సీనియర్ల స్టార్టప్స్ ... జూనియర్లకు పాఠాలు

సీనియర్ల స్టార్టప్స్ ... జూనియర్లకు పాఠాలు

Monday March 07, 2016,

6 min Read

               

ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఢక్కామొక్కీలు తిన్నవారు కొంత కాలం తర్వాత యువతరానికి మార్గదర్శకులుగా మారడానికి ఇష్టపడతారు. వారి సలహాదారులు గానో ఫండింగ్ చేయడానికో పరిమితమవుతారు. కానీ టెక్నాలజీ రంగంలో మాత్రం పరిస్థితి అలా ఉండదు. పరుగు ప్రారంభించిన సక్సెస్ చూసిన వారు... మళ్లీ ఆ కిక్ పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మళ్లీ ఒకటి నుంచి ప్రారంభించాలా... అనే ఆలోచనే చాలా మందికి రాదు. ఎందుకంటే ఆ రన్ లో అంత ఫన్ అంతకు మించి సక్సెస్ కిక్ ఉంటుంది మరి. స్టార్టప్ ..స్టార్టప్ అంటూ పరుగులు తీస్తున్న నేటి తరంలో చోటు కోసం సీనియర్లు కూడా పోటీ పడుతున్నారు. అందుకు వయసు, అనుభవాన్ని ప్లస్ పాయింట్లుగా మార్చుకుంటున్నారు. సహజంగా అనుభవం, వయసు పెరిగేకొద్దీ.. తాము మొదట్లో ఏమి నేర్చుకున్నామో.. అలా చేయడానికే ఇష్టపడతారు కొందరు. అందుకే కొత్తగా ఏమీ చేయలేక వెనుకబడిపోతారు. కానీ రవి గురురాజ్, బాల పార్థసారధి మాత్రం కొత్త విద్యార్థుల్లా స్టార్టప్ పోటీకి సిద్ధమయ్యారు.

రవి గురురాజ్, బాల పార్థసారధి ఎవరు..?

వీరిద్దరూ ఎవరంటే... ఇప్పటికే సక్సెస్ ఫుల్ జర్నీ చేసిన వ్యాపారవేత్తలు. భారీ విజయాలు సాధించిన పలు సంస్థలకు ఫండింగ్ చేసిన సంస్థల్లో వాటాదారులు. రవి గురురాజ్ నాస్కామ్ ప్రొడక్ట్ కౌన్సిల్ కు ఛైర్మన్. బాలపార్థసారధి ప్రైమ్ వెంచర్ గా మారిన ఎంజెల్ ప్రైమ్ సంస్థకు మేనేజింగ్ పార్ట్ నర్. వీరిద్దరూ చెరో రంగంలో స్టార్టప్ ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అవి చివరి దశకు వచ్చాయి.

లేటు వయసులో స్టార్టప్ ఆలోచన ఎలా...?

సాధారణంగా స్టార్టప్ అంటే అప్పుడే చదవు పూర్తి చేసో.. లేదా చేయకుండానో కొత్త ఆలోచనతో నవయువకుడు ప్రారంభించే సంస్థ అనే అభిప్రాయం ఉంది. కానీ ఒకటి నుంచి వంద వరకు అన్నీ పూర్తి చేసేసిన రవి గురురాజ్, బాల పార్థసారధి ఇప్పుడు కొత్తగా స్టార్టప్ ప్రారంభించాలని ఎందుకనుకున్నారు..? వారిని ప్రేరేపించిన అంశాలేమిటి..? ఇటీవల బెంగళూరులో ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులంతా కల్సి "స్టార్టప్ మాస్టర్ క్లాస్" పేరుతో ప్యానెల్ డిస్కషన్ ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన రవి గురురాజ్, బాల పార్థసారధి కొత్త స్టార్టప్ పై ఔత్సాహికుల సందేహాలన్నింటినీ తీర్చారు.

image


మళ్లీ "బ్యాక్ టు బేసిక్స్" కు రావడానికి కారణం ఏమిటి..?

సిట్రెక్స్ సహా ఇతర సంస్థల్లో పనిచేస్తున్న రవి గురురాజ్ తనకు తాను ఆంట్రపెన్యూర్ గా భావించుకునేవారు. ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత అంట్రపెన్యూర్ గా మారి ఆరు టెక్నాలజీ కంపెనీలను స్థాపించారు. అందులో రెండు కంపెనీలు నాస్ డాక్ లో లిస్టయి భారీ విజయాల్ని నమోదు చేసుకున్నాయి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్ గానూ... హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఇండియన్ అల్యూమినీ ఎంజెల్స్ కు కో ఛైర్మన్ గానూ వ్యవహరించారు. ఇండియన్ ఈ కామర్స్ కు సేవలు అందిస్తున్న లాజిస్టిక్స్ లో లూప్ హోల్ ను గమనించిన రవి గురురాజ్... అక్కడే పెద్ద మార్కెట్ ఉందని అంచనా వేశాడు. ఆ రంగాన్ని అధ్యయనం చేసి కిక్ పాడ్ అనే స్టార్టప్ కు శ్రీకారం చుట్టాడు. కిక్ పాడ్ ద్వారా ఈ-కామర్స్ ప్యాకేజీల పికప్, డెలివరీ మరింత ఈజీ చేయాలనే పట్టుదలతో రవి గురురాజ్ కిక్ పాడ్ స్టార్టప్ పై పనిచేస్తున్నారు.

బాల పార్థసారధి మాత్రం తన కొత్త స్టార్టప్ పై ఎక్కువ విశేషాలు బయటపెట్టేందుకు ఇష్టపడలేదు. ఫిన్ టెక్ రంగంలో కన్జూమర్ ఫేసింగ్ మొబైల్ స్టార్టప్ అనే హింట్ మాత్రం ఇచ్చారు. సుదీర్ఘ కాలం స్టడీ చేసిన తర్వాత ఈ రంగంలో చాలా మార్కెట్ ఉందని బాలపార్థసారధి గుర్తించారు. ఇంతకు ముందు మూడు స్టార్టప్ కు కో ఫౌండర్ గా వ్యవహరించారు. అయితే ఈ మూడు విఫలమయ్యాయి.

నిర్ణయాలు తీసుకోవడం ఎలా..?

వ్యాపారం విషయంలో నిర్ణయాలు తీసుకునేవిషయంలో రవి గురురాజ్ రెండే రెండు పాయంట్లను గుర్తు పెట్టుకుంటారు. సింపుల్ అండ్ కంఫర్టబుల్. నిన్ను అసౌకర్యానికి గురి చేసే ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దంటారు రవి. దీనికో చిన్న ఉదాహరణ కూడా చెప్పారు... స్టార్టప్ కి ఉద్యోగుల ఎంపిక చాలా ముఖ్యం. ఎవరో ఒకరు అని అందుబాటులో ఉన్నవారిని ఎంపిక చేసుకోకూడదు. స్టార్టప్ తొలి ఉద్యోగుల ఎంపిక విషయంలో రాజీ పడకూడదు. ఎంపిక చేసుకున్న తర్వాత వారికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.

స్టార్టప్ తొలి ఉద్యోగులు తీసుకునే నిర్ణయాలు కూడా మొదటివే. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాంగ్ పీపుల్ ని ఎంపిక చేసుకోకూడదు..

మంచి టీంని సిద్ధం చేస్తే లాంగ్ రన్ కు ఎక్కువ అవకాశం ఉంటుందని రవి అనుభవం. స్టార్టప్ కోసం ఫండ్ రైజింగ్ ఎక్సర్ సైజెస్ లో ఈ టీం ప్రతిభనే ఎంజెల్, వెంచర్ క్యాపిటర్ సంస్థలు అంచనా వేస్తాయి. ఉద్యోగుల ఎంపిక విషయంలో "నా కన్నా సమర్ధుడు" సూత్రాన్ని రవి గురురాజ్ పాటిస్తాడు. అయితే ఒక చిన్న ఇంటర్వ్యూలో దీన్ని అంచనా వేయడం కష్టమని తెలుసు. అందుకే పని తీరు తెలిసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నానన్నారు.

అంట్రపెన్యూర్ కి ఎన్నో కొత్త కొత్త ఐడియాలు కళ్ల ముందు కదలాడుతూంటాయి. అయితే వాటిలో ప్రాధాన్యతగలదాన్ని గుర్తించడమే నిర్ణయమంటారు బాల పార్థసారధి. ఉద్యోగుల ఎంపికకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. తన కొత్త స్టార్టప్ కోసం ఇప్పుడు 70శాతం సమయాన్ని ఉద్యోగులఎంపిక కోసమే కేటాయిస్తున్నాని చెప్పారు.

స్టార్టప్ ఐడియాను వ్యాలిడేట్ చేయడం ఎలా..?

స్టార్టప్ ఐడియాను ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో మొదటి అడుగులోనే ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. స్టార్టప్ ఐడియాను వేగంగా ఆలోచనలో పెట్టాలి. దాని మీద వీలయినంత సమయం వెచ్చించాలి. సమర్థమైన జట్టుని ఎంపిక చేసుకోవాలని రవి గురురాజ్ సలహా ఇస్తున్నారు. దాని తర్వాత అందరూ ఆచరణపై దృష్టిసారించాలి. మీరు చేస్తున్న పనిపై మీకు స్పష్టత ఉండాలి. మీరు తర్వాత కొన్నేళ్ల పాటు దాని మీదే పనిచేయబోతున్నారనే అంశాన్ని గుర్తుంచుకోవాలి...

స్టార్టప్ నమూనాను సిద్ధం చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. వారి అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా మార్చుకోవాలి. నేను నా స్టార్టప్ ఆలోచనను చాలా మంది ముందు ఉంచి అభిప్రాయాలు తెలుసుకున్నాను. నేను చేయాల్సిన చాలా మార్పులను గమనించానని రవి చెప్పారు. ఒకసారి తీసుకున్న నిర్ణయాలను మళ్లీ సమీక్షించుకునే అవసరం రాకూడదు. విజయవంతమైన కొంత మంది స్టార్టప్ ఫౌండర్స్ కూడా తమ నిర్ణయాలను సమీక్షించుకుని మళ్లీ కొత్తగా చేయాలని ప్రయత్నిస్తూంటారు. అయితే తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉంటాయి. అన్నీ కరెక్ట్ అవుతాయని గ్యారెంటీ లేదు.

ప్రొటోటైప్ స్టేజ్ లోనే అమ్మకం ఎలా..?

స్టార్టప్ ప్రోటోటైప్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు ఉత్పత్తుల్ని అమ్మడం క్లిష్టమైన వ్యవహారమే. అయితే స్టార్టప్ కి తన ప్రణాళికపై స్పష్టమైన అవగాహన ...దానికి వాల్యూ యాడ్ చేస్తే సాధ్యమేనంటారు రవి గురురాజ్. తన స్టార్టప్ "కిక్ పాడ్" కు నిధులు సేరించేందుకు పెట్టుబడిదారులను, భాగస్వాములను ఎలా ఒప్పించింది కూడా రవి గురురాజ్ వివరించారు. ఈ కామర్స్ డెలివరీని సాధారణంగా ప్రజలు సాయంత్రం సమయాల్లోనే కోరుకుంటారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల డెలవరీ తర్వాతి రోజుకు ఆలస్యమవుతుంది. ఇలాంటి వారికి లాకర్ సర్వీస్ ద్వారా సమయానికి డెలివరీ అందించడమే కిక్ పాడ్ లక్ష్యం. పని ప్రారంభించే ముందు కొంత మంది కస్టమర్లతో ముఖాముఖి మాట్లాడాను.

image


ఫర్ ఫెక్ట్ టైమింగ్

కొద్ది త్వరగా ప్రారంభించడమో... లేదా లేటుగా ప్రారంభించడం వల్లో స్టార్టప్ లు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నాయని రవి గురురాజ్, బాల పార్థసారధి ఇద్దరూ అభిప్రాయపడ్డారు. తన స్నాప్ ఫిష్ స్టార్టప్ సమయంలో అలాంటివే మరో 127 వచ్చినా సక్సెస్ కాలేదని బాల పార్థసారధి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సరైన టైమింగ్ లో వచ్చిన ఫోటో షేరింగ్ స్టార్టప్ స్నాప్ షిప్ ను హెచ్ పీ ఎక్వైర్ చేసింది. రవి గురురాజ్ కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలోచనలను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఫలితాలు సానుకూలంగా ఉంటాయంటారు.

ఐడియాలను కాపాడుకోవడం ఎలా..?

స్టార్టప్ ఐడియాను పొటెన్షియన్ పీపుల్ ముందు పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలనుకోవడం సహజం. కానీ చాలా మంది ఐడియాను కొట్టేస్తారేమో అని భయపడతారు. ఇది నిజం కూడా. అందుకే నమ్మకమైన వ్యక్తుల ముందు అదీ కూడా స్టార్టప్ రోడ్ మ్యాప్ ను వివరించే సలహాలు తీసుకోవడం మంచిదంటారు బాల పార్థసారధి. తన తాజా స్టార్టప్ కోసం 700 మంది అభిప్రాయాలు తీసుకున్నానన్నారు బాల.

నీ ఐడియా గురించి నీవు ఆలోచించినంతగా ఇతరులు ఆలోచించలేరు. వారు దీన్ని ఆచరించడానికి సరిపడా సమాచారం, సమయం వారికి ఉండదు. ఐడియా చోరీ అనేది సామాన్యంగా జరగదు. దీని గురించి అతిగా ఆలోచించడం వృధా

ఒక్కడినేనా... కో ఫౌండర్స్ కావాలా..?

స్టార్టప్స్ విషయంలో చాలా మందికి సందేహాలుంటాయి. ఒక్కడినే ప్రారంభించాలా.. లేక కో ఫౌండర్స్ ను కలుపుకోవాలా అనేది వారి డైలమా. బాల పార్థసారధి తన స్టార్టప్స్ విషయంలో కో ఫౌండర్స్ ను ఎంపిక చేసుకున్నారు. రవి గురురాజ్ మాత్రం సింగల్ గానే ముందుకెళ్లారు.

మంచి సహ వ్యవస్థాపకులు భారాన్ని పంచుకుంటారు. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ విజయం రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో వచ్చే సమస్యలను ఒక్కడివే పరిష్కరించలేవు. వీటిని సహభాగస్వాములు సమన్వయం చేయగలరు అంటారు రవి పార్థసారధి. అయితే సింగిల్ మెన్ ఫౌండర్ స్టార్టప్ వ్యవహారాల్లో ఆరితేరిన రవి గురురాజ్ మాత్రం ఒక్క ఫౌండర్ ఉన్న స్టార్టప్ లో వృద్ధిలో వేగంగా దూసుకెళ్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే రవి గురురాజ్ తనకు ఇతర వెంచర్స్ లో కో ప్రమోటర్స్, వ్యూహాత్మక భాగస్వాములు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. స్టార్టప్ కు కాంప్లిమెంటరీ స్కిల్స్ యాడ్ చేసే కో ఫౌండర్ దొరికితే మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదంటారు. కో ఫౌండర్స్ మధ్య భార్యభర్తల మధ్య ఉన్నంత అవగాహన ఉంటే సక్సెస్ పై అనుమానమే రాదంటారాయన.

ఉత్పత్తుల్లో వైవిధ్యం

సాధారణంగా స్టార్టప్స్ ప్రారంభంలో మార్కెట్ లో గట్టిపోటీని ఎదుర్కొంటూ ఉంటాయి. ఉత్పత్తుల్లో వైవిధ్యమే దీనికి పరిష్కారం అంటారు రవి గురురాజ్, బాల పార్థసారధి.

 అంతేగా.. మార్కెట్ లో పోటీపై అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వినియోగదారుల అవసరాలను గుర్తించి ఉత్పత్తుల్ని రెడీ చేస్తే సాధారణంగా మార్కెట్ లో అందరికీ చోటు ఉంటుంది.