ఈ-కామర్స్ రంగంలో గందరగోళానికి 2016 బడ్జెట్ చెక్ పెడుతుందా..?

Thursday February 25, 2016,

4 min Read

దేశంలోని చిల్లర వ్యాపారంలో ఆన్ లైన్ రిటైల్ రంగం వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. అయితే ఈ రంగంలో స్టార్టప్స్ గా వచ్చిన కంపెనీలు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ 15.5 బిలియన్ డాలర్లు. అంటే లక్షా ఐదువేల కోట్ల రూపాయల లావాదేవీలు. స్నాప్ డీల్ విలువ… 6.5బిలియన్ డాలర్లు. అంటే 44 వేల కోట్ల రూపాయలు. షాప్ క్లూస్ కంపెనీ విలువ 7వేల 4 వందల కోట్ల రూపాయలు. 2016లో దేశంలో ఈ కామర్స్ వాటా… 38 బిలియన్ డాలర్లు. అంటే… 2 లక్షల 60 వేల కోట్లకు చేరుతుందని అంచనా. 

దేశంలో ఈ కామర్స్ రంగం పరుగులు తీస్తోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినా కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఈ కామర్స్ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. ఆఫ్ లైన్ రిటైలర్స్- ఆన్ లైన్ కంపెనీలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డీ.ఐ) రాకకు ఆటంకంగా మారుతోంది. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల చిన్న షాపులు చికితిపోతాయంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 2015 నవంబర్ లో సింగిల్ బ్రాండ్ రిటైలర్ రంగంలోకి నూరుశాతం ఎఫ్డీఐలను ప్రభుత్వం అనుమతించింది. ఇది ఆన్ లైన్ అమ్మకాలకు కూడా వర్తిస్తుంది. అయితే మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి ఎఫ్డీఐలను అనుమతిస్తేనే పూర్తిస్థాయి ఫలితాలు అందుతుందంటున్నారు విశ్లేషకులు. 21 ఈ కామర్స్ వెబ్ సైట్లు ఎఫ్డీఐ నిబంధనలను ఉల్లంఘించాయని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టాలని అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపపోతే ఈ కామర్స్ మార్కెట్లో ఆందోళనకర వాతావరణం వచ్చేది. 

కేంద్ర ప్రభుత్వ నినాదం స్టాండప్ ఇండియా- స్టార్టప్ ఇండియా. ఈ కామర్స్ రంగంలోకి కొత్త ఊపు తీసుకొచ్చింది.దీనికి సంబంధించిన ప్రోత్సహకాలను అరుణ్ జైట్లీ బడ్జెట్ – 2016లో ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. సింగిల్ బ్రాండ్ లాగే… మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోనూ నూరుశాతం ఎఫ్డీఐలకు అనుమతించాలని ఈ కామర్స్ సంస్థలు కోరుతున్నాయి. ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ కు ప్రభుత్వం సరైన నిర్వచనం ఇచ్చి ఈ రంగంలో గందరగోళం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఈ కామర్స్ అంటే ఏమిటి?

ఇంటర్నెట్ ఆధారంగా జరిపే వాణిజ్యపరమైన లావాదేవీలను ఈ కామర్స్ అంటారు. టెక్నోపాక్ సంస్థకు చెందిన అర్వింద్ మాత్రం… వ్యాపారం అనే పదానికి ఫిజికల్ ఛానల్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆధారంగా నిర్వచనం ఇవ్వాలని కోరుతున్నారు. “ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే … కస్టమర్ కు సరుకులుగానీ, సేవలుగానీ అందించడం అన్నమాట. ఆన్ లైన్ వ్యాపారానికి, ఆఫ్ లైన్ వ్యాపారానికి తేడా ఉండకుండా… రెండింటికీ ఒకే నిర్వచనం ఇవ్వడం మంచిది. అలా అయితేనే ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు వస్తాయని అర్వింద్ చెబుతున్నారు. ఈ కామర్స్ గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఇదేమీ జాతి భద్రతకు సంబంధించిన అంశం కాదు. డబ్బు ఎక్కడ నుంచి వస్తే ఏమిటి? మనకు పెట్టుబబడులు కావాలంటారు అరవింద్.

ఈ- కామర్స్ సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఈ కామర్స్ కంపెనీలు కేవలం మధ్యవర్తులుగా పనిచేస్తాయి. వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. అమ్మకందారులు మాత్రమే పన్నులు కడతారు. కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.

అసలెందుకు ఈ గందరగోళం వచ్చింది?

ఈ కామర్స్ రంగంలో కావాల్సినంత కన్ ఫ్యూజన్ ఉంది. 2016 జనవరిలో అసలు మార్కెట్ ప్లేస్ ను… ఎఫ్ఐడీ చట్టాలు గుర్తించడం లేదంటూ డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ తెలిపింది. ఆరు వారాల్లోనే మాట మార్చి… మార్కెట్ ప్లేసుల్లో నూరుశాతం ఎఫ్డీఐలకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో గందరగోళం పెరిగింది. అసలు ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ ను డీఐపీపీ నిర్వచించలేదు. ఫ్లిక్ కార్ట్, స్నాప్ డీల్, అమేజాన్ లాంటి సంస్థలు ఆన్ లైన్లో అమ్మకాలు చేపట్టొచ్చని మాత్రం చెప్పింది. దీంతో చిన్న కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. మార్కెట్ ప్లేసెస్ అంటే ప్రత్యక్ష అమ్మకందారులని… కమిషన్ ఏజెంట్లు కావని మొరపెట్టుకున్నాయి.

ఈ కామర్స్ కంపెనీలేమీ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అవి ఆమడదూరంలో ఉంటాయి. అయితే మార్కెట్ ప్లేసులో జరిగే లావాదేవీలపై కొంత గందరగోళం ఉన్నమాట మాత్రం వాస్తవమే.” ఖైతాన్ అండ్ కంపెనీ పార్టనర్ గణేశ్ ప్రసాద్.

అయితే కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ రంగానికి ఒక నిర్ధిష్టమైన నిర్వచనం మాత్రం ఇవ్వడం లేదు. ఆన్ లైన్ మార్కెట్ కు సరైన నిర్వచనం లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మార్కెట్ ప్లేస్, ఈ కామర్స్ సెల్లర్స్ కు పరిపూర్ణ నిర్వచనం ఇవ్వాలని ఆల్ ఇండియా ఆన్ లైన్ వెండర్స్ అసోసియేషన్ కోరింది. లేకపోతే దీనికి ఒక చట్టబద్ధతంటూ రాదని అభిప్రాయపడింది. ఉదాహరణకు కొన్నేళ్ల క్రితం వరకు మ్యూచువల్ ఫండ్స్ ను గుర్తించలేదు. ఒక్కసారి కేంద్రం నిర్వచనం ఇచ్చాక వాటికి ఆదరణ పెరిగింది. సరైన నియంత్రణలు - క్రమద్దీకరణలు రావడంతో మోసాలు తగ్గాయి.

ప్రభుత్వం –ఎఫ్డీఐ : సమస్యలు

మార్కెట్ ప్లేసెస్ పై మొట్టమొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం విరుచుకుపడింది. ఈ కామర్స్ కంపెనీలకు నోటీసులు పంపింది. వ్యాట్ కట్టి తీరాల్సిందేనంటూ ఆదేశించింది. అయితే వ్యాట్ కట్టలేమని, అది ఎఫ్డీఐ నిబంధనలకే విరుద్ధమని ఈ కామర్స్ సంస్థలు తెలిపాయి. కస్టమర్లనుంచి తాము వ్యాట్ వసూలు చేయలేమని స్పష్టం చేశాయి. దీంతో ఈ కామర్స్ కంపెనీలు- కర్ణాటక సర్కార్ మధ్య వివాదం ముదిరింది. చివరికి కేంద్రం జోక్యం చేసుకోవాల్సివచ్చింది.

“రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా ఈ కామర్స్, మార్కెట్ ప్లేసుల గురించి సరైన అవగాహన లేదు. డీఐపీపీ నిబంధనలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కామర్స్ కంపెనీలు ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. అయితే కొంతమంది పిటిషన్ వేయడంతో ఈ విషయంలో విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కామర్స్ కంపెనీలకు నోటీసులిచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపింది అంటారు“ ప్రశాంత్ ఖతోర్ (ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామి)

భవిష్యత్ ఆశాజనకం

రిటైల్ వ్యాపారాన్నంతటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఆన్ లైన్ వ్యాపారం మరింత సులువు అవుతుంది. విధానాలను సరళతరం చేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. బిజినెస్ ఎలా చేసుకోవాలన్నది వ్యాపారులకు విడిచిపెట్టాలి. ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకోవడం మంచిదికాదంటున్నారు థర్డ్ ఐ సైట్ కంపెనీ సీఈఓ దేవాన్షు దత్తా. 

 “ ఎప్ఐడీలు అనుమతించాలా వద్దా అన్నది కేవలం ఎగ్జిక్యుటివ్ తీసుకోవాల్సిన నిర్ణయం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్… ఎఫ్డీఐలను అనవసరంగా పార్లమెంట్ లోకి తీసుకొచ్చారు. దీనిపై ఈ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎఫ్డీఐలు కావాలా వద్దా అన్నదానిపై ప్రధాని మోదీ లేదా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక నిర్ణయం తీసుకోవాలి. డీఐపీపీ ఒక సరళతరమైన నిర్వచనం ఇచ్చి ఈ కామర్స్ రంగాన్ని పరుగులెత్తించాలి." అర్వింద్ 

ఈ కామర్స్ కు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఆధారంగానే ఎఫ్డీఐలు రావడం… రాకపోవడం ఉంటుంది. విధానాలను సరళీకరించాలి. అన్నింటికన్నా ముందు ఈ కామర్స్ అంటే ఏమిటో నిర్వచించాలి. ఈ రంగంలో ఉద్యోగవకాశాలు కూడా లక్షల్లో వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.