పల్లె ప్రజల ఆరోగ్యం కోసం పరితపిస్తున్న జీనా జోహర్

0

విదేశాల్లో చదువు, మంచి ఉద్యోగం.. ఈ రెండు ఉంటే ఎవరైనా జీవితాన్ని సుఖంగా గడిపేందుకే ఇష్టపడతారు. కానీ జీనా జోహర్ మాత్రం పేద ప్రజల ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఎలా అందించేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

జీనా జోహార్.. సుగావజావు హెల్త్‌కేర్, ఐకేపీ సెంటర్ ఫర్ టెక్నాలజీస్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఐసీటీపీహెచ్) ఫౌండర్ మెంబర్. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చులో కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నది. దీంతోపాటు మానవ వనరులను కూడా అందిస్తున్నది. ఇటీవల జరిగిన హెల్త్ 2.0 కాన్ఫరెన్స్‌లో జీనాతో యువర్‌స్టోరీ ముచ్చటించింది.

రిటర్న్ టు ఇండియా..

జీనా జోహర్ మొలిక్యూలర్ డయాగ్నస్టిక్స్ అనే అంశంపై స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఈటీహెచ్‌లో 2007లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఐసీటీపీహెచ్‌కు ప్రెసిడెంట్‌గా సేవలందిస్తున్న జీనా సుగావజావు హెల్త్‌కేర్ (ఎస్‌వీహెచ్‌సీ) సంస్థకు ఎండీ కమ్ సీఈవో. ఎస్‌వీహెచ్‌సీ తన తొలి గ్రామీణ ప్రాంత క్లినిక్‌ను తమిళనాడులోని తంజావురులో 2009లో ప్రారంభించింది. అలాంటి గ్రామీణ క్లీనిక్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏడున్నాయి. ఈ సంస్థ 50 వేలమంది రోగులను పరీక్షించడంతోపాటు మూడువేలమందికి డయాబెటిస్, హెపర్‌టెన్షన్ వంటివి ఉన్నట్టు గుర్తించింది. ఐసీటీపీహెచ్ అకాడమిక్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ సహకారంతో నిర్వహిస్తున్న సంస్థకు జీనా నాయకత్వం వహిస్తున్నారు. ఆయూష్ పిటీషనర్‌ల కోసం నిర్వహిస్తున్న తొలి బ్రిడ్జ్ ట్రైనింగ్ జాయింట్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్ ఇది. ఇంటర్నేషనల్ పార్ట్‌నర్‌షిప్ ఇన్ ఇన్నోవేటివ్ హెల్త్ డెలివరీ (ఐపీఐహెచ్‌డీ) నెట్‌వర్క్, డ్యూక్ యూనివర్సిటీ సీడ్ ఇంక్యూబేటర్ ప్రొగ్సామ్స్‌లలో సుగావజావు కూడా ఓ భాగం. జీనా 2013 సంవత్సరానికిగాను అశోకా ఫెలోగా ఎంపికయ్యారు.

అకాడమిక్ ఇంట్రెస్ట్స్..

కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) పబ్లిక్ హెల్త్ జాతీయ కౌన్సిల్, బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్‌ఫరమేటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ (ఐబీఏబీ) గవర్నింగ్ బోర్డులో జీనా మెంబర్. ప్రొఫెసర్ రమేశ్ రాఘవన్‌తో కలిసి అమెరికా సెయింట్ లూయిస్‌లోని వారెన్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్, వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆఫ్ క్యాంపస్ కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు జీనా. జాతీయ, అంతర్జాతీయ ఫోరమ్స్‌కు జీనా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియా హెల్త్ ఫోరమ్, సింగపూర్ (2009), ఐసీఓడబ్యుహెచ్‌ఐ, ఫిలిడెల్ఫియా (2010); రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ గ్లోబల్ హెల్త్, ది వార్టన్ స్కూల్ (2010), ఎంఐటీ-ఎంఐఎస్‌టీఐ ఇండియా ప్రొగ్రామ్ (2010); ఇన్నోవేషన్ ఇన్ ఇండియాస్ హెల్త్‌కేర్ సెక్టార్, వార్టన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (2011) ఫోరమ్స్‌లలో జీనా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.