'షాప్ ఆన్ లేడీ'తో మీ ఇంటి దగ్గరి ఆఫర్లు తెలుసుకోవచ్చు

'షాప్ ఆన్ లేడీ'తో మీ ఇంటి దగ్గరి ఆఫర్లు తెలుసుకోవచ్చు

Sunday September 27, 2015,

3 min Read

కేరళలోని స్టార్ట్ అప్ విలేజ్... ఆ రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఉత్సాహం,టాలెంట్ ఉన్న ఎంతోమందికి అది మంచి వేదికగా ఉపయోగపడుతోంది. అలా కేరళ స్టార్టప్ విలేజ్ ఇచ్చిన ప్రోత్సాహంతో 'అడిక్టివ్ ఇన్నోవేషన్స్' ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఆంటోనీ , ఆంటో వర్గీస్, ఆషిక్ కళింగల్, అశ్విన్ చాకో, రోహిత్ కృష్ణన్,కిరణ్ కురియాస్, ఆదిత్య జోబ్ అనే ఏడుగురు కుర్రాళ్లు తమ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలోనే ఓ స్టార్టప్‌కి నాంది పలికారు. నెటిజన్ల అవసరాలన్నీ తీర్చేలా వెబ్ డిజైనింగ్, మొబైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ వంటి సేవలు అందిస్తోంది వీరు ప్రారంభించిన అడిక్టివ్ ఇన్నోవేషన్స్.

image


కాలేజీ నుంచి బయటకు రాకముందే యాప్ రెడీ

ఈ ఏడుగురు తమ డిగ్రీలు తీసుకోగానే..మొదటి ప్రొడక్ట్‌ను తయారు చేశారు కూడా. అదే 'షాప్ ఆన్ లేడీ' . ఇదో ఆన్ లైన్ జీపీఎస్ సిస్టమ్ వంటి అప్లికేషన్. యూజర్ల ఉన్న ప్రదేశాల్లో ఏ షాపులో ఏ ఏ ఆఫర్లున్నాయ్.. ? ఎలాంటి దుస్తులు ఉన్నాయ్..? వాటి వెరైటీలు..? అలానే గృహోపకరణాలు.. ఇవన్నీ కలిసి ఓ ఫ్యాషన్ జీపీఎస్‌లా మహిళలకు ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని షాపింగ్ చేయవచ్చు..లేదంటే నచ్చిన వస్తువులను తర్వాత కొనుక్కునేందుకు సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకరికి షేర్ చేయవచ్చు. అలానే ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే సేల్ చేయవచ్చు. అంటే ఇదో ఆన్ లైన్ షాపింగ్ సైట్‌లా వాడుకోవచ్చు. కాకపోతే ఇది రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ను కలగజేస్తుంది. అంటే నిజమైన ఐటెమ్స్ కన్పిస్తాయ్ ఈ అప్లికేషన్లో. 

" మామూలుగా అయితే ప్రతీ షాప్‌కీ వెళ్లడం...కాసేపు విండో షాపింగ్ చేయడం..తర్వాత మరో షాప్‌కి వెళ్లడం చేయాలి. కానీ ఇలా ఆన్‌లైన్ రియల్ టైమ్ మార్కెట్ వల్ల మొబైల్ నుంచే ప్రతీ షాపునూ యాక్సెస్ చేయవచ్చు. అలానే మొబైల్ నుంచే ఆర్డర్ ఇవ్వడం ద్వారా డైరక్ట్‌గా డెలివరీ కూడా తీసుకోవచ్చు" అని అడిక్టివ్ ఇన్నోవేషన్స్ స్టార్ట్ అప్ బ్యాచ్ లో ఒకరైన ఆంటోనీ అంటాడు.

ఆన్ లైన్ సైట్లో పర్టిక్యులర్‌గా ఏదోక కంపెనీ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. లేదంటే ఆ సైట్ అమ్మే ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ షాప్ ఆన్ లేడీ అప్లికేషన్ ..ఆ ప్రదేశంలో దొరికే అన్ని ప్రొడక్ట్స్ వివరాలు ఇస్తుంది కాబట్టి ఆ రకంగా ఇది ఇప్పటి రెగ్యులర్ ఈ-కామర్స్ సైట్లకి భిన్నంగా అర్థం చేసుకోవాలి.

మరి ఇంత విన్నూత్నమైన అప్లికేషన్ పాపులర్ కావాలంటే ముందుగా ఇందులో వ్యాపార సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలి. అందుకే షాప్ ఆన్ లేడీ చిన్న,మధ్యతరహాతో పాటుగా ఫ్యాషన్ డిజైనర్లు, బొటిక్స్ యజమానులను తమ అప్లికేషన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతోంది. ఇప్పటికే ఈ ఏడుగురు కుర్రాళ్ల టీమ్ కేరళలో 3500 బొటిక్స్, బ్యూటీ పార్లర్లు, జ్యూయెలరీ స్టోర్లను తమ యూజర్లుగా రిజిస్టర్ చేసేసుకుంది కూడా. ఆండ్రాయిడ్ బేస్డ్ ప్లాట్‌ఫాంతో యాప్ ప్రస్తుతం నడుస్తోంది. విమెన్ కేర్ ప్రొడక్ట్స్, కాస్ట్యూమ్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి..ఈ యాప్‌ను విమెన్స్ డే రోజున విడుదల చేసి తమ ప్రత్యేకత చాటారు. దానికి వచ్చిన రెస్పాన్స్ గురించి ఆంటోనీ చెప్తూ.." మొబైల్ యాప్ విడుదల చేసిన రోజు నుంచే 40 దేశాల నుంచి 12 వేల హిట్స్ వచ్చాయి. త్వరలోనే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ వెర్షన్‌పై నడిచే యాప్‌ను కూడా విడుదల చేస్తాం" అన్నాడు

పోటీదారులన్నా ప్రత్యేకత ఉంది

షాప్ ఆన్ లేడీ వంటి స్టార్టప్ గ్లిట్ స్ట్రీట్ అనే ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఉన్నా..దానికీ షాప్ ఆన్ లేడీ కి తేడా ఏమిటంటే.. బొటిక్స్‌ను వ్యక్తిగతంగా కలిసి మార్కెటింగ్ చేసుకోవడం గ్లిట్ స్ట్రీట్ కంపెనీ చేస్తోంది. షాప్ ఆన్ లేడీ విషయానికి వస్తే దాని కన్నా బెటర్ మోడల్. అలానే మొబైల్ యాప్ ద్వారా ఇలా విండో షాపింగ్ చేయడం షాప్ ఆన్ లేడీకి ఉన్న అడ్వాంటేజ్. అలానే ఇప్పటికే సక్సెస్ అయిన 'రోపోసో' దారినే ఇది కూడా ఎంచుకోవడంతో కేరళ స్టార్ట్ అప్ విజయవంతం అవుతుందనే అంచనాలున్నాయి. రోపోసో ఇండియన్ విమెన్ ఫ్యాషన్‌లో వస్తున్న ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఎక్స్‌క్లూజివ్‌గా లేడీస్ ప్రొడక్ట్స్‌కి సెర్చ్ ఇంజన్‌లా పని చేస్తూ పేరు తెచ్చుకుంది.

ఆన్ లైన్ మార్కెట్ ఈ కామర్స్‌తో 2020కల్లా 70 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. సహజంగానే జనాభా ఎక్కువ ఉన్న మనదేశంలో ఈ కామర్స్ విప్లవంతో..మన స్టార్టప్స్‌కీ మంచి ఆదాయం వస్తుందని నిపుణుల విశ్లేషణ. ఓ రకంగా ఐటీ రివల్యూషన్ తర్వాత ఇప్పుడు ఈ- కామర్స్ బూమ్ మొదలైందని భావిస్తున్నారు. అలాంటి ఈ సమయంలో షాప్ ఆన్ లేడీ బంపర్ హిట్టవ్వడానికి అన్ని అవకాశాలూ కన్పిస్తున్నాయ్. అతి పెద్దదైన మహిళల మార్కెట్‌ను టార్గెట్ చేసుకోవడం, మొబైల్ యాప్‌తో ఆన్ లైన్ షాపింగ్ వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని భావించాలి. 

అడిక్టివ్ ఇన్నోవేషన్స్ చేపట్టే ఇతర డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సర్వీస్‌కు వచ్చే ఆదాయంతో ప్రస్తుతం షాప్ ఆన్ లేడీ నడుస్తోేంది. "2013 లో డిగ్రీ తీసుకున్న తర్వాత స్కూళ్లు, మోటల్స్ , వైఎంసీఏ, మేధర్ బిల్డర్స్ , ఇండోసెర్ట్ వంటి సంస్థలకు వెబ్ ఆధారిత సేవలు అందించాం. ఇప్పుడు మా ఫోకస్ అంతా షాప్ ఆన్ లేడీపై పెడుతున్నాం" అని ఆంటోనీ చెప్పాడు..భవిష్యత్ కార్యాచరణపై ఆంటోనీ మాట్లాడుతూ.. కేరళలో తమ ప్రొడక్ట్ ను బాగా జనంలోకి తీసుకెళ్లాలని ఆ తర్వాత చెన్నై,బెంగళూరుకు విస్తారిస్తామని చెప్పాడు..సో..వాళ్లకి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం