభవం ఎలా వస్తుంది..? మొదట్లో ఇదే పెద్ద సవాలంటాడు నవీన్. ఇన్ని ప్రాజెక్టులు చేసినా ఇండస్ట్రీలో ఉన్న పెద్దపెద్ద సంస్థలతో కంపేర్ చేసి తక్కువ ఖర్చులో ప్రాజెక్ట్ చేయమంటారు. బడ్జెట్ విషయంలో మేం అధిగమించాల్సిన చాలెంజ్ ఇదే అని అంటాడు నవీన్. చిన్న డిటిపి సెంటర్ నుంచి బడా యాడ్ ఏజెన్సీ దాకా పోటీ బాగానే ఉందని చెప్పాడు.

image


భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలు

కార్పొరేట్ ఫిలిమ్స్, స్టార్టప్స్ కోసం యాడ్స్ లాంటివి ఇప్పుడే ప్రారంభించారు. దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలన్నది లక్ష్యం. ఈ ఏడాది చివరికల్లా త్రీడీ యాడ్ షూట్ లో ప్రవేశించాలని భావిస్తున్నారు. క్లయింట్స్ సంఖ్య వేయి మందికి చేరే దాకా పనిచేయడమే టార్గెట్ గా పెట్టుకున్నామని నవీన్ అంటున్నాడు. డిజైనింగ్ లాంటి సేవలను ఆన్ లైన్ లో అందించే టూల్ కోసం వర్కవుట్ చేస్తున్నారు. 

“నాన్న చిట్టీ డబ్బులతో వ్యాపారం ప్రారంభించా. ఆ తర్వాత దాన్ని రొటేషన్ చేశాను. అయితే నన్ను నమ్మి డబ్బులిచ్చినందుకు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యం అని ముగించాడు నవీన్”

website