రైతుల ఆత్మహత్యలు ఆగాలని స్కూటర్ మీద నాలుగు దేశాలు తిరిగాడు

రైతుల ఆత్మహత్యలు ఆగాలని స్కూటర్ మీద నాలుగు దేశాలు తిరిగాడు

Wednesday July 19, 2017,

2 min Read

100 సీసీ స్కూటర్ మీద మహా అయితే ఆఫీసుకి వెళ్లిరావొచ్చు. మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తేవొచ్చు. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయొచ్చు. అంతకు మించి పెద్దగా జర్నీ చేయడానికి సహకరించదు. కానీ 30 ఏళ్ల అరుణబ్ అనే డేటా సైంటిస్ట్ ఏం చేశాడో తెలుసా? తెలియాలంటే ఈ స్టోరీ చదవండి..

image


రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతులకు సమస్యలున్నాయి. ఇలాంటి పదాలు వినడమే గానీ నిజంగా వాళ్లకు ఏం కష్టాలున్నాయి? వాళ్లకున్న సమస్యలేంటో చాలామందికి తెలియదు. తెలుసుకోవాలని ఉన్నా, కరెక్టుగా వాళ్లకు ఏం కావాలో తెలియజేప్పేవాళ్లు లేరు. ఉదాహరణకు రెండేళ్ల క్రితం చెన్నయ్ వరదలనే చూసుకుంటే.. జలదిగ్బంధంలో ఉన్న తమిళ తంబీల కోసం యావత్ దేశమే ఏకమైంది. సెల్ ఫోన్ చార్జర్ల దగ్గర్నుంచి తినే బర్గర్ల దాకా ఎవరికి చేతనైన వాళ్లు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వాళ్లకు ఏం జరిగిందో జనానికి తెలుసు కాబట్టే సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏం జరిగింది..? వాళ్లకు ఏం చేయాలి..? ఇదొక్కటే అర్ధమైతే చాలు. ఆదుకోడానికి, చేయూత అందివ్వడానికి భారతీయు మనసు ఎప్పటికీ విశాలమే!

నెమళ్లు సెక్స్ చేస్తాయా చేయవా అనే టాపిక్ మీద గంటలు గంటలు ఉపన్యాసం దంచుతారు కానీ, అప్పుల బాధతో రైతు చనిపోతే మాత్రం కించిత్ విచారం వ్యక్తం చేయరు. సరికదా ఇగ్నోర్ చేస్తారు. సైఫ్ అలీఖాన్ కొడుకు పేరు తైమూర్ అని పేరుపెడితే పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తారు. అదే రైతు ఉసురు తీసకుంటే చిన్నా సాడ్ ఎమోజీ పెట్టి రిప్ అంటారు. నిజంగా అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు .

image


నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం అప్పుల బాధలు, కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా రైతులే ఉన్నారు. మునుపటి కంటే 2017లో రైతు సంక్షోభం దేశాన్ని కుదుపేస్తోంది. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఢిల్లీ, తమిళనాడు, కర్నాటకలో ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. జూన్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో హింస చెలరేగింది. ఢిల్లీలో 41 రోజుల పాటు వందలాది మంది రైతులు జంతర్ మంతర్ దగ్గర నిరస వ్యక్తం చేశారు.

తరచిచూస్తే రైతు సమస్య అనేది వ్యక్తిగత సమస్య కాదు. అది దేశ సమస్య. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు చేతకాక కూనారిల్లిపోతే దేశ ప్రగతి కుంటుబడినట్టే. అందుకే అరుణబ్ అనే యువకుడు రైతు సమస్యలే ప్రధానంగా తనకున్న చిన్నపాటి హండ్రెడ్ సీసీ స్కూటర్‌తో బయల్దేరాడు. అన్నదాతల సమస్య మూలాలను చేతనైనంత వడమరిచి చెప్పాలని ప్రయాణం ప్రారంభించాడు.

నాలుగు దేశాలు.. 19 హిమాలయన్ పాసెస్, అత్యంత క్లిష్టమైన రోడ్డుమార్గాలు, తుఫాను, వర్షాలు, గాలిదుమారం, డెడ్లీ మాన్ సూన్స్.. అయినా జర్నీ ఆగలేదు. గతంలో గంటసేపు కూడా స్కూటర్ నడపిన దాఖలాల్లేవు.ప్రయాణం కొత్తగా ఉంది. కొండలు, గుట్టలు, లోయలు, పర్వతసానువుల్లో చిన్నపాటి స్కూటర్ ఎదురు లేకుండా సాగిపోయింది. బెంగళూరు నుంచి మయన్మార్, థాయ్ లాండ్ వరకు 110cc టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మీద ప్రయాణించాడు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలను కవర్ చేస్తూ సాగాడు. 6,786 కిలోమీటర్లు 25 రోజుల్లో చుట్టేశాడు.

image


మళ్లీ ఏడాది తర్వాత, అంటే 2016లో అంతకంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలని భావించాడు. ఆగస్టులో ముంబై నుంచి స్టార్ట్ అయ్యాడు. రాయ్ పూర్, కోల్ కతా, ఢాకా, థింపు, పరో, ఖాట్మండూ, పోఖ్రా, బెని, ముక్తినాథ్‌, సిమ్లా, రాంపూర్ ముషర్, ఖాజా, చంద్రతాళ్ లేక్, మనాలి, రోటాంగ్ పాస్, త్సొమొరిరి, లేహ్‌, ఖార్దంగ్-లా, చాంగ్ల్-లా, సియాచిన్ బేస్ క్యాంప్ వరకు జర్నీ సాగింది.

ఆగిన ప్రతీ చోట రైతు సమస్యలను విడమరిచి చెప్పాడు. వాళ్లను ఎందుకు ఆదుకోవాలో వివరించాడు. రైతు అవసరం దేశ ప్రజలకు ఎంత వుందో తెలియజేశాడు. తన ఒక్కడి జర్నీతో సమస్య మొత్తం తీరిపోతుందనేది అతడి ఉద్దేశం కాదు. అట్లీస్ట్ రైతుల సమస్యలు ప్రజలకు అర్ధమైతే చాలు. ఇదే అతడి లక్ష్యం.