ఆఫ్రికన్ బొమ్మలను హైదరాబాద్‌ చేర్చిన ‘ఆఫ్రిక్రాఫ్ట్’

ఆఫ్రికన్ బొమ్మలను హైదరాబాద్‌ చేర్చిన ‘ఆఫ్రిక్రాఫ్ట్’

Sunday October 25, 2015,

3 min Read

ఆఫ్రికన్ బొమ్మలకు కావాలంటే ఇప్పుడు వేలకిలో మీటర్లు ప్రయాణం చేయక్కర్లేదు. తెలిసిన వారెవరైనా ఆఫ్రికా వెళ్తున్నారంటే తీసుకు రండి అని వాళ్లని రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆఫ్రీక్రాఫ్ట్‌లో అలాంటి బొమ్మలన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్ లైన్లో ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. కొరియర్‌లో ఇంటికే వచ్చేస్తోంది.

image


“కెన్యా నుంచి నేను ఇండియా వచ్చేటప్పుడల్లా తెలిసిన వారి కోసం ఈ బొమ్మలను బహుమానాలుగా తెచ్చే దాన్ని. ఆసక్తి గా ఉండటంతో దీన్ని వ్యాపారంగా చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. ఆఫ్రోకాఫ్ట్‌ ప్రారంభమైంది అంటారు '' - ఫౌండర్ ప్రీతి

ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోయిన చాలా రకాలైన పురాతన సాంప్రదాయాలు ఆఫ్రికాలో కొనసాగుతున్నాయి. అందులో ఈ బొమ్మల తయారీ ఒకటి. లక్షల్లో కార్మికులు ఈ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆఫ్రికా బయట ఈ బొమ్మలకు మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో ఆఫ్రిక్రాఫ్ట్‌లో మాత్రమే దొరుకుతాయి. గతంలో చైనా, ఇండోనేషియాల నుంచి ఈ బొమ్మలను తెప్పించుకునే వాళ్లు. ఇప్పుడా అవసరం లేందంటారు ప్రీతి.

image


ఏలాంటి ప్రాడక్టులు లభిస్తాయి

ఇంటీరియర్ డిజైనింగ్‌లో కొత్తగా ఆఫ్రికన్ బొమ్మలను చేరుస్తున్నారు. హై ఎండ్ పీపుల్స్ లైఫ్‌స్టైల్లో ఇప్పుడు ఈ తరహా బొమ్మలతో షో చేసుకోవడం భాగమైపోయింది. రెండు వేల నుంచి రెండు లక్షల దాకా ధర ఉన్న ఈ బొమ్మలను ఈ-కామర్స్ సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని 'ఆఫ్రిక్రాఫ్ర్' ఫౌండర్ ప్రీతి చెప్తారు. ఆఫ్రీక్రాఫ్ట్ సైట్ తో పాటు అమెజాన్‌లో ఈ బొమ్మలు దొరుకుతున్నాయి.

“ఆఫ్రికాలో తయారు చేసిన మాస్టర్ పీస్ లను కస్టమర్లకు అందించడమే ఆఫ్రీ క్రాఫ్ట్ లక్ష్యం” ప్రీతి

తూర్పు ఆఫ్రికాలోని కంబ తెగలకు చెందిన బొమ్మలివి. ఆఫ్రికా మొత్తం మీద ఈ బొమ్మలు అత్యంత ప్రభావశీలమైనవి. అన్నింటి కంటే ధర ఎక్కువ గల నాణ్యమైన ప్రాడక్టులివి. ఈ ప్రాంత ప్రజల్లో సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇంకా చెక్కు చెదరలేదు. వేల సంవత్సరాలుగా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ కళకు ఇంత ప్రాముఖ్యం ఉంది. వీటిని భారతీయలకు పరిచయం చేసినందుకు ఆనందంగా ఉందంటున్నారామె.

image


ఆఫ్రిక్రాఫ్ట్ ప్రారంభం

2014లో ఆఫ్రీక్రాఫ్ట్‌కు బీజం పడింది. అయితే ఆఫ్రికా నుంచి షిప్మోట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైసెన్స్ , ఫర్మ్, ఈ-కామర్స్ సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది మాత్రం ఈ ఏడాది జనవరిలో. అయితే సైట్ మొదలైన రోజు నుంచే ఆర్డర్లు రావడం ఆనందించదగిన విషయం. హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో జరిగే ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్‌లో పాల్గొనడం బాగా కలసివచ్చిందని ప్రీతి చెబుతారు.

“మా ఫ్యామిలీలో ఎవరూ వ్యాపారులు లేరు. వ్యాపారం చేయాలని ఆలోచించిన మొదటి వ్యక్తిని నేనే” - ప్రీతి

ప్రస్తుతానికైతే ఆఫ్రికానుంచి తీసుకొచ్చిన వస్తువుల్లో సగానికి పైగా వస్తువులు సేల్ అయిపోయాయి. కొత్తవి తీసుకు రావాలని చూస్తున్నాం. ఆన్ లైన్ లో సేల్స్ అదరగొడుతున్నాం అని అంటారు.

image


ఆఫ్రిక్రాఫ్ట్ టీం

ప్రీతి ఫిలిప్ , ఆఫ్రిక్రాఫ్ట్ ఫౌండర్. కెన్యాలోనే పుట్టి పెరిగిన ప్రీతి 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడే ఎంబిఏ పూర్తి చేసిన ఆమె రెండు మూడు ఉద్యోగాలు చేశారు. సొంతంగా ఏదైనా ప్రారంభించాలని అనుకన్న సమయంలో ఆఫ్రిక్రాఫ్ట్ ఆలోచన తట్టింది. దాదాపు ఏడాది పాటు దీనిపై గ్రౌండ్ వర్క్ చేసిన ప్రీతి... ఈ ఏడాది పూర్తి స్థాయి ఈ-కామర్స్ సైట్ ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ఈ స్టార్టప్‌కు ఇండియాలో ప్రతీ చోట నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ప్రీతితో పాటు మరో ఐదుగురు సభ్యులు ఇందులో ఉన్నారు. కొన్ని యాడ్ ఏజెన్సీలతో కూడా టైఅప్ అయ్యారు.

image


లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల

బొమ్మలను సప్లై చేసే ఈ-కామర్స్ సైట్లు చాలా ఉన్నప్పటికీ ఆఫ్రికన్ బొమ్మలను అందించే సైట్లు ఇండియాలో మొదటిది ఆఫ్రిక్రాఫ్ట్ మాత్రమే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆఫ్ లైన్ స్టోర్‌లో కూడా వీటిని అందుబాటులోకి తెచ్చారు. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలతో టై అప్ అయి B2B బిజినెస్‌లోకి ఇప్పటికే ప్రవేశించిన ఆఫ్రిక్రాఫ్ట్ మరింతగా విస్తరించే ప్రణాళిక చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా యాప్ లాంచ్ చేయాలని చూస్తున్నట్లు ప్రీతి చెప్పుకొచ్చారు.

website