త్వరలో గడ్డి నుంచి పెట్రోల్ తీయబోతున్నారు..!!  

1

మొక్కల నుంచి క్రూడాయిల్, దాన్నుంచి పెట్రోల్ వెలికి తీయడం అనేది ఇప్పుడప్పుడే జరగని పని. ఆ టెక్నాలజీ రావడానికి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే బెల్జియంలోని ఘెంట్ యూనివర్శిటీ పరిశోధకులు ఇప్పట్లో అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేస్తున్నారు. జీవ ఇంధన తయారీ కోసం అడుగులు వేగంగా పడుతున్న ఈ నేపథ్యంలో- మొక్కల నుంచి ఏవియేషన్ ఫూయెల్ తయారుచేసే విధానం కూడా త్వరలో రూపుదాల్చబోతున్నది.

ఇప్పటిదాకా గడ్డి- పశువులకు మేతగానే ఉపయోగపడింది. కానీ ఇప్పుడు అదే గడ్డి నుంచి పెట్రోల్ కూడా రాబోతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది పచ్చినిజం. పశువులతో పాటు మనిషికి అనేక రకాలుగా ఉపయోగపడే గడ్డి నుంచి ఇంధనం తయారు చేయబోతున్నారు.

ముందుగా గడ్డిని బాక్టీరియల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా అది మరింత బయోడీగ్రేడబుల్ అవుతుంది. అది కిణ్వ ప్రక్రియకు దారి తీస్తుంది. దాన్నుంచి లాక్టిక్ యాసిడ్ ఉత్పన్నమవుతుంది. దానిద్వారా కాప్రోయిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తారు. దాన్ని కెమికల్ రియాక్షన్ చేసి డికేన్ తయారు చేస్తారు. డికేన్ అనేది ఆల్కైన్ హైడ్రోకార్బన్. విమాన ఇంధనానికి కావల్సిన మొట్టమొదటి ఇంగ్రీడియెంట్ అదే.

ఒక్క విమానాలు తప్ప, వాహనాలన్నీ ఎలక్ట్రికల్ మోడ్ లోకి మారిపోతున్నాయి. వచ్చే 20 ఏళ్లలో కూడా విమానాలను ఆ దిశగా నడిపాలన్న చర్యలేవీ కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఇంధన వనరుల వాడకం అంతకంతకూ పెరుగుతున్నాకొద్దీ- ప్రత్యామ్నాయ వనరుల కోసం చూడటం అనివార్యమైపోయంది. ఈ నేపథ్యంలో గడ్డినుంచి ఇంధనం తీయడమనేది అద్భుత ఆలోచన. ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తున్న ఈ ప్రయోగం నిజరూపం దాల్చడానికి కావడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు పరిశోధకులు. ఎంత కాలం పట్టినా ఈ ప్రయోగం మాత్రం వందశాతం సక్సెస్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. గ్యాసోలైన్ నుంచి గ్రాసోలైన్ గా మారుతున్న ఈ ప్రక్రియ విజయవంతమైతే.. గడ్డి పరకల సాయంతో మనం గాల్లో ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవన్నమాట. 

Related Stories

Stories by team ys telugu