ఐఐటీ నుంచి పుట్టిన 'సాత్విక్' ఆహారం

భారతీయ సంప్రదాయ రుచులనందించే సాత్వికో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా లభించే ఆహార పదార్థాలుపూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ అందించే సాత్వికో రెస్టారెంట్విదేశాల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు

ఐఐటీ నుంచి పుట్టిన 'సాత్విక్' ఆహారం

Saturday June 06, 2015,

2 min Read

రూర్కెలాలోని ఐఐటీలో చదువుతున్నప్పటి నుంచి ప్రసూన్ గుప్తా, అంకుశ్ శర్మ ఒకరికొకరు తెలుసు.. పదేళ్ళుగా వారి స్నేహం కొనసాగుతోంది. రూర్కీలో చదువుకుంటున్నప్పుడే వాళ్లు టెక్ బడ్డీ (TechBuddy) అనే సంస్థను క్యాంపస్ లోనే ప్రారంభించారు.. ఐటీ నేపథ్యంలోని యువ గ్రాడ్యుయేట్లకు తమ టాలెంట్ ను డెవలప్ చేసుకునేందుకు ఈ సంస్థ సాయం చేస్తుంది..

సాత్వికో లో మాత్రమే లభించే అల్పాహారం

సాత్వికో లో మాత్రమే లభించే అల్పాహారం


టెక్ బడ్డీని సక్సెస్ చేయడంలో సఫలమైన ఈ ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు తర్వాత ఫుడ్ బిజినెస్ లోకి ఎంటరయ్యారు. దానికి స్వాతికో (Sattviko) అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా శాఖాహార రెస్టారెంట్. భారతీయ సంప్రదాయ రుచులను అందిస్తుంది. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేశారు. అన్నిటికీ మించి భారతీయ వేదాల్లో చెప్పినట్టు సాత్వికాహారాన్ని మాత్రమే అందిస్తుంది. సాత్వికాహారం అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయకుండా చేసిన ఆహారం అని అర్థం.

ప్రాంతీయ, దేశీయ రుచులతో పాటు మెక్సికన్ వంటకాలను కూడా అందిస్తుంది సాత్విక్ రెస్టారెంట్. భోజనం, సలాడ్లు, అల్పాహారాలు, పానీయాలు.. ఇలా అన్నీ ఇందులో లభిస్తాయి. “ భారతీయ వంటలకు కొత్త అర్థం చెప్పాలని మేం భావిస్తున్నాం. అందుకే 'సబ్సే హెల్తీ, సబ్సే టేస్టీ' అనే ట్యాగ్ లైన్ పెట్టాం. దీని ఉద్దేశమేంటంటే భారతీయ సంస్కృతిలో భాగమైన సాత్వికాహారాన్ని అందించడమే” అంటున్నారు ప్రసూన్.

హాబీతో ఫుడ్ బిజినెస్ లోకి ఎంటరైన ఈ ఇద్దరూ ఇప్పుడు దీన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. “ఆరంభంలో పెట్టుబడికి మాకేమీ ఇబ్బందులు తలెత్తతలేదు. మూణ్ణెల్లలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుని సాత్వికోని ప్రారంభించేశాం” అని చెప్పారు అంకుశ్.

వేదాల్లో చెప్పినట్టుగానే ఆహారం తయారీ

వేదాల్లో చెప్పినట్టు భోంచేస్తున్నప్పుడు ఇది నాలుకకు అంటుకోకుండా సులువుగా అన్నవాహికలోకి వెళ్లిపోయేదే సాత్వికాహారం. ఇది ఆరంభమే అయినా వ్యాపారం బాగా సాగుతోంది. “ ఆహార పదార్థాలను అందరూ అభినందిస్తున్నారు. ఆరేడు నెలల్లో దీన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాం” అంటున్నారు ప్రసూన్.

టెక్ బడ్డీ (TechBuddy) సాత్వికో (Sattviko) తర్వాత ప్రసూన్ స్వరాజ్ నీతి (Swarajneeti) అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఇది పూర్తిగా లాభాపేక్షలేని స్వచ్చంధ సంస్థ. టెక్నాలజీ ద్వారా ప్రజాస్వామ్య సంస్కరణలకోసం ఈ సంస్థ కృషిచేస్తుంది.

ప్రస్తుతం సాత్వికో ఢిల్లీ కేంద్రంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కార్పొరేట్ సంస్థల్లో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను పెంపొందించే లక్ష్యంతో ఇది కృషి చేస్తోంది. “ న్యూయార్క్, లండన్ లలో కూడా సాత్వికోను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. మెక్ డొనాల్డ్స్, సబ్ వేల మాదిరిగా భారతీయ ఆహారాన్ని విదేశాల్లో పరిచయం చేయడమే మా లక్ష్యం” అంటున్నారు ప్రసూన్.

సాత్వికోలో వెజిటేరియన్ పుల్కా

సాత్వికోలో వెజిటేరియన్ పుల్కా


విదేశాలతో పాటు దేశవ్యాప్తంగా వందకుపైగా ఔట్ లెట్లను ఏర్పాటు చేయాలనేది ఈ యువ పారిశ్రామికవేత్తల టార్గెట్. “విశ్వవ్యాప్తంగా సాత్వికోను ఒక బ్రాండ్ నేమ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఆరోగ్యకర, పోషకవిలువులున్న ఆహారానికి పర్యాయపదంగా సాత్వికోను చెప్పుకోవాలనేది మా లక్ష్యం” అంటున్నారు అంకుశ్.

విస్తృత అవకాశాలు

భారత్ లో సుమారు 40 కోట్ల మంది శాకాహారం తీసుకునేవారే. ప్రపంచంలో అత్యధిక శాకాహారులుండేది కూడా భారత్‌లోనే..! ప్రస్తుతం F&B ట్రెండ్స్ ప్రకారం భారత్‌లో శాకాహార రెస్టారెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కస్టమర్లకు మంచి సేవలందించేందుకు విదేశీ దిగ్గజ సంస్థ KFC కూడా వెజిటేరియనే మెనూను అందిస్తోంది.

“ భారత్ లో చాలా మంది పూర్తి మాంసాహారులు కాదు. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో శాకాహారాన్ని తీసుకునేందుకే ఎక్కువగా ఇష్టపడతారు” అంటున్నారు అంకుశ్. ఓ సర్వే ప్రకారం 2020 నాటికి ప్రపంచంలో 30 శాతం మంది శాకాహారులుగా మారిపోతారని తెలుస్తోంది. ఇది చాలా ఈ మార్కెట్ లో వృద్ధి చెందడానికి విస్తృత అవకాశాలున్నాయని చెప్పడానికి.!

WEBSITE-SAATVIKO