లోకల్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆన్‌లైన్‌లోకి తెచ్చిన ఫ్యాషనోవ్

ఫాషనోవ్ ప్రారంభించిన మైకా పట్టభద్రులుకోల్‌కతా నుంచి ప్రారంభమైన ఫ్యాషన్ ఇన్ఫర్మేషన్ పోర్టల్స్థానిక స్టోర్లపై సమగ్ర సమాచారమే ఫ్యాషనోవ్ ఆస్తిఫ్యాషన్ ప్రపంచానికే పరిమితం కావడంతో ఆ రంగంపై మరింతగా దృష్టిపెట్టే అవకాశం

లోకల్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆన్‌లైన్‌లోకి తెచ్చిన ఫ్యాషనోవ్

Saturday July 25, 2015,

3 min Read

కోల్‌కతాలో వ్యాపారానికి సువర్ణావకాశం ఉందని భావించిన శరద్ కుమార్, తనుశ్రీ ఖండేల్వాల్ ఇద్దరూ మైకా(గతంలో ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్)లో పరిచమమయ్యారు. ఇంటికి దూరంగా ఉండడంతో.. షాపింగ్ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడ్డారు వీరు. నగరంలో ఆటోవాలాలనో, స్థానిక వ్యాపారులనో కలిసి ఆయా వస్తువులు ఎక్కడ కొనుగోలు చేస్తే బావుంటుంది అని ఎంక్వైరీ చేసేవారు. అయితే ఈ తరహా సమాచారాన్ని ఒక పక్కా విధానంలోకి తీసుకురావాలని ఆలోచించారు వీళ్లు. “ ఏదైనా వెబ్‌సైట్‌లో ఫ్యాషన్ సంబంధిత అన్ని వస్తువులు ఎక్కడ దొరుకుతాయో, ఆయా స్టోర్ల సమాచారముంటే ఎలా ఉంటుంది. ఆ సైట్‌లోనే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటే ? ఆయా షాపులకు రేటింగ్, ధరల వివరాలు, స్టోర్ల ఫోటోలతో కూడిన సమాచారం అందించగలిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు రూపమే ఫాషనోవ్.కాం” అంటారు తనుశ్రీ.

image


ప్రొడక్ట్ డిజైనింగ్, అభివృద్ధిలో శరద్ దిట్ట. ఫ్యాషన్ రంగం, మార్కెటింగ్‌లలో తనుశ్రీకి అపారమైన విజ్ఞానం ఉంది. అంతే వీరిద్దరూ కలిసి ఓ కాన్సెప్ట్ తయారు చేసుకున్నారు. లేటెస్ట్ ఫ్యాషన్లు, వస్త్రాలు, మోడళ్ల కోసం కోల్‌కతా మొత్తం షాపులను జల్లెడ పట్టేశారు. కోల్‌కతాలో వ్యాపారానికి అనుకూలాంశాలు ఎన్నో.. ప్రతికూలం కూడా అన్నే ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడం, సహాయం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండడం, వస్త్రాల విషయంలో ఇది పెద్ద మార్కెట్ కావడం అనుకూల విషయాలు. ఇదే సమయంలో "వ్యాపార దృక్పథం కొంత ప్రతికూలం. రిస్క్ తీసుకునేందుకు ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారాన్ని కొనసాగిస్తే చాలనే భావనే కనిపిస్తుంది. ఏదైనా కొత్తగా సాధించాలనే తపన కనిపించేది కాద"ని చెప్పారు తనుశ్రీ. ఈ తరహా భావజాలం చాలా అడ్డంకులు కల్పించిందని... తమ వెంచర్‌కి పెట్టుబడుల అన్వేషణలో సమస్యలు సృష్టించిందని చెబ్తారు తనుశ్రీ. కానీ వీటన్నిటినీ దాటుకుని.. అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయవంతమైన వ్యాపారం చేస్తున్నారీ జంట.

"ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది, 2014 అక్టోబర్‌లో లాంఛ్ చేసిన దగ్గరనుంచి, 200 బొటిక్‌ల వివరాలను చేర్చగలిగాం. ఫ్యాషన్ ఈ కామర్స్ మార్కెట్‌లో 80 మంది విక్రయదారులుండగా... 6వేల ఎస్‌కేయూ(స్టాక్ కీపింగ్ యూనిట్)ల వివరాలున్నాయి. ప్రారంభంలో ఎలాంటి ప్రచారం లేకుండానే మా ఫ్యాషనోవ్.కాం సైట్‌కి రోజుకు 300 విజిట్స్ ఉండేవి. కస్టమర్లు, అమ్మకందారుల నుంచి బోలెడు ఫోన్లు వచ్చేవి. దీంతో కోల్‌కతాలో మా వ్యాపార మోడల్‌పై నమ్మకం పెరింగిందం"టారు శరద్.

ఆన్‌లైన్2ఆఫ్‌లైన్

ఆఫ్‌లైన్ సమాచారాన్ని, ఆన్‌లైన్‌లో అందించే విభాగం ఓ2ఓలో ఉంటుంది ఫాషనోవ్. ప్రజలు సమాచారాన్ని సైట్ ద్వారా తెలుసుకుని, స్టోర్‌కి వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్యాషనోవ్ విషయంలో మాత్రం.. సైట్లో కూడా ఆర్డర్ చేసే సదుపాయం ఉంది. ఇలాంటి సమాచారం కోసం వెతికేవారు ఇండియాలో చాలా మంది ఉన్నారని జస్ట్ డయల్, జొమాటోలాంటి సంస్థలు హిట్ అయిన విధానాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఫ్లిప్ కార్ట్ వంటి బడా సంస్థలు కూడా అప్పెరల్స్ విక్రయాలు చేస్తున్నా.. ఆ ఒక్క విభాగం కోసమే పని చేస్తుండడం ఫాషనోవ్‌కి బలమని చెప్పాలి. ఇతర ఏ సంస్థల దగ్గరా లేనంతటి సమగ్ర సమాచారం అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశం.

“ సరికొత్త ఫ్యాషన్ అన్వేషించి, అభిప్రాయాలు చెప్పడంతో పాటు, ఈ-కామర్స్ విభాగంలో కూడా ఉన్నాం. అసంఘటిత రంగంలో ఉన్న వ్యాపారులకు, కొంత సంఘటితమైన స్టోర్లకు ఆన్‌లైన్‌లో కూడా అమ్మకాలు చేయగలిగే అవకాశం కల్పించాం. వారికీ ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాన్ని రుచి చూపించాం. ఈ రంగంపై ఇప్పుడు ప్రజల దృష్టి పెడుతున్నారు. మా వెబ్‌సైట్ మొబైల్‌ ఫోన్లకూ అనుకూలంగానే ఉంటుంది. అయితే, ఇంకా మొబైల్ యాప్ లాంఛ్ చేయలేదు. త్వరలో ఆ లోటు కూడా తీర్చేస్తామం"టారు శరద్. 

2-3 నెలల్లో యాప్ లాంఛ్ చేయడంతో పాటు త్వరలో 2-3 నగరాలకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి ఫ్యాషనోవ్‌కి.

ఫ్యాషనోవ్ టీం తామింకా చాలా దూరం ప్రయాణించాలని చెబ్తున్నారు. స్టార్టప్ కంపెనీ ప్రారంభించడం ఏం సులభం కాదు. ఏ బాలీవుడ్ మూవీకి తీసిపోదు మా స్టోరీ అంటారు వీళ్లు. 

"ఏం జరిగినా గుడ్డిగా బిడ్డకు మద్దతు పలికే తల్లి ఉంటుంది. పిల్లల కోసం ప్రపంచాన్ని కూడా ఎదిరిస్తుంది. తండ్రి ఎక్కువగా మాట్లాడరు. అదే సమయంలో మంచి ఉద్యోగాన్ని వదిలేయడం జీవితంలో చేసిన అతి పెద్ద తప్పంటూ హెచ్చరిస్తూ ఉంటారు. రూ.15 లక్షలు ఖర్చుచేసి ఎంబీఏ చదివి... పైసా కూడా సంపాదించలేకపోతున్నారనే పొరుగువాళ్లు ఉంటారు. తమ ధైర్యాన్ని మనసారా పొడిగే స్నేహితులు, విజయం సాధించినపుడు ప్రశంసించి, అపజయం ఎదురైనపుడు ఎగతాళి చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయినా సరే మా కలలను చేరుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నా"మంటారు ఫ్యాషనోవ్ టీం.

వెబ్‌సైట్‌ను ఇక్కడ విజిట్ చేయండి.