భారతీయ హస్తకళలకు ప్రాణం పోస్తున్న హాండీకార్ట్  

1

వేల ఏళ్లక్రితమే భారతీయ హస్తకళా నైపుణ్యం పరిఢవిల్లింది. ఐదువేల ఏళ్లనాటి ఇండస్ వాలీ నాగరికత కాలంలోనే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ భారతదేశంలో ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఆ వైభవం క్రమంగా మసకబారిపోతోంది. అదృష్టం కొద్దీ ఎక్కడో చోట కొన్ని కళలు బతికి బట్టకట్టాయంటే.. కొన్ని హాండీక్రాఫ్ట్ స్టార్టప్ ల పుణ్యమే. అవి కనుమరుగైపోతున్న కళల్ని, కళకారుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి అలాంటి కోవలోకి చెందిందే ఢిల్లీకి చెందిన హాండీకార్ట్ స్టార్టప్.

వారసత్వం అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి మారాలి. దురదృష్టం కొద్దీ కొన్ని విషయాల్లో అలా జరగడం లేదు. ముఖ్యంగా హస్తకళలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆధునిక జీవన శైలి మాయలో పడి ఆర్టిఫీషియల్ హంగుల వెంట జనం పరుగులు పెడుతున్నారు. ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ మంతా కృత్రిమత్వం అలుముకుంది. ఈ గ్యాప్ ని పూరించి ఎంతోకొంత హస్తకళలకు, కళాకారులకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రియాంక్ హాండీకార్ట్ స్టార్టప్ ప్రారంభించాడు.

ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇండియా అంతటా నెట్ వర్క్ బిల్డప్ చేయడానికి ఆరు నెలలు పట్టింది. కళాకారులను వెతికి పట్టడానికి మారుమూల గ్రామాలన్నీ తిరిగాడు. ఎక్కడా డైరెక్టుగా వారిని కలవలేకపోయాడు. మధ్యవర్తులు, వర్తకుల ద్వారానే వారి గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో 70 లక్షలు ఖర్చయ్యాయి. ఎనిమిది నెలల తర్వాత స్టార్టప్ ఒక రూపానికొచ్చింది. రూ. 15 లక్షలతో వ్యాపారం మొదలైంది. ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ లో పదవేల ప్రాడక్టులతో 27 కేటగిరీల వారీగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అతి కొద్ది కాలంలోనే గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్ ఫాం రూపుదిద్దుకుంది. అమెరికా, యూరప్ లో కూడా ప్రాడక్టులను అమ్ముతున్నారు.

నెట్ వర్క్ మరింత బలోపేతం చేసి పదివేల ఉత్పత్తులను 75 కేటగిరీల్లో అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాంఛైజీలకు అవకాశమిచ్చి సేల్స్ పెంచాలనే ప్లాన్ లో ఉన్నారు.

ఇండియాలో హస్తకళల మార్కెట్ ఏడాదికి 5 బిలియన్ డాలర్లుంది. ఏటికేడు కొత్తకొత్త స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. క్రాఫ్ట్స్ విల్లా, ఇండియన్ రూట్స్, సీ బజార్, ఉత్సవ్ ఫ్యాషన్, నమస్తే క్రాఫ్ట్ ఈ కోవలోకే వస్తాయి. వీటితో పాటు ఈ కామర్స్ సంస్థలు కూడా ఈ సెగ్మెంట్లోకి అడుగుపెట్టాయి. ఇటీవలే ఫ్లిప్ కార్ట్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ పెట్టుకుంది. వారణాసి కళాకారులకు ఆర్ధిక చేయూత అందివ్వడం కోసం స్నాపం డీల్ ఇండియా పోస్ట్ తో జతకట్టింది.

నిపుణులు ఏమంటున్నారంటే..

హస్తకళల మార్కెట్ ఎక్కువగా ఆఫ్ లైన్ లోనే సాగుతోంది. 70-80 శాతం ఆఫ్ లైన్ మార్కెట్ వుంటే, 20-30 శాతం మాత్రమే ఆన్ లైన్ నడుస్తోంది. దానివల్ల మధ్యవర్తులు, దళారీలే ఎక్కువ లాభపడుతున్నారు. ఈ అసంఘటిత రంగంలో కళాకారుడి నైపుణ్యానికి, కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదు. అదొక్కటే విచారించాల్సిన విషయం. 

Related Stories