వైఫల్యాల నుంచి ఏం నేర్చుకున్నానంటే...!

పొరపాట్లు చేయండివైఫల్యాలు రుచిచూడండికానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోండిగ్యాన్ ల్యాబ్ సిఈఓ ప్రియదీప్ అంతరంగం ఇది

0

''చిన్నప్పటి నుంచి కూడా నా మీద నాకు నమ్మకం ఎక్కువే. నేను కొన్ని మంచి పనులకు నాయకత్వం వహించడానికే పుట్టానని నమ్మేవాడిని. స్కూల్ లో చదువునుకునే రోజుల్లో నేను ఒక హౌస్ కి నాయకత్వం చేపట్టాను. అంతకు ముందెన్నడూ లేని విధంగా ఆ ఏడాది మా హౌస్ మొదటి స్థానంలో నిలిచింది. కాలేజీ రోజుల్లో నేను ఓ క్లబ్‌కి ప్రెసిడెంట్ అయ్యాను. క్లబ్ ఆదాయాన్ని ఏకంగా 1600 శాతం పెంచాను. సభ్యుల సంఖ్య 700 శాతం పెరిగేలా చూశాను. కాలేజీ చదువు పూర్తవుతున్నప్పుడే నాకు అర్ధమైంది. ఈ ఉద్యోగాలు నాకు పనికిరావని. ఎవరో ఒకరి కింద, వాళ్లను అనుసరిస్తూ పనిచేయడం కంటే.. నా ఆలోచనలకు అనుగుణంగా నేను పనిచేయడమే మంచిదని నమ్మేవాడిని. మంచి వ్యాపారవేత్త కావాలని ఆశపడేవాడని. కాలేజీ చదువులు పూర్తికాకముందే దానికి పునాదులు వేయడం మొదలుపెట్టా. నా చదువు ఫైనల్ సెమిస్టర్‌లో ఉండగానే అభిష్‌తో కలసి గ్యాన్ ల్యాబ్‌ను ప్రారంభించాను. కొన్ని నెలల తర్వాత సోనాలి కూడా మాతో కలిశారు.

ఏదైనా అర్ధవంతమైన పని చేయాలని మేం భావించాం. నేను చదువుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నేను సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా నాకు నచ్చిన పద్ధతిలో చదవాలనుకునేవాడిని. ఆ అనుభవం నేను ప్రారంభించే వ్యాపారంలో లాభాల మీద కాకుండా, నేను నమ్మిన విధానాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా ప్రభావం చూపించింది. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా భవిష్యత్ భారతదేశపు మానవ వనరులను వినూత్నంగా, సృజనాత్మకంగా స్పష్టమైన లక్ష్యం కలిగిన యువతగా తీర్చిదిద్దాలన్నదే మా ప్రయత్నం.

మేం మా ప్రయత్నాన్ని మొదలుపెట్టేటప్పటికే చాలా స్టూడెంట్ స్టార్టప్‌లు ఉన్నాయి. మాకు ఒక స్పష్టమైన విజన్ ఉంది. కానీ దానిని ఎలా అమలు చేయాలన్నది స్పష్టంగా తెలియని పరిస్థితి. స్కూల్‌లోనే లెర్నింగ్ సెంటర్లు ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. మేం వేగంగా అభివృద్ధి చెందడానికి అదే సరైన మార్గం అనిపించింది. మాది పూర్తిగా హార్డ్‌వేర్ మీద ఆధారపడిన ఎడ్యుకేషనల్ టెక్‌ స్టార్టప్. మేం ఓ ప్రముఖ స్కూల్ చైన్స్‌తో కలిసి చక్కని పైలట్ ప్రాజెక్టు సిద్ధం చేశాం. వరుసగా 2011-12, 2012-13 సంవత్సరాలకు గాను అది అత్యుత్తమ టెస్ట్‌గా నిలిచింది. దాంతో మా ప్రొడక్ట్ అత్యంత సమర్ధవంతమైందని బలమైన నమ్మకం మాకు కలిగింది. మేం ఊహించనంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని భావించాం.

పొరపాట్లతో తీవ్ర ఇబ్బందులు

కానీ కొన్ని అనుచిత నిర్ణయాలు, దురదృష్టం వెంటాడడంతో మా సార్టప్ పరిస్థితి ఘోరంగా తయారైంది. 2013లో వ్యాపార విస్తరణ, స్కూల్స్ చైన్‌లో పెద్ద పెద్ద కస్టమర్ల కోసం మేం బెంగళూరుకి వచ్చాం.

బెంగళూరు శివార్లలోని యలహంకలో ఆఫీసు తీసుకున్నాం, ఆ ప్రాంతంలో అన్నీ కాస్త చౌకగా ఉంటాయి. మా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మేం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. మేం అక్కడ ఆఫీసును సరిగ్గా నడపలేకపోయాం. ఐదు నెలల అద్దెను వృథాగా పోగొట్టుకున్నాం, ఆ తర్వాత హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కి మారిపోయాం. ఆ ప్రాంతం మా గ్యాన్ ల్యాబ్ కి అత్యంత అనుకూలమైందని భావించాం.

ఈ మధ్యలో, మేం పెద్ద సంఖ్యలో స్కూల్స్ కలిగిన ఓ క్లయింట్ తో ఒప్పందం కుదుర్చకున్నాం. ఆ తర్వాత మరో కంపెనీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మాకు రావాల్సిన ఆర్డర్, వాళ్లకు వెళ్లిపోవడంతో మాకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక్కడే మేం మరో పొరపాటుచేశాం. ఆ క్లయింట్‌ను నమ్ముకుని మేం అప్పటికే సొంతంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం.

అదే సమయంలో, మరొకరు మా ఆలోచన మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఆరునెలల పాటు సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ అతడికి మా నుంచి ఏం కావాలన్నది తెలుసుకోవడంలో మేం విఫలమయ్యాం. ఈ మధ్యలో మేం కొన్ని స్కూళ్లను సందర్శించాం, కొంత మందిని ఫోన్లలో సంప్రదించాం. అప్పటికే మేం చేసిన భారీ ఖర్చులకు అది అదనపు భారమే అయింది తప్ప ఎటువంటి మేలు జరగలేదు.

అతిపెద్ద పొరపాటు

నిధుల సమీకరణ కోసం, నిర్వహణ కోసం మేం నష్టాల్లో ఉన్న ప్రారంభ కంపెనీలు చేసే ప్రయత్నాలే చేశాం. కానీ మేం హార్డ్‌వేర్ బేస్డ్ ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్‌ని కోల్పోతున్న విషయాన్ని గ్రహించలేకపోయాం. 2013 డిసెంబర్ నాటికి గ్యాన్ ల్యాబ్ దగ్గర అర్ధిక నిల్వలు పూర్తిగా తరిగిపోయాయి.

మా వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో మా కోర్ టీమ్, సలహాదారులు అంతా సమావేశమయ్యాం. మాకు అండగా నిలబడేందుకు సిద్ధమైన కొంత మంది సహాయం కూడా తీసుకుని, గ్యాన్ లాబ్ ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాం.

మేం నేర్చకున్నది ఇదే :

  • 1) గ్యాన్ ల్యాబ్ యొక్క ప్రాధమిక కార్యకలాపాల దిశ మారింది, బి2బి (స్కూళ్లకే అమ్మకాలు జరపడం) కి బదులుగా బి2సి( విద్యార్ధుల తల్లిదండ్రులు/ విద్యార్ధులకు అమ్మకాలు జరపడం ) మీద దృష్టిపెట్టింది. అంటే దీనర్ధం మేం సూళ్లకు అమ్మకాలు జరపడంలేదని కాదు. మేం అసలైన కస్టమర్లు ప్రభావమయ్యేలా చర్యలు తీసుకున్నాం – పిల్లల కంటే ముఖ్యమైంది ఏముంటుంది మరి.
  • 2) సేవలందించే రూపం నుంచి ఉత్పత్తులు అందించే రూపంలోకి మారడం. సేవలు పొందుతారు కానీ డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తారు. లేదంటే అసలు చెల్లించరు. ఇటువంటి పరిస్థితులను తట్టుకోవడం ఎటువంటి కంపెనీకైనా కష్టమే. ఎడ్యుకాంప్ (2010లో మిలియన్ డాలర్ల కంపెనీ) లాంటి పెద్ద కంపెనీకి కూడా ఈ విషయం అనుభవమైంది. మాకు ఈ పరిస్థితి చిన్న స్థాయిలో ఉన్నప్పుడే ఎదురైంది. మేం దానిని తట్టుకోలేకపోయాం.

  • 3) ఇంతకు ముందు, స్కూల్స్ మాకు కొన్ని నియమ నిబంధనలు పెట్టేవి. వాటి కారణంగా పిల్లల మీద గ్యాన్ లాబ్ ప్రోగ్రామ్స్ ప్రభావం చాలా తక్కువగా ఉండేది. మా ప్రోగ్రామ్స్‌ను నడిపించే విషయంలో 100 శాతం స్వేచ్ఛను ఇచ్చే స్కూల్స్‌ని మాత్రమే మేం భాగస్వాములుగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నిజమైన ప్రభావం చూపించలేకపోతే గ్యాన్ ల్యాబ్ మనుగడే నిరర్ధకమైపోతుంది.
  • 4) 2013 డిసెంబర్ నుంచి మేం ఇన్వెస్టర్లకు బదులుగా 100 శాతం కస్టమర్ల మీద దృష్టి పెట్టాం. ఒక వేళ మా నిర్ణయం సరైందే అయితే ఇన్వెస్ట్‌మెంట్ కూడా సరైన సమయానికి సమకూరుతుంది. సామాజిక నిధుల నిర్వాహకులు చాలా మంది మమ్మల్ని సంప్రదించడం మొదలుపెట్టారు. ప్రతి మూడు, ఐదు నెలలకోసారి వారు మా వర్క్ గురించి అడిగి తెలుసుకునేవారు. ఇది నిజంగానే మాకు మంచి అనుభూతిని ఇచ్చింది.
  • 5) నష్టాల్ని కలిగించే డీల్స్ ని ఏ స్థాయిలోనూ కుదుర్చుకోకూడదు. వివిధ స్కూళ్లలో నిర్వహణ స్థాయిని కూడా అందుకోలేకపోయిన మా సెంటర్స్ ని మేం వెనక్కి తీసేసుకున్నాం. ఏ స్టార్టప్‌కైనా ఆరంభంలో నగదు ప్రవాహం చాలా కీలకమైన విషయం. మనిషి శరీరానికి రక్తం ఎంత అవసరమో అలాగ. సంస్థ మనుగడకు ఆ ప్రవాహం అలా కొనసాగుతూ ఉండాలి.
  • 6) మేం మా కార్యకలాపాలను బెంగళూరు, కోటాలకే పరిమితం చేశాం. దీంతో ఖర్చులు బాగా తగ్గిపోయాయి. భారీగా విస్తరించాలన్న ఆలోచనలు పక్కన పెట్టేయడంతో చిన్న పరిధిలో చాలా తొందరగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలిగాం.
  • 7) మేం చాలా సూక్ష్మ స్థాయిలోనే అంటే ఒక నెల కాలంలోనే బ్రేక్ ఈవెన్ సాధించాం. ఆ విజయం తర్వాత మేం వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. అభివృద్ధి నెమ్మది నెమ్మదిగానే కొనసాగింది.
  • 8) విశ్వసనీయత లేకపోవడమన్నది పెద్ద లోపమని మేం గుర్తించాం. బయట చూస్తే చాలా మంది భారీగా హామీలు గుప్పించేస్తున్నారు. దీని వల్ల చాలా స్టార్టప్స్, సంస్థలు ఏ మాత్రం నాణ్యత లేని ఉత్పత్తులను సైతం భారీ ధరలకు అమ్ముతున్నారు. దాంతో మేం విశ్వసనీయత (మా బలాలకు సంబంధించి మొదట్టమొదటి స్థానాల్లో ఉంటుంది)ను పెంచుకోవడం మీద దృష్టి పెట్టాం. దీని కోసం మేం ఓపెన్ సోర్స్ అప్రోచ్ ను అనుసరిస్తున్నాం. (అదేంటో మీరు తొందర్లోనే చూస్తారు.)

ఇతర వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు నేను ఏమీ చెప్పలేను. కానీ విద్యారంగం (హార్డ్‌వేర్ ఎడ్‌టెక్)లో మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. దీనికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి.

మేం నేర్చుకున్న వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీ కోసం..

మీ లక్ష్యం బిలియన్ డాలర్ల కంపెనీ కావాలి. మీ అసలైన లక్ష్యం నిజమైన ప్రభావం చూపడంపైనే దృష్టి పెట్టాలి.

పెట్టుబడుల కోసం కంపెనీ పెట్టకండి, ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. మీ వ్యాపార ప్రయాణాన్ని నాణ్యమైన కార్యక్రమాలతో భవిష్యత్ మానవ వనరులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే దిశగా సాగించండి, మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయి.

ధన ప్రవాహం, పునాదులే మీ వ్యాపారానికి కీలక మంత్రాలు. ఈ విభాగంలో మీరు నష్టాల్లో ఉంటే.. అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నా ఫలితం ఉండదు. మీ డబ్బంతా హరించుకుపోతుంది. మీరు చేసే ప్రతి లావాదేవీలోనూ బ్రేక్ ఈవెన్ ఉండేలా చూసుకోవాలి. మీరు డబ్బంతా పోగొట్టుకున్న తర్వాత చేయడానికి ఇంక ఏం మిగులుతుంది ?

మీరు ఒక పెద్ద క్లయింట్ మీదే ఆశలన్నీ పెట్టుకోకండి. చాలా సందర్భాల్లో అది పెద్ద పొరపాటు అవుతుంది. చిన్న ఏరులు చాలా కలిస్తే నది అవుతుంది. సంపాదనకు ఈ సూత్రం వర్తిస్తుంది. మనకు వేరు వేరు ఆదాయ మార్గాలు ఉండాల్సిందే.

కస్టమర్ల నుంచి రావాల్సిన పేమెంట్లు సక్రమంగా వచ్చేలా చూసుకోవాలి. నాకు తెలుసు చాలా ఎడ్యూకేషన్ స్టార్టప్‌లు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కస్టమర్ల నుంచి పేమెంట్ వసూలు చేయడం సవాలే. ఈ సమస్యను అధిగమిస్తే మీ సంస్థలో ధన ప్రవాహంకి అడ్డంకులు తొలగిపోయినట్టే.

మీరు మీ జీవితాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు, మిమ్మల్ని అణగతొక్కే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవరైనా (కస్టమర్, వెండర్) సరే మిమ్మల్ని అలుసుగా తీసుకునే పరిస్థితి కల్పించుకోకండి. ఇతరుల నుంచి ఎంత వరకు నేర్చుకోవచ్చో అంతా నేర్చుకోండి. దీని వల్ల మీ మనుగడకు అవకాశాలు పెరుగుతాయి.

ఆరంభ దశలో మనం విజయాల కంటే కూడా వైఫల్యాల నుంచే ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతాం. గ్యాన్ లాబ్ ద్వారా మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అవే మేం బలంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన బలాన్నిస్తున్నాయి.

రచయిత గురించి:

ప్రియదీప్ , గ్యాన్ ల్యాబ్ వ్యవస్థాపక సీఈవో. స్కూల్స్, కాలేజీలకు సంబంధించి ఎదుర్కొన్న సమస్యల్ని ఆయన సొంతంగానే పరిష్కరించుకున్నారు. గ్యాన్ ల్యాబ్ బెంగళురుకి చెందిన సంస్థ. ఆరేళ్ల పిల్లలకు ప్రయోగాత్మక పద్ధతుల్లో STEM ద్వారా బోధన చేపడుతోంది.

Feeling good to present and getting inspired as well from "your story".

Related Stories