భారతీయులందరికీ ఉచితంగా జియో ఫీచర్ ఫోన్

0

టెలికం రంగంలో జియో మరో సంచలనానికి తెరలేపింది. జియో ఫీచర్ ఫోన్ లాంచ్ చేయడమే కాకుండా భారతీయులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తున్నామని ప్రకటించింది. ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఆ డబ్బు కస్టమర్లకు రిఫండ్ చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

ఆగస్ట్ 24 నుంచి ఫోన్ల బుకింగ్ మొదలవుతుంది. సెప్టెంబర్ 1నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. జియో ఫోన్ నుంచి వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. నెల రోజుల వ్యాలిడిటీతో 153 రూపాయల అన్ లిమిటెడ్ డేటా ప్యాక్ కూడా ఇస్తారు. ఎస్సెమ్మెస్ పంపాలన్నా, కాల్ చేయాలన్నా వాయిండ్ కమాండ్ తో సులువుగా చేసుకోవచ్చు. పలు రకాల పేమెంట్ సర్వీసులను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించబోతున్నారు. భాషా అనేక్ భారత్ ఏక్ అంటూ 22 భాషల్లో ఫోన్ పనిచేస్తుంది. చిన్న సైజులో కనిపిస్తున్న ఈ ఫోన్లో వందల కొద్దీ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.అన్ని రకాల ప్రీ లోడెడ్ అప్లికేషన్స్ జియో ఫోన్లో కనిపిస్తాయి.

ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ బేసిస్లో మొదట బుక్ చేసుకున్న వారికి డెలివరీ అందుతుంది. తొలివిడడలో 50 లక్షల ఫోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫోన్ తో పాటు టీవీ కేబుల్ను కూడా ఇస్తున్నారు. దీంతో జియో ఫోన్ను ఏ టీవీకైనా కనెక్ట్ చేసుకోవచ్చు. జియో ఫోన్ స్క్రీన్పై వచ్చే వీడియోలను పెద్ద స్క్రీన్ పై చూసుకునే ఈ వెసులుబాటు కల్ఇపంచారు. దీన్ని జియో ధనాధన్ 309 ఆఫర్ కింద వర్తింపజేశారు.

ముంబయిలో జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియోఫోన్ విడుదల చేశారు. మేడిన్ ఇండియాలో భాగంగా ఈ ఫోన్ను తయారుచేసినట్లు ముఖేశ్ తెలిపారు.  

Related Stories

Stories by team ys telugu