పేరెంట్ - టీచర్ చర్చా వేదిక 'స్కూటాక్స్'

విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లకు ఉపయోగపడేలా స్కూటాక్స్ వెబ్ సైట్సంస్థకు ఆరువేలకు పైగా యూజర్లురాజస్థాన్‌లో ఈ అప్లికేషన్స్‌ను ఉపయోగించుకుంటున్న 19 స్కూల్స్రూ.1.5 కోట్లతో స్కూటాక్స్ ప్రారంభించిన బహుల్

పేరెంట్ - టీచర్ చర్చా వేదిక 'స్కూటాక్స్'

Wednesday September 02, 2015,

4 min Read

స్కూళ్లో తమ పిల్లలు ఎలా చదువుతున్నారో అని పేరంట్స్ ఆందోళన. విద్యార్థులు ఇంట్లో చదువుతున్నారో లేదోనని టీచర్ల బాధ. అయితే పేరంట్-టీచర్ మీటింగ్ నెలకోసారో లేదో రెండు సార్లు మాత్రమే జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్‌లోనూ ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకోవడానికే టైం సరిపోవడం లేదు. మరి విద్యార్థుల తల్లిదండ్రలు-టీచర్లు ప్రతి రోజూ మాట్లాడుకోవడం ఎలా ? పిల్లల విద్య గురించి చర్చించేది ఎప్పుడు ? వీరి సమస్యలను పరిష్కరించేందుకు ఓ వెబ్‌సైట్‌ను సృష్టించారు బహుల్ చంద్ర. స్కూటాక్స్ పేరుతో వెబ్ సైట్‌ను నిర్వహిస్తూ అందరి ఆందోళనలనూ సులువుగా తీరుస్తున్నారు.

ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. ఏదో చేయాలన్న తపన వెంటాడుతుంటుంది. కానీ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా ఏదో ఒక ఉద్యోగంతో రాజీ పడాల్సి ఉంటుంది. బహుల్ చంద్ర కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాల్లో డాట్ స్క్వేర్.కామ్ తరఫున రెండువేలమంది క్లయింట్లతో పని చేసిన తర్వాత వెయ్యి వెబ్ సిస్టమ్స్‌ను, రెండు వేల అప్లికేషన్లను రూపొందించిన తర్వాత చివరకు తాను విశ్వసించిన దాన్ని ప్రారంభించి సక్సెస్ అయ్యారు.

అది 2014 క్రిస్మస్ సమయం. బహుల్, ప్రశాంత్ తమ కుటుంబాలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. లంచ్ సమయంలో బహుల్ తన కుమారుడి క్లాస్‌మేట్ పేరంట్స్ నుంచి ఓ కాల్ వచ్చింది. తమ కుమారుడి బర్త్ డే ఫంక్షన్ కు పిల్లాడిని పంపమని. బర్త్‌డే ఇన్విటేషన్ మంచిదే అయినప్పటికీ, బహుల్‌కు ఆ ఫ్రెండ్ ఎవరో గుర్తుకు రాలేదు. దీంతో బర్త్ డే పార్టీకి పంపాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోయారాయన.

అవసరమైనప్పుడు నేరుగా మాట్లాడుకునేందుకు ఓ అఫిషియల్ ప్లాట్‌ఫామ్ లేదని బహుల్ అప్పుడు గుర్తించారు. స్కూల్ సంబంధిత సమావేశాలు చాలా తక్కువగా, అవసరమున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. దీంతో పేరెంట్స్-టీచర్స్ ఎప్పుడో కానీ మాట్లాడుకోరు. టీచర్సే కాదు పిల్లల తల్లిదండ్రులు కూడా కలుసుకునేది చాలా తక్కువ. దీంతో తల్లిదండ్రులు-టీచర్ల కమ్యూనికేషన్ కోసం ఓ వేదికైన 'స్కూటాక్స్‌'ను ప్రారంభించాలని బహుల్ నిర్ణయించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు. ఒకరి వయసు ఏడేళ్లు. మరొకరికి మూడు.

‘‘స్కూ టాక్స్ ఏర్పాటుపై కొందరితో మాట్లాడాం. ఐతే స్కూల్ సంబంధిత విషయాలను మాట్లాడుకునేందుకు విద్యార్థుల తల్లులు కొందరు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. ఐతే ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇలా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని మేం అనుకున్నాం. డైరీ కల్చర్ కు స్వస్తి చెప్పి కమ్యూనికేషన్ ను మరింత సులభం చేయాలన్నదే మా ఉద్ధేశం’’ అని బహుల్ చెప్పారు.
స్కూటాక్స్ టీమ్..

స్కూటాక్స్ టీమ్..


2015 జూన్ లో స్కూటాక్స్ ను ప్రారంభమైంది. కమ్యునికేషన్ టూల్స్, అప్లికేషన్స్ (వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్) ఉన్న ప్రొఫెషనల్ కమ్యూనిటీ ఇది. బ్లాగులు, పోస్టుల ద్వారా తల్లిదండ్రులు నేర్చుకునే విధంగా ఈ స్కూటాక్స్‌లో పొందుపర్చామని సంస్థ వ్యవస్థాపకులు బహుల్ చంద్ర, ప్రశాంత్ గుప్తా తెలిపారు.

జైపూర్‌లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ తొలిసారిగా ఈ స్కూటాక్స్ వెర్షన్‌ను ఉపయోగించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 19 స్కూల్స్ ఈ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నాయి. ఆరువేలకుపైగా పెయిడ్ యూజర్లున్నారు. దీన్ని మరికొన్ని నెలల్లోనే 2.3 లక్షలకు చేర్చాలన్నది సంస్థ లక్ష్యం.

సొంత మూలధనం రూ.1.5 కోట్లతో ఈ సంస్థను ప్రారంభించారు. ఎనిమిది వేర్వేరు మాడ్యూల్స్ లో ఈ ప్లాట్ ఫామ్ ను ఎండార్స్ చేశారు. ఈవెంట్ ప్లానర్స్, చైల్డ్ ఎక్స్ పర్ట్స్, లోకల్ ట్యూటర్స్, ఫోరమ్ ఫర్ డిస్కషన్స్, న్యూస్ ఫర్ చిల్డ్రన్ అన్న మాడ్యూల్ ఇందులో ఉన్నాయి. భవిష్యత్ లో చైల్డ్ కౌన్సెలర్లను కూడా చర్చల్లో పాల్గొనేలా చేసి, తల్లిదండ్రులకు సరైన సలహాలు ఇప్పించాలని సంస్థ యోచిస్తున్నది.

ఈ సంస్థ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ‘‘ఒక్క కొత్త స్కూల్ మా ప్లాట్ ఫామ్ లో చేరితే మా యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక స్కూల్ లో ఒక క్లాస్ చేరితే 70 నుంచి 80 మంది తల్లిదండ్రులు యాడవుతారు. ప్రతి మూడు వారాలకోసారి మా యూజర్ల సంఖ్య రెట్టింపవుతున్నది. 50 లక్షల యాక్టీవ్ యూజర్లను సంపాదించడమే మా లక్ష్యం’’ అని బహుల్ చెప్పుకొచ్చారు.

సబ్ స్క్రిప్షన్ ఆధారంగా వీరు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఏడాదికి ఒక్కో పిల్లాడికి ప్రతి పేరెంట్స్ నుంచి రూ.499 వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా రూ.5 కోట్ల రెవెన్యూను సంపాదించడమే లక్ష్యమని ఆయన చెప్తున్నారు.

స్కూటాక్స్ నిర్వహించిన ఎగ్జిబిషన్ లో పాల్గొన్న తల్లిదండ్రులు

స్కూటాక్స్ నిర్వహించిన ఎగ్జిబిషన్ లో పాల్గొన్న తల్లిదండ్రులు


భవిష్యత్ లక్ష్యాలు

వెబ్, కంటెంట్ డెవలపర్స్, డాటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ రీసెర్చ్, సోషల్ మీడియా నిపుణులు, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌తో కలుపుకుని ఈ సంస్థలో మొత్తం 40 మంది ఉద్యోగులున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సంస్థను విస్తరించాలన్న యోచనలో ఉన్న యాజమాన్యం ఉద్యోగుల సంఖ్యను 60కి పెంచాలని భావిస్తున్నది.

ముంబై, గుర్గావ్, ఢిల్లీలతోపాటు మొత్తం 40 నగరాల్లో సంస్థను విస్తరించాలని అనుకుంటున్నారు. మరో ఆరునెలల్లో కాన్ఫరెన్స్‌లను కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు స్కూ టాక్స్ ప్లాన్ చేస్తున్నది. స్కూటాక్స్‌లో చేరేందుకు తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ ప్రిన్సిపల్స్‌ను ఎడ్యుకేట్ చేయాలన్నదే ఈ సంస్థ ప్రాథమిక లక్ష్యం. ఒక్క స్కూల్ చేరితే 3500 మంది పిల్లలు, ఏడు వేలమంది తల్లిదండ్రులు, 200 మంది టీచర్లు, వారితోపాటు మరికొందరు స్కూటాక్స్ లో సభ్యులవుతారు.

నిధులను సమీకరించేందుకు మరికొందరు ఇన్వెస్టర్లతో యాజమాన్యం సంప్రదింపులు కూడా జరుపుతున్నారు.

స్కూటాక్స్ వ్యవస్థాపకులు బహుల్ చంద్ర (లెఫ్ట్), ప్రశాంత్ గుప్తా

స్కూటాక్స్ వ్యవస్థాపకులు బహుల్ చంద్ర (లెఫ్ట్), ప్రశాంత్ గుప్తా


ఒకసారి ఒక్కో మాడ్యూల్ ను తీసుకొని వచ్చి ఉంటే బాగుండేదని సహ వ్యవస్థాపకులు ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకేసారి అన్ని మాడ్యూల్స్‌ను డెవలప్ చేయడంతో యూజర్లు పూర్తి స్థాయిలో వాటిపై అవగాహన పెంచుకోలేకపోతున్నారు. దీంతో వారిని మరింత ఎడ్యుకేట్ చేసేందుకు సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ వెంచర్‌ను మరోసారి రివాల్యూయేట్ చేసి, సులభంగా యూజర్లు ఉపయోగించుకునేలా రూపొందించనున్నారు.

ఇండస్ట్రీ..

ఎర్నెస్ట్ అండ్ యంగ్, ఫిక్కీ నిర్వహించిన సర్వే ప్రకారం కే-12 స్కూల్ సిస్టమ్ ప్రపంచంలో అన్నింటిలో కంటే భారత్ లోనే అధికం. ఈ విధానంలో 1.4 మిలియన్ల స్కూళ్లు, 250 మిలియన్ల విద్యార్థులున్నారు. ఇక టాప్-20 రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్ సెక్టార్‌ను పరిశీలిస్తే 55 శాతం సెకండరీ/హైయ్యర్ సెకండరీ లెవల్ లోనే ఎన్ రోల్ మెంట్స్ జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఈ వెంచర్ ను ఉపయోగిస్తున్నవారిలో ఎక్కువమంది ప్రైవేట్ స్కూల్స్ కు చెందినవారే. సగటు వార్షిక వృద్ధి కూడా నాలుగు శాతం ఉంది. ఈ నేపథ్యంలో యూజర్లను సంపాదించేందుకు ఈ స్టార్టప్ కు ఎంతో అవకాశముంది.

వెబ్‌సైట్