అమెరికా ఆలోచనలు ఇండియాలో అమలు

క్లింటన్ పాలనా మండలి స్ఫూర్తితో ముందుకుmydala స్టార్టప్ నిర్వాహకురాలి విజయగాధ అన్నివర్గాల వారికి mydala తెలియాలినాస్‌డాక్‌లో లిస్టింగే లక్ష్యం అంటున్న అనిష సింగ్

అమెరికా ఆలోచనలు ఇండియాలో అమలు

Friday May 29, 2015,

2 min Read

‘మహిళలు ముందుకి వెళ్ళలేక పోవడానికి కారణం మహిళలే ’అంటారు mydala నిర్వాహకురాలు అనిష సింగ్ .

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 2009లో mydalaని ప్రారంభించారు అనిష సింగ్. సర్వీస్ బిజినెస్‌లకు సంబంధించిన సేవలు దీని ద్వారా అందించాలని ఆమె సంకల్పించారు. ఈ తరహా సేవల్లో ఇది దేశంలోనే మొదటి స్టార్టప్.

అనిష సింగ్, MYDALA వ్యవస్థాపకురాలు

అనిష సింగ్, MYDALA వ్యవస్థాపకురాలు


ఢిల్లీలోని సాంప్రదాయబద్ధమైన పంజాబీ ఫ్యామిలిలో పుట్టిన అనిష సింగ్ తొలినాళ్ల నుంచి వినూత్నమైన ఆలోచనలతో ముందుకి సాగేవారు. తండ్రి మాజీ సైనిక అధికారి. తల్లి డెంటిస్ట్. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన అనిష సింగ్... క్లింటన్ పాలనా మండలిలో పనిచేసారు. అక్కడ పనిచేయడం ఆమెకి ఎంతగానో ఉపయోగపడింది.

మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సాయం చేయాలో ఆమె బాగా అర్థం చేసుకున్నారు. డిగ్రీ పూర్తీ అయ్యాక అమెరికా వెళ్ళిన అనిష... వాషింగ్టన్‌లోని ఈస్ట్‌కోస్ట్ కంపెనీలో పనిచేసారు. మహిళలకు ఆర్థిక సాయం ఎలా అందించాలో ఆమె బాగా ఆకళింపు చేసుకున్నారు. అనంతరం ఆమె 2009లో mydala ప్రారంభించారు. అమెరికాలో పనిచేస్తున్నపుడు ప్రొఫెసర్‌లు ఆమెకు బాగా సహకరించారు. ఆ స్పూర్తితోనే mydala ప్రారంభానికి అడుగులు పడ్డాయి. జూలీ హోల్ద్రెన్ సాయంతో 400 మందితో mydala స్టార్ట్ అయింది.

"మొదట్లో నేను mydala అనే పేరు పెట్టాలని అనుకోలేదు. Kinis అనే పేరు పెట్టాలని భావించాను. అయితే సంస్కృతం అంటే నాకు ఏంటో ఇష్టం. దీంతో mydala అనే పేరు పెట్టాల్సి వచ్చింది. దీని అర్థం నా బృందం అని."

అమెరికాలో అందుబాటులో వున్న వివిధ వస్తువులు మన భారతీయ మార్కెట్‌లో అందరికి అందుబాటులోకి తేవాలని భావించిన అనిష సింగ్... ఇక్కడి ధరల్లో వాటినే అందించే ప్రయత్నం చేసారు. "వ్యాపారంలో ఒడిడుడుకులు మాములుగానే వుంటాయి. అయితే మనం ముందుకి వెళ్ళాలంటే కొన్ని కష్టాలు పడక తప్పదు. ప్రతి రోజు ఒక పాఠంలా వుండేది. తల్లి తండ్రులు, భర్త పిల్లలు అంతా సహకరించడం వల్లనే అన్ని ఇబ్బందులూ అధిగమించగలిగాను. నాలుగేళ్ళ అమ్మాయి, ఆరునెలల పాపతో మొదట్లో కష్టంగానే అన్పించేది."

"భారత దేశంలో మార్కెటింగ్ చేయడం చాలా ఇబ్బందితో కూడిన పనే. అందరి అభిరుచులకు తగ్గట్టు వస్తువులు అందించడం కత్తి మీద సాము లాంటిదే. మారుతున్న అభిరుచులకి అనుగుణంగా ముందుకి సాగడం ఒక ఛాలెంజ్ . దాన్ని నేను సాధించగలిగాను. మార్కెటింగ్ నెట్వర్క్ క్రమేపీ పెంచుకోగలిగాను. తక్కువ లాభానికి ఎక్కువ వస్తువులు మార్కెటింగ్ చేయగలగడంతో ఎక్కువ మార్జిన్ వచ్చేది.

image


mydala అనేది మిగత కంపెనీలకు ఏమాత్రం తీసి పోని విధంగా వుండాలి. వినియోగదారులకు అన్ని విధాలుగా సహకరించడం, వారికీ డిస్కౌంట్ అందించడం వల్ల బిజినెస్ పెరుగుతుంది. food, travel వంటి విభాగాల ద్వారా 196 పట్టణాల్లో మా కార్యకలాపాలు పెంచాం. భారత దేశంలోని అన్ని వర్గాల వారు మా mydala చూడాలని, షాపింగ్ చేయాలనేది మా లక్ష్యం. అందుకే లక్ష మంది వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం,

ముందు ముందు కొత్త కొత్త ఆలోచనలతో వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం. కిరాణా షాప్‌లు, సూపర్ మార్కెట్‌లు అన్ని చోట్ల mydala గురించిన ప్రచారం చేస్తున్నాం. త్వరలో నాస్‌డాక్ లోను లిస్టు కావాలని వుంది అంటున్నారు అనిష సింగ్.