పందుల పెంపకంలో ఊహించనంత లాభం

ఓ కేరళ రైతు ప్రయోగంపందులు, కలివి కోళ్లతో వ్యాపారంపంట మధ్య అంతర్ పంటలుఏడాదికి మూడున్నర లక్షల లాభం

0
image credit - shutterstock
image credit - shutterstock

కేరళలో ఒక సాదాసీదా రైతు సును మాథ్యూ. ఈ రోజున సాలుకు రూ. 3,54,000/-ల నికర ఆదాయాన్ని కళ్ల జూస్తున్నారు. పందులు, కలివి కోళ్ల పెంపకంతో వచ్చిన అనుభవం, లాభం ఆయనను ఊరికే ఉండనివ్వలేదు. టెలిచేరి బ్రీడ్‌ మేకలు, చించిల్లా బ్రీడ్‌ కుందేళ్లు పెంచసాగారు. ఇంటి నిమిత్తం 15 కోళ్లు, పశుగ్రాసం కూడా పెంచుతున్నారు.

మాథ్యూ తన ఆరెకరాల పొలంలో సుమారు 220 కొబ్బరి చెట్లు పెంచుతున్నారు. అంతరపంటలుగా అరటి, అల్లం, జాజికాయ, కోకో, నల్ల మిరియాలు, గెనుసుగడ్డ, కర్రపెండలం, పోకలు పండిస్తున్నారు. వీటిద్వారా సాలుకు రూ.1,27,000 స్థూలాదాయం వస్తోంది.

వీటితోపాటు 30 పందులు, 250 పంది పిల్లలకు సరిపడేలా పొలంలో పక్కా షెడ్‌ నిర్మించారు. కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌తో వేర్వేరు భాగాలు ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. కేరళ ప్రభుత్వపు పందుల పెంపక కేంద్రాల నుంచి తెచ్చిన 30 పంది పిల్లలతో 2004 సెప్టెంబర్‌లో యూనిట్‌ ఆరంభమైంది. ఇవి డ్యురాక్‌, వైట్‌ యార్క్‌షైర్‌ రకానికి చెందిన 75 రోజుల వయసున్న పిల్లలు (వీటిలో 4 మగవి). 16 నెలలు తిరిగేసరికి ఒక్కొక్క పంది 8 నుంచి 12 వరకు పిల్లలను కన్నాయి.

వీటిని 60-75 రోజుల వరకూ సాకి, ఒక్కొక్క పిల్లను 1,500 రూ.ల చొప్పున అమ్మేశారు. మగ పందులను, వయసు మీరిన పందులను మాంసంకోసం అమ్మేశారు. 2006లో 25 పెద్ద పందులను (సుమారు 2,500 కిలోల మాంసం) అమ్మారు. 2006లోనే 200 పంది పిల్లలనుకూడా అమ్మారు. మిగతావాటిని సంతానోత్పత్తికోసం కేటాయించారు.


పందులతో సును మాధ్యూ
పందులతో సును మాధ్యూ

జంతువుల సంరక్షణార్థం నెల వెయ్యి రూ.లు మందులకు ఖర్చు చేస్తున్నారు. అలాగే నెలకు 6,000 రూ.ల జీతానికి ఒక పనివాడినికూడా కుదుర్చుకున్నారు.

2006లో కేవలం 200 పక్షులు (45 రోజుల కూనలు)తో తన కలివికోడి పెంపక కేంద్రాన్ని ఆరంభించారు మాథ్యూ. శాస్త్రీయపద్ధతిలో పంజరాల్లోనే వాటిని పెంచసాగారు. 60 రోజుల వయసు వచ్చేసరికి అవి గుడ్లు పెట్టసాగాయి. ప్రస్తుతం రోజుకు 180 గుడ్లవరకు మాథ్యూ సేకరిస్తున్నారు.

వీటిని గుడ్డు ఒక్కంటికి 1 రూ. చొప్పున అమ్ముతూ, రోజుకు 180 రూ.లు పొందుతున్నారు. ఆరు మాసాల్లోనే 32,400 రూ.లు సంపాదించారు.

పందుల పెంపకంలో ఒక ఆదర్శ రైతుగా నిలిచారు మాథ్యూ. అతను పెంచే పంది పిల్లల కోసం కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి రైతులు వస్తున్నారు. అతని ఇతర యూనిట్లను చూసి ఆశ్చర్యపడుతున్నారు.