ఈ టెలీ రిక్షాలో ప్రయాణం సేఫ్

మెట్రో నగరాల్లో ప్రయాణానికి అనేక సౌకర్యాలుంటాయి. కానీ చిన్న పట్టణాల్లో మాత్రం ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలు, బస్సులపై ఆధారపడాల్సిందే.! అయితే వాటికోసం నిరీక్షించకతప్పదు. ఇలాంటివాటికి చెక్ చెప్పేందుకు ప్రయత్నించారు కరణ్‌వీర్ సింగ్.. అతని ఆలోచనల నుంచి పుట్టుకొచ్చాయి టెలీ రిక్షాలు.!

ఈ టెలీ రిక్షాలో ప్రయాణం సేఫ్

Wednesday May 06, 2015,

3 min Read

కాల్ ట్యాక్సీలు గురించి మాట్లాడుకుంటే అవి కేవలం గ్రేడ్ 1 నగరాలకే పరిమితం. గ్రేడ్ 2, గ్రేడ్ 3 నగరాల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రమే. బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో నివసించే ప్రజలకు ఓలా, ఉబర్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. చిన్న నగరాల్లో ఇలాంటి ప్రయాణ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఎవరూ సాహసించరు. ఇలాంటి పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు పంజాబ్ రాష్ట్రానికి చెందిన లూథియానా కుర్రోడు నడుం బిగించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో కాల్ ట్యాక్సీకి ప్రత్యామ్నాయంగా టెలీ రిక్షా ప్రారంభించేందుకు ముందడుగు వేశారు. తన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొన్నారు.

టెలీ రిక్షాలో భాగమైన ఒక డ్రైవర్

టెలీ రిక్షాలో భాగమైన ఒక డ్రైవర్


కరణ్ వీర్ సింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు ఇండోర్ వచ్చారు. ఇండోర్‌లో ఆటో డ్రైవర్ల గుత్తాధిపత్యం, క్యాబ్ సర్వీసుల ఆలస్యం, ప్రజా రవాణాలో భద్రత అంశాలు కరణ్ దృష్టిని ఆకర్షించాయి. ‘‘ ఒక్క కాల్ చేస్తే క్యాబ్ సర్వీసులు ఇంటి ముందుకే చేరుతాయి... అలా ఆటో రిక్షా ఎందుకు కాకూడదు...? ఇండియాలో ఆటో వ్యవస్థ అసంఘటితంగా ఉంది. అలాంటి ఆటో వ్యవస్థను సంఘటితం చేసి సరైన మార్గంలో పెట్టాలని కరణ్ సంకల్పించారు. ఆ కల నెరవేర్చుకునేందుకే తన చదువు సైతం పక్కన పెట్టారు. ఈ ప్రపంచంలో ఏదైనా తన కల నెరవేరిన తర్వాతే అనుకున్నారు. అలా కరణ్ వీర్ సింగ్ ప్రయాణం మొదలైంది.’’

టెలీరిక్షాతో అనుసంధానమైన ఆటోలు

టెలీరిక్షాతో అనుసంధానమైన ఆటోలు


‘‘50 తో మొదలైన టెలీ రిక్షాలు ఇప్పుడు 5వేలకు చేరుకున్నాయి. త్వరలో భోపాల్, ఉజ్జయినిలోనూ టెలీ రిక్షాలు ప్రారంభం కానున్నాయి.’’


టెలీ రిక్షా బుక్ చేసుకోవాలంటే... కస్టమర్లు వెబ్‌సైట్లోకి లాగిన్ అవ్వాలి లేదంటే ఆటోపై కన్పించే 9098098098 ( టెలీ రిక్షా సర్వీసు ప్రస్తుతం ఇండోర్ లో మాత్రమే అందుబాటులో ఉంది ) నంబర్ కు కాల్ చేస్తే చాలు. జర్నీ టైం, పికప్, డ్రాపింగ్ ప్లేస్ చెబితే డ్రైవర్ నోట్ చేసుకుంటాడు. ప్రయాణానికి ఎంత ఛార్జి చెల్లించాలో డ్రైవర్ చెప్తాడు. దానికి కస్టమర్ అంగీకరిస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. జర్నీ పూర్తయిన తర్వాత డ్రైవర్‌కు డబ్బులు చెల్లిస్తే రిసీప్ట్ ఇస్తాడు.


సవాళ్లెన్నో...!

600 మంది ఆటో డ్రైవర్లలో కేవలం 100 మంది మాత్రమే కరణ్ ఆలోచనతో ఏకీభవించారు. వందమంది డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. కానీ మా దగ్గర తగినన్ని నిధులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. ఇది ఆదిలోనే హంసపాదులా మారింది. అది నా జీవితంలో అతి ఘోరమైన రోజు. అయితే ఇది కరణ్ లక్ష్యానికి అడ్డుగా నిలవలేకపోయింది. చివరకు కొంత మంది డ్రైవర్లు కరణ్‌ను నమ్మి ముందుకొచ్చారు. ఎట్టకేలకు 50 మంది కరణ్‌తో కలిసి పని చేసేందుకు అంగీకరించారు. ఆ 50 మంది డ్రైవర్లతో టెలీ రిక్షా సర్వీసు ప్రారంభమైంది. ఒక్కసారి టెలీ రిక్షా సర్వీసు ప్రారంభం కాగానే లక్షల నిధులు వచ్చి పడ్డాయి.


మొదట్లో టెలీ రిక్షా గురించి ఎవ్వరికీ తెలియదు. ఆటో డ్రైవర్లను ఒప్పించడం చాలా కష్టమైంది. మేం వారి మంచి కోసమే ఈ పని చేస్తున్నామని వారికి తెలిసేలా చెప్పాలి. టెలీ రిక్షా గురించి వివరించగానే డ్రైవర్ల నుంచి వచ్చిన మొదటి ప్రశ్న... దీంతో మీకేంటి లాభం..? దీనికోసం మేమేం చేయాలి..? వాళ్లలో ఇలా ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. కాని ఒక్కసారి టెలీ రిక్షా ప్రారంభమవ్వగానే.... వాళ్లు మా పనితనం చూడగానే అవన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు మేమంతా ఒక పెద్ద కుటుంబం.


టెలీ రిక్షాలకు ఫిక్సిడ్ ఛార్జీలు నిర్ణయించడం చాలా కష్టం. ప్రభుత్వం చాలా తక్కువ ఛార్జీలు నిర్ణయించింది. ఆటో డ్రైవర్లు మాత్రం ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటారు. డ్రైవర్లు, గవర్నమెంట్‌తో ఎన్నో సమావేశాలు జరిపిన తర్వాత ఆటో ఛార్జీలు క్రమబద్దీకరించాం. దూరాన్ని బట్టి ప్రయాణానికి ఒక నిర్ణీత ఛార్జీని నిర్ణయించాం. ఆటో ఛార్జీల విషయానికొస్తే బేరాసారాల పద్దతిలో మార్పు తేవడం చాలా కష్టం. మేం సాధ్యమైనంత వరకు న్యాయమైన ఛార్జీలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాం. అయినా వాళ్లు మాత్రం మీటర్ లేదంటూ బేరాలాడేవారు. రానురాను ఈ బేరాసారాల విషయంలో మార్పు కనిపించింది.

కరణ్  వీర్ సింగ్ – టెలీరిక్షా వ్యవస్థాపకులు

కరణ్ వీర్ సింగ్ – టెలీరిక్షా వ్యవస్థాపకులు


చిన్న నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఎంటరవ్వకముందే కరణ్ టెలీ రిక్షాలు ప్రారంభమయ్యాయి. ఈ రంగంలో విజయాలు అందుకోవడం అంత సులభం కాదు. ఆటో యూనియన్లను ఒప్పించి మాతో నడిపించడం కఠినతరం.

టెలీ రిక్షాలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతీ టెలిరిక్షాలో జీపీఎస్ ప్యానిక్ బటన్ ఉంటుంది. దీనిపై ట్రైనింగ్ క్లాసులు పెట్టి డ్రైవర్లను ఎడ్యుకేట్ చేస్తారు. డ్రైవర్లు రోజుకు 500 మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేరవేస్తుంటారు.


టెలీరిక్షా కంపెనీకి రెవెన్యూ.. కమీషన్లు, ప్రీ పెయిడ్ బూత్ రూపంలో వస్తుంది. టెలీ రిక్షా అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్‌ను కూడా ఉపయోగించుకున్నారు. నైట్ క్లబ్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా టెలీ రిక్షాతో ఆఫీషియల్ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ టెలీరిక్షా రెవెన్యూ పెరిగేందుకు దోహదపడుతున్నాయి.


‘‘ వచ్చే ఐదేళ్లలో మరిన్ని నగరాల్లో టెలీ రిక్షాలను ప్రారంభిస్తాం. ఇందోర్ లో ప్రయాణికులకు ఎలాంటి రవాణా ప్రత్యమ్నాయం కల్పించామో మిగతా నగరాల్లోనూ అలాంటి ప్రత్యమ్నాయమే కల్పిస్తాం. అంతేకాదు మారుతున్న నగరాలకు అనుగుణంగా సర్వీసులు పునరుద్దరిస్తాం ’’. ఇవీ కరణ్ ఫ్యూచర్ ప్లాన్స్.


పెద్ద పెద్ద ఆవిష్కరణలు, ఆలోచనలతో ఉండే మనం.. రియల్ ఇండియాను ప్రతిబింబించే టెలీ రిక్షా లాంటి చిన్న సర్వీసులు గురించి మర్చిపోతుంటాం. ఇలాంటి వాటిలో భాగ్యస్వాములం అయినందుకు మేం ఎంతో ఆనందంగా ఉన్నాం..