ఆరోగ్యకరమైన ఆహారమే ‘హెల్త్ లవర్స్’ లక్ష్యం

ఆరోగ్యకరమైన ఆహారమే ‘హెల్త్ లవర్స్’ లక్ష్యం

Friday August 28, 2015,

2 min Read

రోజురోజుకీ జనంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా తిండి విషయంలో అధికంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ సమయానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నారు. ప్రతి దాన్నీ కెలోరీల చొప్పున లెక్కించుకుని మరీ తింటున్నారు. గజిబిజిగా మారిని నగర జీవితంలో ఇప్పుడిప్పుడే హెల్త్ అనేది ఓ ముఖ్యమైన అంశంగా చేరుతోంది. జిమ్‌లకు ‌వెళ్లడమే కాదు ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఆరగిస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన హెల్త్ లవర్స్ స్టార్టప్ ఇదే విషయాన్ని భారీగా ప్రచారం చేస్తోంది. సరైన ఆహార అలవాట్లతో అన్ని రుగ్మతలనూ దూరం చేయవచ్చు అని అంటోంది. ఇంతకీ ఎవరీ హెల్త్ లవర్స్ ?

హెల్త్ లవర్స్‌లోని ఫ్రెష్ ఫ్రూట్ జూస్ లు

హెల్త్ లవర్స్‌లోని ఫ్రెష్ ఫ్రూట్ జూస్ లు


“ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేం మర్చిపోయే అవకాశమే లేదు” - ప్రవీణ్ నిషాంగి. 

హైదరాబాద్ కేంద్రంగా గతేడాది నిషాంగి ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభమైంది. హెల్త్, నూట్రిషన్ విభాగాల్లో జనానికి సేవచేయాలనే ఉద్దేశంతో ప్రవీణ్ దీన్ని మొదలు పెట్టారు. స్టార్టప్ పేరును , డొమైన్ కూడా 'హెల్త్ లవర్స్' గా ఫిక్స్ చేశారు. ఫ్రెష్ జూస్‌లు, సాండ్విచ్ , సలాడ్, పాస్తా, ఆమ్లెట్‌తో పాటు హెల్దీ చికెన్ లాంటి ఎన్నో రకాలైన ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఇందులో లభిస్తాయి. నెట్‌లో చూసి ఆర్డర్ ఇస్తే ఇల్లు లేదా ఆఫీసుల దగ్గరకే వాటిని చేరవేస్తారు. బంజారాహిల్స్‌లో ఓ స్టోర్ కూడా ఏర్పాటు చేశారు.

ఫౌండర్ ప్రవీణ్ నిషాంగి

ఫౌండర్ ప్రవీణ్ నిషాంగి


ఫ్రెష్ అంటే రియల్లీ ఫ్రెష్

రెగ్యులర్ జ్యూసులతో పాటు కాక్ టైల్స్‌ వంటివి ప్రధానంగా హెల్త్ లవర్స్ స్టోర్‌లో లభించే హెల్దీ జూస్‌లు. ఇలా దాదాపు 60 రకాల జూస్‌లు ఇక్కడ కస్టమర్ల కోసం సిద్ధం చేస్తారు. క్యాలరీలను డివైడ్ చేసి ఏఏ జూస్‌లో ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో వివరిస్తారు. ఈ రోజుల్లో అందరూ ఇన్‌స్టంట్ ఫుడ్‌ను ఇష్టపడడంతో జూస్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే ఇంటి నుంచి కష్టపడి తెచ్చుకోవాల్సిన అవసరంలేకుండా డోర్ దగ్గరికే ఫ్రెష్ ప్రొడక్ట్‌ను డెలివర్ చేస్తామంటోంది హెల్త్ లవర్స్.

టార్గెట్ కస్టమర్స్

హెల్త్ లవర్స్ కు ప్రత్యేకంగా టార్గెట్ కస్టమర్లు లేకపోయినా.. ఎక్కువగా హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి తమ సేవలు అందిస్తామని అంటున్నారు. సిటీలో కార్పొరేట్ ఉద్యోగులు, ఐటి రంగంలో ఉన్నవారు ఎక్కువగా తమకు కస్టమర్లుగా ఉన్నారు. వీరికి సౌకర్యవంతంగా ఉండేలా తమ సేవలను విస్తరించారు. ఇప్పుడు వివిధ రంగాలపై కూడా దృష్టిసారిస్తున్నట్టు చెబ్తున్నారు ప్రవీణ్.

భవిష్యత్ ప్రణాళికలు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రస్తుతం ఒక స్టోర్ ఉంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారు. ఫ్రాంచైజీలను ఓపెన్ చేశాం. హైదరాబాద్‌ సహా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే ప్రణాళిక ఉంది. కస్టమర్ల నుంచి వస్తున్నడిమాండ్‌తో యాప్ కూడా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు.