మీ స్టార్టప్ కంపెనీకి లీగల్ హెల్ప్ కావాలా...

ఆన్‌లైన్ అగ్రిమెంట్లకు కేరాఫ్ లెగిస్టిఫై.కామ్

మీ స్టార్టప్ కంపెనీకి లీగల్ హెల్ప్ కావాలా...

Thursday April 14, 2016,

4 min Read


అనుభవిస్తే కానీ తత్వం బోధపడదు. దిగితే కానీ లోతు తెలియదు. వ్యాపారం కూడా అంతే. వ్యాపారం అంటే కస్టమర్లను ఆకర్షించడం ఒక్కటే కాదు.. బిజినెస్‌ను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని లీగల్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయాలి. స్టార్టప్ కంపెనీలను నిర్వహించేందుకు ముందుకొస్తున్న యువ ఆంట్రప్రెన్యూర్లకు ఇప్పుడు లీగల్ ఫార్మాలిటీస్ పెద్ద తలనొప్పిగా మారాయి. ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అన్నది సమస్యగా మారింది. ఇవే సమస్యలు తొలి స్టార్టప్‌ను ప్రారంభించబోయే ముందు అక్షత్ సింఘాల్‌కు ఎదురయ్యాయి. అందుకే ఇలాంటి సమస్యలు యువ ఆంట్రప్రెన్యూర్లకు ఎదురు కాకుడదన్న లక్ష్యంతో ఆన్‌లైన్ అగ్రిమెంట్ ప్లాట్‌ఫామ్‌ లెగిస్టిఫై ప్రారంభించారు. రెంటల్ అగ్రిమెంట్స్, కమర్షియల్ అగ్రిమెంట్స్, లైసెన్స్ వంటివాటికి సంబంధించి అగ్రిమెంట్లను రూపొందించి ఇస్తున్నారు.

అక్షత్ సింఘాల్.. ఓ సీరియల్ ఆంట్రప్రెన్యూర్. ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే తన తొలి స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. కిందిస్థాయి నుంచి సంస్థను నిర్మించేందుకు ఇప్పటికీ కృషి చేస్తున్నారు.

‘‘ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. స్టార్టప్ సంస్థల్లో ఉన్న మజాను సహ ఆంట్రప్రెన్యూర్లు వివరించారు. అపజయాల నుంచి నేర్చుకోవడం, కష్టపడటం, విజయం సాధించేందుకు ఎదగడం వంటివి.. నన్ను ఎప్పుడూ నడిపిస్తుంటాయి’’ అక్షత్

లెగిస్టిఫై వ్యవస్థాపకులు అక్షత్ సింఘాల్ (ఎడమవైపు),

లెగిస్టిఫై వ్యవస్థాపకులు అక్షత్ సింఘాల్ (ఎడమవైపు),


ఆగస్ట్ 2013లో ‘గెట్ లీగల్’ పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ రూపొందించారు అక్షత్. ప్రశ్నలు సమాధానాల వేదిక ఇది. వివిధ వర్గాల ప్రజల సందేహాలను లాయర్లు, లా స్టూడెంట్స్ తీరుస్తుండేవారు. స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నప్పుడు తనకు ఎదురైన న్యాయ సమస్యల కారణంగా గెట్ లీగల్‌ను ఏర్పాటు చేశారు అక్షత్.

కానీ కొత్త వ్యాపార సంస్థలకు, స్టార్టప్ సంస్థలకు మరింత విలువ ఇవ్వాలన్నదే అక్షత్ ఉద్దేశం. ఇదే లక్ష్యంతో అక్షత్, అతని టీమ్ 2014, 2015 సంవత్సరాలలో గెట్ లీగల్ ద్వారా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ సంస్థను నిర్వహించడం ద్వారా న్యాయ శాస్త్రానికి సంబంధించిన ఎక్కువ నాలెడ్జ్‌ను సంపాదించగలిగారు. ఆ నాలెడ్జ్ ఆధారంగా ఆగస్ట్ 2015లో అక్షత్, అతని బ్యాచ్‌మెట్ రితేశ్ (23), జీఎన్‌యూ గ్రాడ్యూయేట్ రవింద్ర పురోహిత్ (25) లెగిస్టిఫై పేరుతో ఆటోమేటెడ్ ఆన్‌లైన్ అగ్రిమెంట్ మేకింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.

 లెగిస్టిఫై వెబ్‌సైట్ హోంపేజీ..

లెగిస్టిఫై వెబ్‌సైట్ హోంపేజీ..


లీగల్ టెక్నాలజీ..

2016లో ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ అగ్రిమెంట్ మేకింగ్ ప్లాట్‌ఫామ్.. యూజర్ల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు, అగ్రిమెంట్‌కు కావాల్సిన అంశాలను కూడా వివరిస్తుంది. అగ్రిమెంట్‌లు రూపొందించేందుకు ఎలాంటి టెంప్లెట్లు లేవని, వినియోగదారులు కోరితే అప్పటికప్పుడు టెక్నాలజీ సాయంతో రూపొందించి ఇస్తామని అక్షత్ చెప్పారు.

ఫస్ట్ అగ్రిమెంట్ ఫ్రీ..

యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు అక్షత్. ఈ స్టార్టప్ కంపెనీ వెబ్‌సైట్‌లో తొలిసారిగా రిజిస్టర్ అయిన యూజర్లకు తొలి అగ్రిమెంట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి అగ్రిమెంట్‌కు అయినా 1000 నుంచి 1500 రూపాయల మధ్యలో చార్జ్ చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రైస్ తో పోలిస్తే ఇది 60 నుంచి 70 శాతం తక్కువ ఫీజేనని అక్షత్ అంటున్నారు. అలాగే వినియోగదారులకు లెగిస్టిఫై 15 రోజుల వారంటీ సమయాన్ని కూడా ఇస్తోంది. యూజర్లు కావాలనుకుంటే, అగ్రిమెంట్‌లో ఏవైనా తప్పులుంటే ఈ 15 రోజుల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీటా స్టేజ్‌లోనే ప్లాట్‌ఫామ్ రన్ అవుతున్నప్పటికీ, 30 వివిధ రకాల అగ్రిమెంట్లను, బిజినెస్ రిక్వైర్‌మెంట్స్‌ను అందిస్తోందీ సంస్థ. హైరింగ్ అగ్రిమెంట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వ్యవహారాలు చూసుకోవడం, ఆఫీస్ అద్దె, గిడ్డంగుల అద్దె, కమర్షియల్ అగ్రిమెంట్స్ వంటివాటికి సంబంధించిన పూర్తి సహకారాన్ని లెగిస్టిఫై అందిస్తోంది.

మరో రెండు నెలల్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌కు సంబంధించి మరో 300 వివిధ రకాలైన అగ్రిమెంట్లను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. ఈ కొత్త అగ్రిమెంట్లు స్టార్టప్ కంపెనీలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. స్టార్టప్‌లను ప్రారంభించేందుకు, క్లోజ్ చేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్‌ను ఈ సంస్థ అందించనుంది. అలాగే వ్యక్తిగత వివాదాలను పరిష్కరించుకునేందుకు అవసరమైన అగ్రిమెంట్లను కూడా సాయపడతాయి.

నిధుల సమీకరణ..

సంస్థను ప్రారంభించి కొన్ని నెలలే అయినప్పటికీ నిధుల సమీకరణ కూడా మొదలు పెట్టింది. గత డిసెంబర్‌లో పాలీప్లెక్స్ సంస్థ డైరెక్టర్ సీడ్ రౌండ్ ఫండింగ్ అందించారు.

 ఆన్‌లైన్‌లో అగ్రిమెంట్లను రూపొందించేందుకు సహకరిస్

ఆన్‌లైన్‌లో అగ్రిమెంట్లను రూపొందించేందుకు సహకరిస్


ఆఫ్‌లైన్ సేవలు..

జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ 700 లీగల్ అగ్రిమెంట్లను రూపొందించింది. ఇందులో 70 నుంచి 80 శాతం వరకూ ఫస్ట్ టైమ్ యూజర్లకు ఉచితంగానే సేవలందించింది. ఆన్‌లైన్ ద్వారానే కాదు ఆఫ్‌లైన్ ద్వారా కూడా సేవలు అందించాలని చాలా స్టార్టప్ సంస్థలు లెగిస్టిఫైని సంప్రదిస్తున్నాయి. ఆఫ్‌లైన్ సేవలు అందించడం ద్వారా ప్రతినెలా 5,000 నుంచి 15 వేల వరకూ ఆదాయం వస్తోంది.

image


విస్తరణ..

ప్రస్తుతానికైతే బిజినెస్ టు కస్టమర్ల సేవలు అందిస్తున్న ఈ సంస్థ త్వరలోనే బి2బీ వెర్షన్ సేవలు అందించాలనుకుంటోంది. పేమెంట్ గేట్‌వేస్, మర్చంట్ అగ్రిమెంట్స్ వంటి బిజినెస్‌లకు అవసరమైన అగ్రిమెంట్‌లను రెడీమేడ్‌గా అందించాలనుకుంటోంది.

హోం డెలివరీ..

వ్యాపార సంస్థలకే కాదు వ్యక్తులకు కూడా న్యాయ సాయం చేసేందుకు లెగిస్టిఫై సిద్దంగా ఉంది. కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్న విధానాలను రూపొందించింది.

1) హోం డెలివరీ: ఆన్‌లైన్ ద్వారా తమను సంప్రదించిన కస్టమర్లకు అగ్రిమెంట్లను ఫ్రీగా హోండెలివరీ చేస్తుంది.

2) ఈ-సైన్: అగ్రిమెంట్‌ను రూపొందించేందుకు కస్టమర్లు సంస్థ కార్యాలయానికి రావాల్సిన పనిలేకుండా ఈ-సైన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.

3) మార్పులు: కస్టమర్లు కోరితే అగ్రిమెంట్ క్లాజెస్‌లో మార్పులు కూడా చేసుకునే అవకావాన్ని కల్పిస్తోంది. రెండు పార్టీలు ఈ సంస్థ మెంబర్లే అయితే, వారి కోరికపై అగ్రిమెంట్‌లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇస్తోంది.

ఈ ఆన్‌లైన్ అగ్రిమెంట్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మరో విశిష్టత ఏంటంటే.. కస్టమర్లకు వచ్చే సందేహాలను నిష్ణాతులైన లాయర్లు, సీఏ ద్వారా తీరుస్తున్నారు. బిజినెస్‌లకు అవసరమైన అగ్రిమెంట్లను రూపొందించే ముందు 15-20 మంది నిపుణులైన లాయర్లతో సంప్రదింపులు జరిపామని నిర్వాహకులు చెప్తున్నారు. త్వరలోనే మరింత మంది నిపుణులను ఢిల్లీలో యాడ్ చేసుకోవాలని లెగిస్టిఫై భావిస్తోంది. ఆ తర్వాత ఇతర నగరాలకు కూడా తమ సేవలను విస్తరించే ప్లాన్ లో వుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అయిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నందున, వాటిని దృష్టిలో పెట్టుకునే అగ్రిమెంట్లను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా వెయ్యి స్టార్టప్ కంపెనీలకు లీగల్ సాయం అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది లెగిస్టిఫై.

అవకాశాలు..

రన్నర్ వంటి సంస్థలు కాపీరైట్ ఇన్‌ఫ్రింజిమెంట్స్ విషయంలో రోడ్ సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, లీగల్ చెక్స్ వంటివి స్టార్టప్ కంపెనీలకు ఎంతో ముఖ్యం. మీట్‌యువర్‌ప్రొ, వకీల్ సెర్చ్, ఇండియా ఫైండింగ్, పాత్‌లీగల్, బీకంప్లైయెన్స్ వంటి సంస్థలు ఆన్‌లైన్ లీగల్ సర్వీసెస్‌ను అందిస్తున్నాయి. కంపెనీ రిజిస్ట్రేషన్ వంటి వాటి కోసం వెంచర్ ఈజీ సంస్థ సాయం చేస్తుండగా, నిష్ణాతులైన లాయర్ల వివరాలను లారాటో.కామ్ అందిస్తోంది. 

అయితే లీగల్ టెక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. అమెరికాలో మాత్రం 2014లో అత్యధిక పెట్టుబడులు (254 మిలియన్ డాలర్లు) ఈ రంగంలోనే వచ్చాయి. మరి భారత్‌లో లీగల్ టెక్ కంపెనీలు ఏమేరకు పెట్టుబడులను ఆకర్షించగలుగుతాయో వేచి చూడాలి. స్టార్టప్ కంపెనీలకు లీగల్ సాయమందిస్తున్న లెగిస్టిఫై మరింత అభివృద్ది చెందాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది.

వెబ్‌సైట్: