మీకున్న అసలు ఫాలోయింగ్ ఏంటో చెప్పేసే క్రౌడ్ ఫైర్

ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో తమను ఫాలో అయ్యే వాళ్ల గురించి, తమ అకౌంట్లను వీడిపోయి(అన్‌ఫాలో) అయ్యే వాళ్ల గురించి తెలుసుకోలేక సతమవుతున్నారు సోషల్ మీడియా అడిక్టెడ్ జనాలు. సామాజిక మాధ్యమాల్లో త‌మ ఉత్పత్తులను ఎలా ప్ర‌చారం చేసుకోవాలో తెలియ‌క కొంద‌రు, తాము సృష్టించిన బ్రాండ్‌ల‌ను ఎలా ప‌రిచయం చేయాలో తెలియ‌క మ‌రికొంద‌రు తిక‌మ‌క‌ప‌డుతుంటారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ మేం పరిష్కారం చూపిస్తామంటూ ఓ సంస్థ ముందుకొచ్చింది. అదే క్రౌడ్‌ ఫైర్. మొన్న‌టివ‌ర‌కు ట్విట్ట‌ర్‌లో యాప్‌గా సుప‌రిచిత‌మైన జ‌స్ట్ అన్‌ఫాలో ఇప్పుడు క్రౌడ్‌ఫైర్‌గా కొత్తగా ముస్తాబై ముందుకొచ్చింది.

మీకున్న అసలు ఫాలోయింగ్ ఏంటో చెప్పేసే క్రౌడ్ ఫైర్

Monday May 04, 2015,

2 min Read

అది 2008వ సంవ్స‌త‌రం. నిశ్చ‌ల్ షెట్టి ఓ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌. ట్విట్ట‌ర్ అప్లికేష‌న్ల‌పై రివ్యూల‌ను రాసేందుకు ఓ బ్లాగ్‌ను ఓపెన్ చేశారు. బ్లాగ్‌ను ర‌న్‌చేస్తూ రివ్యూల కోసం బ‌ర్ప్ వెబ్‌సైట్‌ను చూడ‌టంలో నిశ్చ‌ల్‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. అలాగే ట్విట్ట‌ర్ యూజ‌ర్స్‌ త‌మ ఫాలోయర్ల‌ను మేన‌ేజ్ చేసుకోవ‌డంలో ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తున్నట్టు అతడు గుర్తించాడు. ఈ స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు నిశ్చ‌ల్ శ్రీకారం చుట్టడమే ఇప్పుడు ఓ ఫేమస్ కంపెనీగా గుర్తింపుతెచ్చిపెట్టింది .

నిశ్చల్ శెట్టి, క్రౌడ్ ఫైర్ వ్యవస్థాకుడు

నిశ్చల్ శెట్టి, క్రౌడ్ ఫైర్ వ్యవస్థాకుడు


జ‌స్ట్ అన్‌ఫాలో.. ట్విట్ట‌ర్ వెబ్‌సైట్‌లో ఓ అప్లికేష‌న్‌. త‌మ‌నెవ‌రు అన్ ఫాలో చేస్తున్నారు ? స్పామింగ్ ఎవరు చేస్తున్నారు ? అని ట్విట్ట‌ర్ యూజ‌ర్స్‌కు వివ‌రాలందించే ఓ యాప్. ఆ త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్ గురించి తెలిపేందుకు టేకాఫ్ పేరుతో మ‌రో యాప్‌ను కూడా రూపొందించారు నిశ్చ‌ల్. ఈ రెండు అప్లికేష‌న్లు నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి.

కానీ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లే కాకుండా ఇత‌ర యూజ‌ర్ల‌ను మేనేజ్‌చేసే సామ‌ర్థ్యం ఈ అప్లికేష‌న్ల‌కుంది. అందుకే క్రౌడ్‌ఫైర్ పేరుతో ఓ సోష‌ల్ మీడియా మార్కెటింగ్ ప్రొడెక్ట్‌ను రీ బ్రాండ్ చేశారు. దీంతో జ‌స్ట్ అన్ ఫాలో కాస్తా క్రౌడ్‌ఫైర్‌గా పేరు మార్చుకుంది. 

జ‌స్ట్ అన్ ఫాలో ఓ అపార్ట్‌మెంట్‌లో పురుడుపోసుకుంది. నిశ్చ‌ల్ షెట్టి ఒక్క‌రే కోడింగ్‌తో జ‌స్ట్ అన్ ఫాలోను న‌డిపించేవారు. ఇప్పుడ‌ది అతిపెద్ద సోష‌ల్ మీడియా మార్కెటింగ్ ప్రాడ‌క్ట్‌. ఒక్క‌డితో మొద‌లైన ప‌య‌నం.. క్రౌడ్‌ఫైర్‌గా రూపు మారి 35 మందితో ప‌నిచేస్తుంది. అంద‌రి ల‌క్ష్యం ఒక‌టే. సోష‌ల్ మీడియాను చ‌క్క‌గా ఉప‌యోగించుకుని త‌మ బ్రాండ్‌ను మార్కెట్ చేసుకోవ‌డానికి, సేవ‌లందించ‌డానికి యూజ‌ర్ల‌కు స‌హ‌క‌రించాల‌న్న‌దే వీరి త‌ప‌న‌. జ‌స్ట్ అన్‌ఫాలో, టేకాఫ్‌ల‌కు వెబ్‌, మొబైళ్ల‌లో ఉమ్మ‌డిగా కోటి మంది యూజ‌ర్లున్నారు. ఆండ్రాయిడ్‌, ఐ ఓఎస్‌ల‌లో 50 ల‌క్ష‌ల‌కుపైగా ఈ అప్లికేష‌న్ల‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నారు.

క్రౌడ్ ఫైర్ కొత్త లోగో

క్రౌడ్ ఫైర్ కొత్త లోగో


క్రౌడ్‌ఫైర్‌తో ఉప‌యోగాలు..

  • త‌మ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎవ‌రు అచేత‌నంగా ఉన్నారో, ఎవ‌రు అన్‌ఫాలో అవుతున్నారో ఈ యాప్‌ల ద్వారా ఇట్టే తెలుసుకోవ‌చ్చు.
  • కాపీ ఫాలోవ‌ర్స్ ఫీచ‌ర్ ద్వారా త‌మ‌లాంటి యూజ‌ర్ల‌ను ఈజీగా గుర్తించొచ్చు.
  • అలాగే ఫాలోవ‌ర్లు, అన్ ఫాలోవ‌ర్ల గ‌ణాంకాల‌పై త‌మ అప్‌డేట్లు ఎలా ప‌నిచేస్తున్నాయో కూడా తెలుసుకోవ‌చ్చు.
  • ట్విట్ట‌ర్‌/ఇన‌్‌స్టాగ్రామ్ ఖాతాదారుల మ‌ధ్య సంబంధ‌మేంటో తెలుసుకోవ‌చ్చు.

ఒకే యాప్ ద్వారా యూజ‌ర్లంద‌రికీ సేవ‌లందించాల‌న్న ఉద్దేశంతోనే క్రౌడ్‌ఫైర్‌ను ప్రారంభించామ‌ని నిశ్చ‌ల్ చెప్తున్నారు. " జ‌స్ట్ అన్ ఫాలో యాప్ క్రౌడ్‌ఫైర్‌గా మారింది. టేకాఫ్ యాప్ అలాగే ఉంది. కానీ వెబ్‌లో మాత్రం క్రౌడ్‌ఫైర్‌యాప్‌. కామ్‌లో ఓ భాగంగా ఉంది. ఒకే యాప్ ద్వారా మొబైల్‌లో మా టూల్స్ అన్నీ ప‌నిచేయాల‌న్న‌దే మా ఉద్దేశం. వీటితోపాటు టేకాఫ్‌, ఈగిల్ ఐ వంటి యాప్స్ కూడా ప్ర‌త్యేకంగా ఉంటాయి. క్రౌడ్‌ఫైర్ మాత్రం మేం రూపొందించిన అన్ని టూల్స్ స‌మాహారం"


తన టీంతో నిశ్చల్

తన టీంతో నిశ్చల్


సోష‌ల్ మీడియా యూజ‌ర్లంతా క్రౌడ్‌ఫైర్‌ను త‌మ మార్కెటింగ్ ప్రోడక్ట్‌గా ఉప‌యోగించుకోవాల‌న్న‌ది నిశ్చ‌ల్ ఉద్దేశం. ఇండివిడ్యువ‌ల్ తాను సృష్టించిన బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేసేందుకైనా, స్టార్ట‌ప్ కంపెనీ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను రీచ్ అయ్యేందుకైనా ఈ క్రౌడ్‌ఫైర్ ఓ వార‌ధిగా ఉండాల‌న్న‌ది ఆయ‌న ల‌క్ష్యం. ప్ర‌స్తుతం యూజ‌ర్ల ప‌రంగా బిగ్గెస్ట్ మార్కెటింగ్‌గా ఉన్న క్రౌడ్‌ఫైర్ క‌స్ట‌మ‌ర్ల ప‌రంగా నెంబ‌ర్‌వ‌న్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.

భారీ టార్గెట్‌..

ప్ర‌స్తుతం క్రౌడ్‌ఫైర్‌ను సాధార‌ణ‌ యూజ‌ర్లు ఉచితంగానే ఉప‌యోగించుకుంటున్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్‌లో పేయింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌నుకుంటున్న‌ది. ఐతే ప్ర‌స్తుతం క్రౌడ్‌ఫైర్‌కు 15వేల మంది పేయింగ్ క‌స్ట‌మ‌ర్లున్నారు. ఈ సంఖ్య‌ను ల‌క్ష‌కు పెంచుకోవాల‌ని సంస్థ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. సోష‌ల్ మీడియాలో అన్ని మార్కెటింగ్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే అప్లికేష‌న్‌గా క్రౌడ్‌ఫైర్‌ను మార్చాల‌న్న‌దే నిశ్చ‌ల్ టార్గెట్‌. అదెంతో దూరంలో లేద‌ని సంస్థ‌ ప‌నిత‌నాన్ని అంచ‌నా వేస్తున్న నెటిజ‌న్లు చెప్తున్నారు.