ఆర్ట్స్‌, కామర్స్‌ స్టూడెంట్స్‌ స్టార్టప్స్ తో సత్తా చాటలేరా..?

నాన్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌లో క్రియేటివిటీకి కొదవలేదు -సామర్థ్యాలు పెంచుకుంటే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే స్టార్టప్స్‌-

ఆర్ట్స్‌, కామర్స్‌ స్టూడెంట్స్‌ స్టార్టప్స్ తో సత్తా చాటలేరా..?

Thursday February 11, 2016,

2 min Read

ఆంట్రప్రెన్యూర్షిప్ కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకేనా? స్టార్టప్ స్థాపించాలంటే వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందా? సాధారణ డిగ్రీ హోల్డర్లు మంచి వ్యాపారవేత్తలు కాలేరా? ఈ సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అందుకే ఇటీవల యంగ్‌ ఎంట్రప్రెన్యూర్స్ ను ప్రోత్సహించేందుకు, స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్‌ ఇండియా లాంటి కార్యక్రమాలు ప్రారంభించాయి. అయినా సరే, స్టార్టప్‌ అనగానే అదేదో టెక్నాలజీపై పట్టున్నవారికి మాత్రమే సంబంధించిన సబ్జెక్టు అనే అపోహ ఇంకా తొలగలేదు. వాస్తవానికి ఆ అభిప్రాయంలో వాస్తవం లేదు. ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ గ్రాడ్యుయేట్లు తలచుకోవాలేగానీ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఎన్నో స్టార్టప్‌లు నెలకొల్పి సత్తా చాటొచ్చు.

image


క్రియేటివిటీ తక్కువనే ముద్ర

సాధారణ డిగ్రీ హోల్డర్లతో పోలిస్తే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు క్రియేటివిటీ ఎక్కువని చాలా మంది భావిస్తారు. ప్రతిష్ఠాత్మక IIT – IIMలలో చదువుకున్న వారే మేథావులన్న అభిప్రాయం సమాజంలో పాతుకుపోయిందన్నది అంగీకరించాల్సిన సత్యం. అందుకే టెక్నాలజీ రంగం, స్టార్టప్‌లలో బీఎస్సీ/బీకాం/బీఏ గ్రాడ్యుయేట్లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఈ అభిప్రాయం తప్పని నిరూపించేందుకు మనలో దాగి ఉన్న శక్తియుక్తుల్ని, సామర్థ్యాలకు పదును పెట్టుకోవాలి. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లతో తామేం తక్కువ కాదని నిరూపించాలి.

ఈ స్టోరీ కూడా చదవండి

సామాజిక స్పృహ ఎక్కువ

ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ తో పోలిస్తే ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ స్టూడెంట్స్‌ కు సామాజిక స్పృహ ఎక్కువ. ఇంజనీరింగ్‌తో పోలిస్తే గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో స్టూడెంట్స్‌ క్లాస్‌లకు అటెండ్‌ కావడం, పుస్తకాలతో కుస్తీపట్టడం తక్కువే. వాళ్లు క్లాస్‌ రూంలో కన్నా బయటే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలపై అవగాహన కూడా ఇంజనీర్ల కన్నా వీరికే ఎక్కువ.

ఉద్యమాలు చేయాలన్నా, భారీ సభలు నిర్వహించాలన్నా వీరి తర్వాతే ఎవరైనా. ఎంట్రప్రెన్యూర్స్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం అందరినీ కలుపుకుపోయేతత్వం. గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో చదువుకున్న వారిలో ఇది అపారం. అందుకే వీళ్లు చిన్న బృందంలోనే కాదు.. పెద్ద గ్రూపుల్లోనూ ఈజీగా కలిసిపోయి పనిచేస్తారు. కొన్ని టెక్నికల్‌ స్కిల్స్‌, మరికొంత శిక్షణ తీసుకుంటే చాలు.. వీళ్లు కూడా కంపెనీలను పరుగులు పెట్టించగలరు.

అవకాశాలు తక్కువే

సాధారణ గ్రాడ్యుయేట్లకు మంచి ఉద్యోగాలు దొరకవన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవాల్సిందే. అయితే వారిలో సత్తా లేక కాదు. తమ సామర్థ్యం గురించి తెలుసుకోక చాలా మంది కాల్‌ సెంటర్లు, తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటారు. మరి ఫ్యూచర్‌ గురించి కన్న కలల మాటేమిటి? అవన్నీ కలలుగానే మిగిలిపోవాల్సిందేనా? అంటే ఏ మాత్రం కాదు. మన భవిష్యత్తును బంగారమయం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అయితే అందుకు కావాల్సిందల్లా కొంచెం ఎక్స్‌ ట్రా ఎఫర్ట్‌. ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. రోజువారీ ఎదురయ్యే సమస్యల గురించి మిగతావారికన్నా మనకే అవగాహన ఎక్కువన్న విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి. ఆంట్రప్రెన్యూర్‌ షిప్‌ అనేది మనకు ఓ ఆప్షన్‌ కాదు.. అవసరం అని గుర్తించాలి. ఐఐటీ పట్టాల్లేకుండానే ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు ప్రాణం పోసిన వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి.

అనుభవం, సామర్థ్యాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే మంచి ఎంట్రప్రెన్యూర్స్ అనిపించుకోగలం. పది మందికి ఉపాధి కల్పించడమే కాదు... మరో నలుగురికి వెన్నుతట్టి ప్రోత్సహించినవారమవుతాం. డబ్బు, హోదా కాదు మన ఐడియానే మనల్ని గొప్ప ఎంట్రప్రెన్యూర్‌ ను చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు.. విజయం దానంతట అదే వరిస్తుంది.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి