బెంగుళూరుకే తియ్యని స్టార్టప్ బిగ్ బేకరీ

ఈకామర్స్‌లో బేకరీ ప్రోడక్ట్స్బోర్డ్ తిప్పేసే అవకాశాలు అతితక్కువగా ఉండే వ్యాపారం ఇదే24గంటల్లో నచ్చిన డిజైన్, టేస్ట్, సైజ్‌లో కేక్, బేకరీ ప్రోడక్ట్స్ డెలివరీహోమ్ చెఫ్స్‌తో తయారు చేయించి, యూరోప్‌లో విక్రయించే లక్ష్యం


బెంగుళూరుకే తియ్యని స్టార్టప్ బిగ్ బేకరీ

Sunday May 31, 2015,

4 min Read

ఇప్పుడు మన దేశంలో ఈ కామర్స్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అందరికీ తెలుసు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. వారిలో బిగ్ బేకరీ స్థాపించిన ప్రదీప్ భోగయ్య కూడా ఒకరు. ఆర్డర్ చేసిన తర్వాత తయారు చేసి, ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రెష్ కేక్‌లను 24 గంటల్లోగా డెలివరీ చేయడం బిగ్ బేకరీ ప్రత్యేకత. ఇందుకోసం తన ఉద్యోగులపై ఎలాంటి జాలి దయ చూపబోనంటారు ప్రదీప్. మూడు గ్రూపులుగా చీలిపోయి... బెంగుళూరు వీధుల్లో 2 నెలలపాటు పరిశోధన చేసి మరీ ఈ సంస్థను ప్రారంభించారు భోగయ్య. దీనికోసం సుదీర్ఘంగానే శ్రమించారు. నిబద్ధత గల కోర్ టీం ద్వారా.. డెలివరీలపై ప్లానింగ్ చేసుకున్నారు.

image


స్టార్టప్‌కి ముందు... తర్వాత...

బిగ్ బేకరీ ప్రారంభానికి ముందు... సిస్కో సంస్థలో సెల్ బై టెల్ విభాగంలో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పని చేశారు ప్రదీప్ భోగయ్య. జీవితంలో మరింతగా సాధించాలని భావించేవారు. కార్పొరేట్ ఉద్యోగంలో నేర్చుకున్న, ఉపయోగించిన స్కిల్స్... బిగ్ బేకరీ ప్రారంభానికి తోడ్పడ్డాయని చెబ్తారు ఆయన. సంస్థను ప్రారంభించాక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదంటే అర్ధమవుతుంది ఈ ప్రాజెక్టుపై ఆయన పట్టుదల ఎలాంటిదో.

image


డిసెంబర్ 2012లో ఉద్యోగాన్ని వదిలేసి స్వదార్ అనే కంపెనీని ప్రారంభించారు ప్రదీప్. ఇది మార్కెటింగ్‌ను ఒక సర్వీసులా అందించేది. ఇక్కడే ఈకామర్స్‌పై ఆలోచనలు మొదలయ్యాయి ప్రదీప్‌కు. అయితే ఏ ప్రోడక్టును విక్రయించాలో తుది నిర్ణయం తీసుకునేందుకు 6 నెలల సమయం అవసరమైంది. బేకరీ విభాగం అసంఘటితంగా ఉండడం, ఆన్‌లైన్ విక్రయాల్లో దీనిని అంతగా పట్టించుకోకపోవడమే ఇటువైపు రావడానికి కారణమంటారు ప్రదీప్.

మన రోడ్లపై రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్, బేకరీలు చూస్తూనే ఉంటాం. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ విభాగాలు నష్టాలతో మూసేడం గమనిస్తూనే ఉంటాం. కానీ బేకరీల విషయంలో ఆ సమస్య ఎదురుకావడం అరుదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి 2 నెలలపాటు బెంగుళూరు రోడ్లపై తిరిగానంటారు ప్రదీప్.

మార్కెట్‌ని పరిశీలించేందుకుగాను బిగ్ బేకరీ డాట్ ఇన్ పోర్టల్‌ను కేక్స్ విభాగంతో ప్రారంభించారు. తర్వాత ఆన్‌లైన్ పోర్టల్‌ను స్వీట్స్, చాకొలేట్స్, కుకీస్, బ్రెడ్స్, స్నాక్స్, నమ్కీన్స్, బెవరేజెస్, డైరీ ప్రోడక్ట్స్‌కు విస్తరిస్తున్నారు.

మార్కెట్‌లో పోటీ

జస్ట్ బేక్.ఇన్, ఇండియాకేక్స్.కాం, ఎఫ్ఎన్‌పీ.కాం వంటి పోర్టల్స్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నా.. వారి టార్గెట్ మార్కెట్‌కు తాము విభిన్నమంటోంది బిగ్ బేకరీ. సౌకర్యవంతమైన డెలవరీ, పదార్ధాల్లో నాణ్యత, ఉత్తమమైన తయారీదారులు, ఇంటి నుంచి తయారు చేసి అందించేవారు, ఉచిత హోం డెలివరీ సౌకర్యం తమను అత్యుత్తమ స్థాయిలో నిలబెడతాయంటున్నారు ప్రదీప్. అంతేకాదు త్వరలో రిటర్న్ పాలసీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు.

image


"మేం మార్కెట్ ప్లేస్‌గానే వ్యవహరించబోతున్నాం. బెంగుళూరులోని అత్యుత్తమ విక్రేతలను ఎంపిక చేసుకుని పదార్ధాలు అందిస్తాం. అలాగే హోమ్ చెఫ్స్, బేకర్స్ విభాగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామం"టున్నారు ప్రదీప్. ఇందుకోసం మహిళలనే ఎక్కువగా ఎంచుకున్నామని చెబ్తున్నారు. ఇది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందని చెబ్తారాయన. భవిష్యత్తులో మౌలిక వసతులు, ముడి సరుకులు అందించి... మహిళా చెఫ్స్, బేకర్స్, హోమ్ మేకర్స్‌తో పదార్ధాలు తయారు చేయించే యోచన ఉందంటారాయన.

కనీసం 10మంది మహిళలను ఈ తరహా వ్యాపారంలో భాగస్వాములు చేయగలిగినా అదే తమకు ఎంతో సంతోషాన్నిస్తుందంటున్నారు. 2015 చివరికల్లా 50మంది హోమ్ చెఫ్స్ తమ లక్ష్యంగా చెబ్తున్నారు.

image


ఆన్ టైంలో హోం డెలివరీ

స్టార్టప్ అనుకున్నపుడే డెలివరీ విధానంపై రీసెర్చ్ చేశారు బిగ్ బేకరీ టీం. కనీసం కేకులను తాజాగా అప్పటికప్పుడు డెలివరీ చేయగలిగితే చాలు... ఈ వ్యాపారంలో నిలదొక్కుకోవచ్చనే భావనతోనే ఈ వ్యాపారం మొదలైంది. డెలవరీ, రవాణాలకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజా కేకులను టెంపరేచర్ కంట్రోల్ బాక్సుల ద్వారా విక్రేతల నుంచి సేకరించి, కస్టమర్లకు అందించే విధానాన్ని రూపొందించుకున్నారు వీరు. ఈ అంతర్గత సప్లై విధానంలో రవాణా విభాగం, డెలివరీ టీంకు సరైన టైంకి అందించేలా జాగ్రత్త పడతారు. ఇందుకోసం వాహనాలనే ఉష్ణోగ్రతలను నియంత్రించేవాటిగా రూపొందించుకోవడంతో.... శ్రమ బాగా తగ్గిందని చెబ్తారు బిగ్ బేకరీ టీం.

"డెలవరీలను నేను ప్రతీ రోజు మానిటర్ చేస్తుంటాను. నేను మీటింగ్‌లో ఉన్నాసరే... డెలవరీ టీం కాల్స్ ఖచ్చితంగా అటెండ్ చేస్తాను. కొన్నిసార్లు నేనే వెళ్లి డెలివరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2సార్లు రూ. 50 చొప్పున టిప్ కూడా లభించింది నాకు" ప్రదీప్.

ప్రారంభంలో బెంగుళూరులోని కొన్ని ఏరియాలకు డెలివరీలు చేయకపోయినా... తర్వాత మొత్తం నగరమంతా సేవలందిస్తున్నారు. ఈ డెలివరీ టీంకు... బేకింగ్ నిపుణులు వాటిని హ్యాండిల్ చేయడంపై శిక్షణ ఇస్తారు. కేక్ డిజైన్ పాడవకుండా ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటి ఐదు సందర్భాల్లో మరో కేక్ అందించడమే కాకుండా... మొత్తం అమౌంట్ రిఫండ్ చేశామని చెప్పారు ప్రదీప్.

ఉద్యోగి నుంచి ఉపాధి కల్పన వరకూ

ఎంప్లాయీ నుంచి ఆంట్రప్రెన్యూర్‌గా మారడం సవాలే. రోజుకు 16-18 గంటలు కూడా పని చేయాల్సి వచ్చిన రోజులున్నాయి. ఇప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఉన్నాయంటారు ప్రదీప్. అయితే కస్టమర్లు ఫోన్ చేసి మరీ కేకుల నాణ్యత, రుచిపై ప్రశంసించినపుడు కష్టమంతా మరిచిపోతున్నామని చెబ్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, బెంగుళురులోనూ అలాగే సౌత్ ఇండియాలోనే పెద్ద బ్రాండ్‌గా తాము అవతరించాలన్నదే లక్ష్యంగా చెబ్తున్నారు ప్రదీప్.

బిగ్ బేకరీకి నిధులు ఎలా ?

ఇప్పటివరకూ ఈ సంస్థకు వ్యవస్థాపకులు ప్రదీప్, ప్రమోద్‌లే నిధులు సమకూర్చారు. రియల్ ఎస్టేట్, బేకరీ సంస్థల నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే భాగస్వాముల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తామని చెబ్తున్నారు వీరిద్దరూ. ఏంజెల్ ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నిధుల కంటే ఎక్కువగా మార్గదర్శకుల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబ్తున్నారు.

image


భవిష్యత్తు లక్ష్యాలు

బిగ్‌బేకరీ.ఇన్‌ను ఒక బ్రాండ్ తీర్చిదిద్ది... అధిక లాభాలు అందించే స్థాయికి చేర్చడం తమ మొదటి లక్ష్యమంటున్నారు ప్రదీప్. రోజుకు 1000 లావాదేవీలకు మించిన స్థాయికి చేరుకోవడం, చెన్నై,హైద్రాబాద్, పూనే, కొచ్చి, త్రివేండ్రం, ముంబైలకు విస్తరించడం తర్వాతి లక్ష్యాలుగా ఉన్నాయి. 2017 5వేల మంది ఉద్యోగులతో 10 నగరాల్లో సేవలందిస్తూ 100మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. అలాగే కొన్ని యూరోపియన్ కంపెనీల భాగస్వామ్యంతో అక్కడి ఉత్పత్తులను భారత్‌లో విక్రయించే టార్గెట్ కూడా ఉంది. అలాగే ఇక్కడి హోమ్ చెఫ్స్‌తో తయారు చేయించిన ఉత్పత్తులను ఐరోపాదేశాల్లో విక్రయించగలిగే స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు ప్రదీప్.