అమ్మానాన్నల గారాలపట్టి కోసమే ఈ ‘బేబీచక్ర’

చిన్నారులు నడక, నడత కోసం ప్రారంభమైన స్టార్టప్యూనిసెంట్రిక్ జీవితాలకు అవసరమైన సలహాలు,సూచనలుడాక్టర్లతో ప్రత్యేక కేర్ టేకింగ్పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలనుకునే తల్లిదండ్రులకు ఉపయోగపడే బేబి చక్ర

అమ్మానాన్నల గారాలపట్టి కోసమే ఈ ‘బేబీచక్ర’

Sunday June 14, 2015,

5 min Read

కొత్తగా తల్లిదండ్రులైనవాళ్ళు తమ అవసరాలకోసం అక్కడా, ఇక్కడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోట దొరికేట్టు చేసే ఆన్లైన్ ప్లాట్ ఫామ్ బేబీ చక్ర. పిల్లల పెంపకాన్ని సులభం చేసే ఈ సంస్థకి కో ఫౌండర్ నయ్యా సగ్గి. ఆమె ఫ్రెండ్స్ చాలామంది మొదటిసారి పిల్లల్ని కన్నప్పుడు ఎదుర్కున్న ఇబ్బందులే ఆమెకు ఈ ఆలోచన రావటానికి కారణం. అదీకాకుండా పిల్లలకొచ్చే చిన్న చిన్న జబ్బులు మొదలుకొని, పెంచటంలో ఎదురయ్యే ఇబ్బందులదాకా ఆమె అన్నీ ఫేస్ బుక్ గ్రూప్స్‌లో డిస్కస్ చేయడాన్ని చూశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఏ, నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ చేతుల్లో ఉన్న ఈ యువతి 2 వేలకోట్ల విలువచేసే మెటెర్నిటీ, పిల్లల మార్కెట్ లోకి దూరిపోవాలని నిర్ణయించుకుంది. యువర్ స్టోరీ ఆమెను కలుసుకున్నప్పుడు బేబీ చక్ర గురించి తన ఆలోచనలు పంచుకున్నారు.

బేబీ చక్ర ఎందుకు మొదలుపెట్టారు ?

మనం ఆహారం, ఇల్లు, రవాణా ఎలా వెతుక్కుంటామో టెక్నాలజీ వచ్చి మార్చేసింది. అందుకే పిల్లల పెంపకం విషయంలో కూడా టెక్నాలజీ ద్వారా సులభంగా నిర్ణయాలు తీసుకునేట్టు చేద్దామనిపించింది. అందుకే బేబీ చక్ర మొదలు పెట్టాం. ప్రస్తుతానికి 2 వేలకోట్ల మెటర్నిటీ, పిల్లల మార్కెట్ మీద దృష్టిపెట్టాం. బేబీ చక్ర మూడు కోట్ల తల్లులకూ ( తండ్రులకూ ) ఆన్ లైన్లో నిర్ణయాలు తీసుకోవటానికి సాయం చేస్తోంది. డాక్టర్ల ఎంపిక, అస్పత్రులు, బ్లడ్ బాంకులు, ప్లే స్కూల్స్, పిల్లల యాక్టివిటీస్ కి, ఈవెంట్స్, పిల్లల వస్తువులకీ ఏం కావలన్నా ఇక్కడ సలహాలు దొరుకుతాయి.

భర్త మితేశ్ తో నయ్యా సగ్గీ(మధ్యలో)

భర్త మితేశ్ తో నయ్యా సగ్గీ(మధ్యలో)


ఈ రంగంలో ఉన్న రెండు లక్షలకు పైగా సేవలకు బేబీ చక్ర ఒక కేంద్ర బిందువు. వాటన్నిటినీ ఒక చోట చేర్చి నిర్దిష్టమైన టార్గెట్ ఆడియెన్స్ కోసం అందించటం దీని ప్రత్యేకత. మూడు నెలల కిందట మేం ముంబయ్‌లో బేబీ చక్ర బీటా ప్రారంభించాం. అధికారికంగా మొదలు పెట్టకముందే స్థానిక సేవలతో, తల్లులతో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మా లావాదేవీలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా పది వేల మంది విజిటర్స్‌తో బాటు 45 వేలకు పైగా పేజ్ వ్యూస్ నమోదయ్యాయి. మా జాబితాలో 800కు పైగా సేవలు చేర్చాం. అద్భుతమైన నిపుణుల బృందం మా దగ్గరుంది. వాళ్ళు రకరకాల వ్యాసాలు రాస్తుంటారు. కేవలం భారతీయ తల్లిదండ్రులనే దృష్టిలో ఉంచుకొని రాయించిన వ్యాసాలు 250 కి పైగా ఉన్నాయి.

“మేం రెండు రకాల ట్రెండ్స్ గమనించాం. చాలామంది మిత్రులు తల్లిదండ్రులవుతున్నారు. పిల్లల పెంపకం వాళ్ళకు తెలిసిన దానికంటే భిన్నంగా ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తోంది. ఇలాంటి అనుభూతి ఎదుర్కోవటానికి నిజంగా వాళ్ళు సిద్ధంగాలేరు. మరీ ముఖ్యంగా ఈ యువ జంటలు చాలావరకు ఉమ్మడి కుటుంబాలనుంచి విడిపోయి దూరంగా గడుపుతున్నవాళ్ళే. వాళ్ళకు రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇక ఫేస్ బుక్ లో చూస్తే ముఖ్యంగా పిల్లల పెంపకానికి సంబంధించిన ప్రశ్నలు వరదలెత్తుతున్నాయి. ఉదాహరణకు మంచి పిల్లల డాక్టర్ ఎవరు, మంచి గైనకాలజిస్ట్ ఎవరు, ప్లే స్కూల్స్ మంచివి ఎక్కడున్నాయి, డే కేర్ సెంటర్లెక్కడున్నాయి, ఈవెంట్ మేనేజర్లు, స్పెషల్ థెరపిస్టులు, బ్లడ్ బాంకులు తదితర సమాచారం అడిగేవాళ్ళు ఎక్కువయ్యారు.” అని నయ్యా సగ్గి అన్నారు.

image


దీన్ని బాగా తవ్వేకొద్దీ, పిల్లల పెంపకానికి సంబంధించి ఫేస్ బుక్ లో వందలాది గ్రూప్స్ ఉన్నట్టు అర్థమైంది. ప్రజారోగ్యం విషయంలో నాకున్న అనుభవం వలన పెద్దగా ఆశ్చర్యపోలేదుగాని నాణ్యమైన సేవలు, ఉత్పత్తులకోసం వెతకటమనేది ఎంత వత్తిడి పెంచుతుందో, ఎంత సమయం తినేస్తుందో మాత్రం స్పష్టంగా కనబడింది. అదే మమ్మల్ని బేబీ చక్ర రూపకల్పనకు పురికొల్పింది. మీ ప్రాంతంలో అందుబాటులో ఉండే మెటర్నటీ, చైల్డ్ కేర్ సేవలు, ఉత్పత్తులకు పూర్తి సమాచారం ఇవ్వగలిగే ఏకైక ప్లాట్ ఫామ్ అని దీమా వ్యక్తం చేశారామె.

దీంతో పాటు వాళ్ల ప్రాంతాల్లో పాలుపట్టటం, న్యూట్రిషనిస్ట్, ఫామిలీ ఫొటోగ్రాఫర్స్, ఆటవస్తువుల లైబ్రరీ లాంటి సేవలు ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరముంది. తల్లిదండ్రులు రివ్యూలు చదివిన బేబీ చక్ర నిపుణులు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

తల్లిదండ్రులకు అవసరమయ్యే సేవలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం వల్ల వాటిని అందించే వాళ్లతో బేబీ చక్ర బంధం కొనసాగుతూ వచ్చింది. పిల్లలు పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతూ, మారుతూ వచ్చాయి. అలా వాళ్ళకోసం కొత్త సేవలు జోడిస్తూ వెళ్ళటం కాస్త ఖరీదైన వ్యవహారమే. నమ్మకం మీద ఆధారపడి పనిచేసే సేవలు ( ఉదా: డాక్టర్, ప్లే స్కూల్స్, డేకేర్ సెంటర్ ) కేవలం నోటిమాటగా జరిగే ప్రచారానికి పరిమితమవుతూ వచ్చాయి కాబట్టి ఇప్పుడు బేబీచక్ర సరిగ్గా ఆ లోటు భర్తీ చేస్తూ స్థానికంగా అవసరమయ్యే సేవల అందుబాటును సూచించ గలిగింది.

ఈ సంస్థని మొదలుపెట్టటానికి ముందు టీం దాదాపు 600 మంది తల్లులతో మాట్లాడింది. అలాగే 200 సర్వీసులు గుర్తించింది. ప్రస్తుతం ఇంకా ఎదుగుతున్న దశలోనే... అంటే, సైట్ ప్రారంభించిన మూడు నెలల కాలంలోనే దీని ఆదరణ అద్భుతంగా ఉంది. కొన్ని మేజర్ బ్రాండ్లు, సర్వీసులతో వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఏర్పడింది. తమ మీద నమ్మకంతో కొంతమంది రిటైలర్లు కూడా ముందుకొచ్చారు. అవసరానికి సంబంధించి మరో రెండు ఉదాహరణలున్నాయి. అధికారికంగా లాంచ్ చేయటానికి మూడు రోజులముందే...అంటే సర్వర్ హోస్ట్ చేసే రోజుకే మా సైట్ లోకి 90 మంది వచ్చి చేరారు. అంటే, తల్లిదండ్రులు మా యు ఆర్ ఎల్ ను అంత జాగ్రత్తగా గమనిస్తూ, ఎదురుచూస్తున్నారన్నమాట. గమనించాల్సిన ఇంకోవిషయమేంటంటే, మేం తల్లులనే లక్ష్యంగా పెట్టుకున్నాం గాని ఇప్పటిదాకా దాదాపు అంతే సంఖ్యలో మగవాళ్ళు కూడా మా సైట్ లో రిజిస్టర్ అయ్యారని వివరించారామె.

మార్కెట్‌లో ఇతర ప్లేయర్లు

నిర్దిష్టంగా కొంతమంది కోసమే పనిచేసేవాళ్ళు అమెరికాలో ఉన్నారు. అర్బన్ సిట్టర్, వీ స్ప్రింగ్, రెడ్ ట్రైసైకిల్ లాంటివి. భారత్ లో కూడా కొన్ని వెబ్ సైట్స్ ఉన్నాయి కాని అవి కాస్త ఎదిగిన పిల్లలను దృష్టిలో పెట్టుకున్నవి. కానీ బేబీ చక్ర మాత్రం పిల్లల పెంపకంలో ఒక నాణ్యమైన వేదికగా ప్రత్యేకత సంపాదించుకుంది. మేం చాలా ప్రత్యేకంగా తయారవుతున్నాం. ఆ ప్రత్యేకత ఏంటో వచ్చే కొద్ది నెలల్లో మీరే చూస్తారని ఆమె చిరునవ్వులు చిందించారు.

image


ఫ్యూచర్ ప్లాన్స్

మొదటి పైలట్ స్కీమ్ ముంబైలో. చాలా వేగంగా దూసుకెళుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. క్రమంగా ప్రపంచవ్యాప్తం కావాలన్నదే లక్ష్యం. ఎకనమిక్ టైమ్స్, రేడియో మిర్చి, స్టార్టప్ యుకెలో బేబీ చక్రపై ప్రత్యేకమైన ఫీచర్స్ వచ్చాయి. ఎకనామిక్ టైమ్స్ ఒక కేస్ స్టడీ చేస్తోంది. ఆటవస్తువులు అమ్మే హమ్ లేస్ లాంటి సంస్థలతో , ఎన్ ఎమ్ మెడికల్ తో భాగస్వామ్యం కుదిరింది. వీటివలన తమ వెబ్ సైట్ మెంబర్స్ చాలామందిని కలుసుకోగలింది. వాళ్లు సాయం చేయటానికి ముందుకొచ్చారు. అని అన్నారామె.

నిధుల సమీకరణ

భారత్ లోనూ అమెరికాలోనూ ఏంజెల్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. మా విజన్ ని, మాకున్న బలమైన ప్రేమనీ అర్థం చేసుకునే ఇన్వెస్టర్లకోసం చూస్తున్నాం. అలాంటివాళ్ళు కొంతమంది తారసపడటం అదృష్టం. డిజిటల్ మీడియా స్పేస్ మేం పనిచేసుకోవటానికి కొంత చోటు కల్పించింది. ఆ ఆఫీసుతోబాటు అక్కడి వాతావరణం కచ్చితంగా అంతకు ముందు మేం ఇంట్లో పెట్టుకున్న ఆఫీస్ కంటే చాలా మెరుగ్గా ఉందన్నారు నయ్యా సగ్గి .

బేబి చక్ర టీం

నయ్యా సగ్గి తో పాటు మితేశ్ స్కూల్ ఫ్రెండ్స్. అతను ఎస్ ఆర్ సి సి గ్రాడ్యుయేట్. ఆ తరువాత ఢిల్లీలో ఫాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంబీయే చేశాడు. సిటీ, హెచ్ ఎస్ బి సి లాంటి బాంకుల్లో అంతర్జాతీయ కార్పొరేట్ బాంకింగ్ లో ఏడేళ్ళకు పైగా అనుభవముంది. నయ్యా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో 2012 లో ఎంబీయే చేశారు. ఫుల్ బ్రైట్, జె ఎన్ టాటా స్కాలర్ ఆమె. బోస్టన్ లోని మెకెన్సీ అండ్ బ్రిడ్జ్ స్పాన్ గ్రూప్ లో నాలుగేళ్ళకు పైగా పనిచేశారు. ఆరోగ్యం, విద్య రెండూ ఆమెకు ఇష్టమైన రంగాలు, లాభాలకోసం, లాభాపేక్షలేకుండా చేసే విభాగాలమీద ఆమెకు అవగాహన ఉంది. పూర్తిస్థాయి వ్యాపారంలో దిగాక మితేశ్, తనకి బేబీచక్ర ఒక్కటే తమ ప్రపంచంలా బతుకుతున్నామని వివరించారామె. తమ టీంలో మొత్తం ఆరుగురున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సేవలందిస్తున్నారు. దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళటానికి టెక్నికల్ గా అనుభవం ఉన్నవాళ్ళకోసం చూస్తున్నాం. మీరు అలాంటి వాళ్లయితే, లక్షలాది మంది తల్లిదండ్రుల జీవితాల్ని మార్చేయాలన్న మా లక్ష్యంతో చేతులు కలపటానికి [email protected] కి మెయిల్ చెయ్యండి. అని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. జీవితకాలపు అనుభవానికి మేం హామీ ఇస్తామని ముగించారామె.