త్వరలో కార్బన్ డై ఆక్సైడ్ ఇంధనంగా మారబోతుందోచ్..!!  

0

బొగ్గుపులుసు వాయువు ఇంధనంగా మారడమేంటని ఆశ్చర్యంగా ఉందా? ఇంధనమే కార్బన్ రూపంలో బయటకు పోతుంటే.. దాన్నే రీసైకిల్ చేయడం మిరకిలే కదా.. ఇంతకూ అది ఎలా సాధ్యమంది? మీరే చదవండి.

యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం కర్బన ఉద్గారాలు. విపరీతమైన కార్బన్ డై ఆక్సైడ్ మానవాళి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తోంది. కాలుష్యం పెరిగిపోయి భూమి సలసల కాగుతోంది. ఇంతటి డేంజర్ జోన్ లో ఉన్న మనకు ఇదొక చల్లటి కబురే. పర్యావరణ సమతౌల్యానికి ఇంతకు మించి కావాల్సిందేంటి?

ఇదంతా ల్యాబులో పనిగట్టుకుని, బుర్రబద్దలు కొట్టుకుని, జుట్లు, గెడ్డాలు పెంచేసుకుని తయారు చేసిన ఫార్ములా కాదు. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే ఈ ఆవిష్కరణ అనుకోకుండా.. ఒక యాక్సిడెంటల్ గా జరిగింది. నమ్మశక్యంగా లేదు కదా..

అమెరికాలోని ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ ఎనర్జీ డిపార్టుమెంటులో పనిచేస్తున్న కొందరు సైంటిస్టులకు కాకతాళీయంగా కళ్లముందు కనిపించింది. ఒక కెమికల్ రియాక్షన్ చేస్తున్న క్రమంలో కార్బన్ డై ఆక్సైడ్ ఇథెనాల్ గా మారిపోవడం గమనించారు. ఇంకేముంది మొదటి అడుగు పడింది. గ్రీన్ హౌజ్ వాయువులను ప్రాణవాయువుగా చేసేందుకు పట్టు దొరికింది. దీనిపై మరింత పరిశోధన చేయాలని శాస్త్రవేత్తల టీం ప్రయత్నిస్తోంది. ముందుగా పారిశ్రామిక అవసరాల కోసం రీసెర్చ్ చేస్తామంటున్నారు.

నిజానికి సీఓటూ నుంచి ఇథెనాల్ వెలువడటం అనేది జరిగే పనికాదు. కానీ ఇక్కడ ఫార్ములా అడ్డం తిరిగింది. అయితే అదీ మన మంచికే అయిందనేది అందరి ఫీలింగ్. ఒకవేళ వీళ్ల పరిశోధన ఫలప్రదమైతే కర్బన ఉద్గారాల మీద కత్తియద్ధం మొదలైనట్టే. 

Related Stories

Stories by team ys telugu