ఆదాయం తెచ్చిపెట్టే స్టార్టప్ ఐడియాస్.. లేడీస్ స్పెషల్

ఆదాయం తెచ్చిపెట్టే స్టార్టప్ ఐడియాస్.. లేడీస్ స్పెషల్

Tuesday March 15, 2016,

3 min Read


ఆలోచ‌న ఉండాలే కానీ కాదేది స్టార్ట‌ప్ కు అన‌ర్హం. క్ష‌ణాల్ని క‌రెన్సీగా మార్చేందుకు సంక‌ల్పం ఉంటే చాలు ఐడియాలు వాతంట‌త అవే పుట్టుకొస్తాయి. అచ్చంగా మహిళల కోసమే కొన్ని వెరైటీ స్టార్ట‌ప్‌లు గురించి తెలుసుకుందాం...

సాధార‌ణంగా మ‌హిళ‌లు ఖాళీగా ఉంటే చాలా బోర్‌గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారి స‌మ‌యాన్ని వృధా కానివ్వ‌కుండా ఆదాయం తెచ్చి పెట్టే కొన్ని ఐడియాస్ స్టార్ట‌ప్స్ గా మార్చుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి ఎయిర్‌ పోర్టులోనూ, ఇత‌ర వెయిటింగ్ హాల్స్‌లోనూ మ‌హిళ‌లు చాలా లోన్లీగా ఫీల్ అవుతుంటారు. ఆ స‌మ‌యంలో వారు కుటుంబ‌సభ్యుల‌తో, స్నేహితుల‌తో ఫోన్లో మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటారు. ఇలాంటి వెయిటింగ్ హాల్స్‌లో కాఫీ అమ్మ‌డం, పుస్త‌కాలు, న్యూస్ పేప‌ర్లు అమ్మ‌డం వంటివి అంద‌రూ చేసే ప‌నే. కానీ వెరైటీగా మ‌హిళల అవ‌స‌రాన్ని తీర్చే స్టార్ట‌ప్స్ కూడా ఉన్నాయి.

image


1. ఎయిర్‌పోర్ట్‌లో త్రెడింగ్, వ్యాక్సింగ్ స్టోర్ 

సాధాణంగా ఐబ్రోస్, ముఖంలో అవాంఛిత రోమాలు మొలిచిన‌ప్పుడు వాటిని త్రెడింగ్ ద్వారా తొల‌గిస్తుంటాం. కానీ చాలా మంది మ‌హిళ‌లు తీరిక లేక వాటిని అలాగే వ‌దిలేస్తుంటారు. అలాగే చేతుల మీద, కాళ్ల మీద సైతం అన్ వాంటెడ్ హెయిర్స్ మొలుస్తాయి. వాటినీ తీసేసే వీలు చిక్క‌దు. అలాంటి వారికోసం ఎయిర్‌పోర్ట్‌లోని వెయిటింగ్ హాల్‌లో ఓ చిన్న షాప్ లాంటిది ఏర్పాటు చేసుకొని త్రెడింగ్ వ్యాక్సింగ్ స‌ర్వీసుల‌ను అందించ‌వ‌చ్చు. అందుకు ఒక్కో క‌స్ట‌మ‌ర్ నుంచి 200 వ‌ర‌కూ వ‌సూలు చేయ‌వ‌చ్చు. కేవ‌లం 10 నుంచి 20 నిమిషాల్లో మేక్ ఓవ‌ర్ ఫినిష్ అవుతుంది. ఇది ఒకరకంగా లాభ‌సాటి వ్యాపారం.

2. మాల్‌లో ప్లే జోన్ ఏర్పాటు చేయ‌డం..

జన్రల్ గా మాల్స్‌ కి చిన్న‌పిల్ల‌లను తీసుకెళ్తే వాళ్లు అల్లరి బాగా చేస్తారు. మనల్ని షాపింగ్ చేసుకోనివ్వ‌రు. ప్లే జోన్స్ ఉన్న‌ప్ప‌టికీ అవి చాలా ఖ‌ర్చుతో కూడిన‌వి. త‌ల్లిదండ్రులు ద‌గ్గ‌ర‌ లేనిదే ఆ గేమ్స్ పిల్ల‌లు ఆడలేరు. ఒక చిన్న స్టార్ట‌ప్ తో అలాంటి వారి స‌మ‌స్య‌ తీర్చేయ‌వ‌చ్చు. పిల్ల‌ల‌ను మాల్ లో ఒక ద‌గ్గ‌ర చేర్చి చిన్నచిన్న ప‌జిల్స్‌, చెస్‌, క్యారం బోర్డు, చిన్న గేమ్స్ అందుబాటులో ఉంచితే చాలు. వారు హాయిగా టైం పాస్ చేసేస్తారు. తల్లిదండ్రులు టెన్షన్ లేకుండా షాపింగ్ చేయొచ్చు. పిల్ల‌ల‌ను ఓ కంట క‌నిపెడుతూనే వారిని ఆడించినందుకు కాస్త మొత్తం చార్జ్ చేయ‌వ‌చ్చు. ఇలా కూడా ఆదాయం సమకూర్చుకోవ‌చ్చు.

3. ఆన్ లైన్ మెయిడ్ బ్యూరో..

మీ ఇంటి చుట్టు ప‌క్కల ఇళ్ల‌లో ప‌ని చేసేవారంద‌రి వివ‌రాలు సేక‌రించి వారి కాంటాక్ట్ నెంబ‌ర్ల‌ను ఆన్ లైన్‌లో ఉంచి ఓ బ్యూరోను న‌డ‌ప‌వ‌చ్చు. పార్ట్ టైం, ఫుల్ టైం, వ‌న్ డే, ఇలా ఇంటి ప‌నిచేసేవారిని ఒక బ్యూరో లా ఏర్పాటు చేసి ఆన్‌లైన్ సేవల‌ను అందివ‌చ్చు. ఇది కూడా స‌క్సెస్‌ఫుల్ స్టార్ట‌ప్‌గా మారుతుంది.

4. సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ క్లాసెస్‌..

స్కూళ్ల‌లో ఎన్ని పాఠాలు చెప్పినా పిల్ల‌ల‌కు ప్రాక్టిక‌ల్ నాలెడ్జి లేక‌పోతే కష్టం. అయితే, ఇవాళ రేపు స్కూళ్ల‌లో సైన్స్ ల్యాబ్ ఆశించడం టైం వేస్ట్. ఇలాంటి ప‌రిస్థితి నుంచి పిల్ల‌ల‌ను బ‌య‌ట‌ప‌డేసేందుకు ఓ స్టార్ట‌ప్ సిద్ధం చేసుకోండి. 8 నుంచి 12 వ‌య‌స్సు గ‌ల పిల్ల‌ల కోసం సైన్స్ ఎక్స్‌పరిమెంట్ క్లాసెస్ తీసుకోండి. చిన్న లాబోరేట‌రీ ఒక‌టి ఏర్పాటు చేసి పిల్ల‌ల‌కు సైన్స్ పాఠాలు ప్రాక్టిక‌ల్ గా చెప్ప‌ండి. నాలెడ్జికి నాలెడ్జి.. డబ్బులకు డబ్బులు..  

5.సెకండ్ హ్యాండ్ ల‌గ్జ‌రీ స్టోర్‌..

హై సోసైటీ క్లాస్‌లో ఉన్నవారంతా ల‌గ్జ‌రీ వ‌స్తువులను ల‌క్ష‌లు పోసి కొంటుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక హ్యాండ్ బ్యాగే 2 ల‌క్ష‌ల పెట్టి కొనేవాళ్లు లేకపోలేదు. అలాగే ప్రతీ వ‌స్తువులోనూ ల‌గ్జ‌రీని వెతికే వారు.. ల‌క్ష‌ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చుపెట్టేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే, ఫ్యాష‌న్ ట్రెండ్ మార‌గానే వాటిని వ‌దిలేసి కొత్త‌వాటి వెంట ప‌డుతుంటారు. అలాంటి ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌ను పోగేసి ఒకచోట చేర్చి సెకండ్ హ్యాండ్ ల‌గ్జ‌రీ స్టోర్ ఏర్పాటు చేస్తే బోలెడన్ని డబ్బులు. ల‌క్ష‌ల్లో ఉన్న వ‌స్తువులు మ‌న్నిక‌లోనూ చాలా ఏళ్లుంటాయి. అందుకే అలాంటి ల‌గ్జ‌రీ వ‌స్తువులు సెకండ్ హ్యాండ్ వి అయినా మిడిల్ క్లాస్ పీపుల్ ఇంట్రస్ట్ చూపిస్తారు.

ఇంకా ఇలాంటి వెరైటీ స్టార్ట‌ప్స్ ఆలోచించండి, ఆదాయ మార్గాలు అన్వేషించండి.