ఆరోగ్య పట్టణాలవైపు నిర్ణయాత్మక అడుగులు వేద్దాం

0

స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశం పల్లెల్లో నివసించేది. ఈ మాట సాక్షాత్తూ మహాత్మా గాంధీయే అన్నారు. ఇప్పుడు దేశంలో 30 శాతం పట్టణాలయ్యాయి. తెలంగాణ విషయానికొస్తే 42 శాతం అర్బన్ ఏరియా ఉంది. దేశంలోనే ఎక్కువ పట్టణీకరణ ఉన్న రాష్ట్రం తెలంగాణ. అర్బనైజేషన్ వేగం పుంజుకుంది. ఒకప్పుడు 30-70 ఉన్న రేషియో క్రమంగా మారుతోంది. రాబోయే 15 ఏళ్లలో యాభై శాతానికి పైగా పట్టణాలు రూపుదిద్దుకుంటాయి.

ఎందుకంటే రూరల్ సెట్టింగ్స్ లో అర్బన్ సెట్టింగ్స్ లో చాలా తేడాలున్నాయి. విద్యావకాశాలు, జీవనోపాధి, వైద్య సేవలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు పట్టణాలకు ప్రియారిటీ ఇస్తుంటారు. అందుకే జీఎస్డీపీ, జీడీపీ ఎక్కువ శాతం సిటీల నుంచే వస్తుంది. ఆ కోణంలో చూస్తే, 70 శాతం మైక్రోసాఫ్ట్ ఆదాయం కేవలం 80 పట్టణాల నుంచే వస్తుంది. ఆ సంస్థ కార్యకలాపాలు 180 దేశాల్లో ఉన్నప్పటికీ 80 సిటీలే ఆయువుపట్టు. తెలంగాణ నేపథ్యంలో చూస్తే 40 నుంచి 48శాతం దేశ జీఎస్‌డీపీ తెలంగాణ నుంచే వస్తోంది. ఇంత వృద్ధిరేటు సాధించడానికి కారణం 42 శాతం పట్టణ భూభాగం ఆర్ధిక చోదక శక్తిగా ఉండటమే. తెలంగాణ సెంట్రిగ్గా చూసుకుంటే 45 శాతం ఆదాయం కేవలం హైదరాబాద్ నుంచే వస్తుంది.

పట్టణాల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కూడా లకావాలి. మంచినీరు మొదలుకొని, పారిశుధ్యం, విద్య, వైద్యం ప్రతీ పౌరుడికీ అందాలి. అప్పుడే పట్టణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆ దిశగా నిర్ణయాత్మక అడుగులు వేసే క్రమంలోనే, ప్రత్యేకంగా హాస్పిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టాం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీకి, ఉస్మానియాకు, నిలోఫర్ ఆసుపత్రులకు వేర్వేరుగా బడ్జెట్‌ లో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మాతా శిశుమరణాలు, నవజాత శిశుమరణాలు తగ్గించేందుకు అమ్మవొడి, కేసీఆర్ కిట్ లాంటివి ప్రవేశపెట్టామన్నారు. హోటల్ తాజ్‌ దక్కన్‌ లో నేషనల్ అర్బన్ హెల్త్‌ మిషన్ పై నిర్వహించిన స్టేట్ లెవల్ వర్క్‌ షాప్ కు మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రస్తుతం తెలంగాణలో 249 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లున్నాయి. అందులో 145 హైదరాబాదులో ఉన్నాయి. మిగతావి 105 చోట్ల ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో పట్టణాల్లోని అన్ని హెల్త్ సెంటర్లను ఢిల్లీ మొహల్లా క్లినిక్స్ మాదిరి తయారు చేస్తామన్నారు. సాంకేతికతను వాడుకోవడం, ఉద్యోగుల్లో జవాబుదారీ పెంచడం, ప్రభుత్వ వైద్య సేవలు మెరుగు పరచడం.. అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు పోతామన్నారు. నగరానికి నాలుగు వైపులా ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. 

Related Stories

Stories by team ys telugu