జీరోగా ఉన్న జేమ్స్ హీరో ఎలా అయ్యాడు..?

జీరోగా ఉన్న జేమ్స్ హీరో ఎలా అయ్యాడు..?

Friday March 18, 2016,

2 min Read


జేమ్స్ ఆల్టూచర్ … ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న పారిశ్రామికవేత్త, రచయిత, వ్యాఖ్యాత. ఈయన 20 కంపెనీలు పెడితే.. 17 కంపెనీలు మూతపడ్డాయి. తట్టుకోలేకపోయాడు. 2002లో జీవితం అయిపోయిందనుకున్నాడు… అంతా శూన్యం. ఏం చేయాలో తెలియదు. ఒత్తిడి తీవ్రమవ్వడంతో కోమాలోకి వెళ్లిపోతాడేమోనని స్నేహితులు భయపడ్డారు. ఇక లాభంలేదనుకుని పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు.

అంతే చిమ్మచీకట్లు అలముకున్న జీవితానికి వెలుగొచ్చింది. అనుభవం నేర్పిన పాఠాలతో 12 ఆల్ టైం బెస్ట్ బిజినెస్ బుక్స్ రాశాడు. ఇప్పుడు జేమ్స్ ఆల్టూచర్ అంటే… అమెరికాలో పెద్ద హీరో. జేమ్స్ జీవితాన్ని పుస్తకాలు ఎలా మలుపుతిప్పాయో… ఆయన మాటల్లోనే చూద్దాం.

నేను 2002లో పూర్తిగా డిప్రషన్ లోకి వెళ్లిపోయాను. స్నేహితులు, సమీప బంధువులు కూడా చాలా హీనంగా చూశారు. ఏం చేయాలో తోచలేదు… ఈ డిప్రషన్ నుంచి బయటపడటం ఎలాగో తెలియలేదు. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇంటా బయట అవమానాలను తట్టుకోలేక గిలగిలా కొట్టుకున్నాను. బెడ్ పై నుంచి లేస్తే ఒట్టు. అసలు జీవితంమీదే విరక్తి పుట్టింది. అంతా అయోమయం… అగమ్యగోచరం. యాంటీ డిప్రషన్ ట్యాబ్లెట్లు వేసుకున్నా… మందులు వాడినా మానసిక ఒత్తిడి మాత్రం తగ్గలేదు. ఒక డాక్టరైతే డిప్రషన్ నుంచి బయటపడాలంటే కనీసం ఎనిమిదేళ్లైనా పడుతుందని చెప్పారు. ఏం చేయాలో తెలియలేదు… మందులు వాడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

ఇక కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాను. పుస్తకాలు చదువుకోవడం మొదలుపెట్టాను. విపరీతంగా చదివాను. ఒక బుక్ పట్టుకుంటే… అయిపోయేవరకు వదిలేవాడిని కాదు. పుస్తకాల నుంచే జీవితాన్ని అరువు తెచ్చుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాను. “ ఛూస్ యువర్ సెల్ఫ్ “ అనే పుస్తకంలో పుస్తకంలో నేను ఇదే విషయాన్ని చెప్పాను. మంచి రైటర్స్ బుక్స్ చదివి భావోద్వేగాలకు లోనయ్యా… వారితో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. మేధస్సు వికసించింది. జీవితంపై అవగాహన పెరిగింది. పుస్తకాలను చదవుతూ నవ్వుకునేవాడిని.

పుస్తకాలు ఒత్తిడిని నుంచి మనిషిని బయటపడేస్తాయి. నా విషయంలో మందులు చేయలేని పని ఇవి చేశాయి. కొత్త ఐడియాలను ఇచ్చాయి. వాటిని అమల్లో పెట్టాను… కొత్త అవకాశాలు పుట్టుకొచ్చి సరికొత్త జీవితాన్నిచ్చాయి. అందుకే ఇప్పటికీ ఏదైనా నేర్చుకోవాలనుకుంటాను. అందుకు పుస్తకాలనే నమ్ముకుంటాను. పుస్తకం చదువుతుంటే వచ్చే ఆ ఫీలింగే వేరు. ఒక్కోసారి మంచి పుస్తకం ఫినిష్ చేశాక… దాని రచయితను కలవాలనిపిస్తుంది. రచయిత దగ్గరకు వెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తేడా ఉంటే కడిగేస్తాను కూడా.

నా వికాసానికి దోహదపడ్డ పుస్తకాలను వివిధ గ్రూపులుగా విభజించాను.

నా జీవితాన్ని కాపాడిన పుస్తకాలు – అవే నన్ను ఆత్మహత్య నుంచి కాపాడాయి. అయితే జేమ్స్ జాయిస్ యూలిసిస్ ను చదవమని నేను సలహానివ్వను. అది చాలా బోరింగ్ . అయితే మనసుపెట్టి చదివితే దాన్ని మించిన పుస్తకం లేదు. ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ అయినా ఎమోషనల్ గా కనెక్టయితేనే ఉపయోగం.

image


నా జీవితాన్ని మెరుగు పరిచిన పుస్తకాలది మరో కేటగిరీ.

మంచి పుస్తకం ఒక్కటి చదివినా చాలు.. జీవితంపై నమ్మకం పెరుగుతుంది. గతంకన్నా బెటర్ గా బతకగలమన్న భరోసా వస్తుంది. కథలు రాసేవారంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కథలనే డిజిటలైజ్ చేస్తే ఇంకా మంచిది. అమెరికాలోని కార్నల్ యూనివర్సిటీలో చదువుకున్న జేమ్స్… పలు టీవీ షోలకు యాంగర్ గానూ, విశ్లేషకునిగానూ వ్యవహరిస్తున్నారు. పలు వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు. మీడియాలోనూ పెట్టుబడులు పెట్టారు. 17 పుస్తకాలను రాసారు… వాటిలో 12 ఆల్ టైం హిట్ అండ్ బెస్ట్ సెల్లింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే 2012లో అంతా కోల్పోయిన జేమ్స్ ఆల్టూచర్… ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద కోటీశ్వరుడు. పడిలేచిన కెరటం.