అన్ని రకాల మెడికల్ టెస్టులకు ఒకే యాప్.. స్టార్టప్ దశలోనే కొనుగోలు చేసిన గూగుల్

1

వైద్య రంగంలో రోజుకో ఆవిష్కరణ జరుగుతోంది. టెక్నాలజీ పుణ్యమాని హెల్త్ సెక్టార్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఆ కోవలోనే మరో ఆవిష్కరణ జరిగింది. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ శ్వేతక్ పటేల్ సియాటిల్ బేస్డ్ హెల్త్ మానిటరింగ్ డివైజ్ ఆవిష్కరించారు. అది స్టార్టప్ దశలో ఉండగానే నిమిషం ఆలస్యం చేయకుండా దాన్ని గూగుల్ కొనుగోలు చేసింది.

సోనోసిస్ హెల్త్ అనే ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన మెడికల్ డివైజ్ గా పనిచేస్తుంది. ఆరోగ్య సంబంధమైన అనేక గణాంకాలను పక్కాగా సేకరిస్తుంది. ఫోన్లోని యాక్సిలెరోమీటర్, మైక్రోఫోన్, ఫ్లాష్, కెమెరాల సాయంతో అనేక రకాల పరీక్షలు లిప్త కాలంలో చేస్తుంది. సెనోసిస్ అనే యాప్ ద్వారా ఊపిరితిత్తుల పనితీరు, హిమోగ్లోబిన్ శాతం వగైరా లెక్కగట్టి చెప్తుంది. ఉదాహరణకు హిమోగ్లోబిన్ పర్సంటేజీ చూడాలంటే వేలిమీద ఒక ఫ్లాష్ ఇస్తే చాలు.. రక్తం సంగతి క్షణాల్లో చెప్పేస్తుంది. అదొక్కటే కాదు.. ఫోన్లో ఉన్న సెన్సార్ల సాయంతో రకరకాల వైద్య పరీక్షలన్నీ రెప్పపాటులో చేయొచ్చు.

వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్వేతక్ నలుగురి సాయంతో ఈ డివైజ్ మీద వర్కవుట్ చేశాడు. అతను జెన్సీ ఇన్ కార్పొరేషన్ అనే సంస్థను అంతకు ముందే స్థాపించాడు. లో పవర్ వైర్ లెస్ సెన్సార్ ప్లాట్ ఫాం కంపెనీకి కో ఫౌండర్ కూడా. భారత సంతతికి చెందిన శ్వేతక్ తయారుచేసిన ఈ హెల్త్ మానిటరింగ్ డివైజ్ స్టార్టప్ దశలో ఉండగానే గూగుల్ దాన్ని కొనుగోలు చేసింది.

Related Stories

Stories by team ys telugu