అమ్మ వంటింటి గుమగుమలు రుచిచూపిస్తామంటున్న మసాలా బాక్స్

ఇంటి నుంచే... రుచికరమైన వంటలుఅమ్మమ్మలను గుర్తు చేస్తున్న మసాలా బాక్స్ఐదేళ్లలో తొమ్మిది నగరాలపై దృష్టి పెట్టిన లియా, హర్షభోజన ప్రియులకు మసాలాబాక్సే సొల్యూషన్

అమ్మ వంటింటి గుమగుమలు రుచిచూపిస్తామంటున్న మసాలా బాక్స్

Friday May 01, 2015,

4 min Read

అరిసెలు,పూతరేకులు, జంతికలు, కారంపూస,బొబ్బట్లు,గారెలు, బూర్లు,మైసూరుపాకం ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చేత్తాడంత అవుతుంది. వినేవారి నోరూరుతుంది. సాంప్రదాయ పిండివంటలకున్న ప్రాధాన్యం అలాంటిది. తెలుగు లోగిళ్లలోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ఇలా ప్రతి ప్రాంతంలో వారి వారి ప్రత్యేక వంటకాలున్నాయి. వీటిని ఇంటిలో తయారు చేయడానికి ఎంతో ప్రయాస పడాలి. అలాంటి ఆయాసం లేకుండా చేయడానికే ఇప్పుడు ఎన్నో ఫుడ్ స్టార్టప్‌లు రెడీ అవుతున్నాయి. మసాలా బాక్స్ కూడా ఆ కోవకు చెందిందే.రోజూ ఒకే భోజనం చేసి బోర్ కొట్టిందా...టేస్టీ, టేస్టీగా మీకు ఆహారం అందించేందుకు వచ్చిందే మసాలా బాక్స్. మీరు ఎక్కడున్నా సరే... మీ సిటీలో ఉన్న బెస్ట్ చెఫ్ తయారు చేసిన ఆహారం మీ ఇంటి ముందుకు తీసుకు వస్తుంది. ప్రతిభావంతులైన చెఫ్‌లతో ప్రతీ రోజు, మీరు కోరుకున్న డిష్‌ను ఇంటికి,ఆఫీసుకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాల్డ్ క్లాస్ ఫుడ్‌ను అందించాలనే లక్ష్యంతో... హర్ష ధాచరే, మెదడు నుంచి పుట్టిందే మసాలా బాక్స్ డాట్ కమ్.

లియా సుసన్, హర్ష థాచెరీ - మసాలా బాక్స్ వ్యవస్థాపకులు (కింది వరుసలో.. నల్లరంగు దుస్తల్లో)

లియా సుసన్, హర్ష థాచెరీ - మసాలా బాక్స్ వ్యవస్థాపకులు (కింది వరుసలో.. నల్లరంగు దుస్తల్లో)


లియా, హర్షలు ఇద్దరూ... ఇంట్లో తయారు చేసిన మేజిక్‌ను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించారు. 

ఎక్కడ ఉన్నా అమ్మ చేతి కమ్మదనం

ఇంటి నుండి దూరంగా ఉండే విద్యార్ధుల కైతే... మసాలా బాక్స్ వంటకాలు చాలా ఉత్తేజాన్నిస్తాయి. ఇంటి పై బెంగ ఉండే వారికి అమ్మ వండే వంటలోని కమ్మదనం రుచిచూపిస్తున్నారు. సాధారణంగా హాస్టల్ ఫుడ్ పై ఆసక్తి లేని వారు మంచి ఆహారం కోసం మసాలా బాక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూమ్స్‌లో ఉండే వాళ్లు..మంత్లీ ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నారు. కొచ్చిలోని పలు ఇళ్లకు ఇంటిలో తయారుచేయబడిన ఆహార పదార్ధాలను Masalabox అందించే పని చేస్తోంది. సంస్థ అందిస్తున్న సేవలతో ఎన్నారైలు చాలా మంది డెయిలీ కస్టమర్లుగా మారిపోయారు. దాదాపుగా అన్ని ఇంట్లోనే శుభ్రంగా తయారు చేయడంతో...మంచి ఆరోగ్యమని చెబుతుంటారు కో ఫౌండర్, సీఇవో హర్ష ధాచరే. కొచ్చిలో వరుసగా వస్తున్న ఆఫర్లతో హర్ష ఇంటి వద్ద నుంచే సంస్థను ప్రారంభించారు. ఆమె భర్త గేమింగ్ కంపెనీలో బిజీ బిజీగా ఉండేవారు. మరో వైపు Masalabox సహ వ్యవస్థాపకురాలు , హర్ష మరియు లియా వర్ఘీస్‌తో కలిసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. "హర్షతో నాకు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మా ఇద్దరి భర్తలు స్నేహితులు కావడంతో మా దోస్తీ కుదరింది. మరో వైపు మా పిల్లలకు సేమ్ ఏజ్ గ్రూప్ కావడంతో దోస్తీ ఈజీ అయిపోయింది. దీంతో రెండు కుటుంబాలు అనేక విషయాల్లో కలిసి, చర్చించుకోవడం...చాలా సమయం సరదాగా గడుపుకొనే వాళ్లం.

మసాలా బాక్స్ రూపొందించిన కలర్‌ఫుల్ డిష్

మసాలా బాక్స్ రూపొందించిన కలర్‌ఫుల్ డిష్


"లియా బెంగుళూర్ జ్యోతి నివాస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్... Masalabox ప్రారంభించటానికి ముందు ఎర్నెస్ట్ & యంగ్ సంస్థలో పని చేసేవారు. అంతకు ముందు లియా, హర్షలు గర్భవతిగా ఉన్నప్పుడు, రుచికరమైన భోజనం కోసం ప్రయత్నించడం... మంచి టేస్టీ ఫుడ్ లేకపోవడం కొరతగా అనిపించింది. "కేవలం రెస్టారెంట్లు మాత్రమే హోమ్ డెలివరీ ఇచ్చేవి. అయితే ఆ భోజనం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని ఆలోచన వచ్చింది.

కేరళ నుంచి కర్ణాటక దాకా

ఇలా మొదలైన మా అన్వేషణ... మనమే సొంతంగా స్వచ్ఛమైన ఇంటి ఆహారం అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా గృహ ఆహార పంపిణీ ఆలోచనపై చర్చించామంటారు మసాలా బాక్స్ అధినేత హర్ష. ఆరు నెలల్లోనే కొచ్చిలో ఆహార పంపిణీ ప్రారంభించాము. అనతి కాలంలోనే దాదాపుగా 3500 మందికి భోజనం అందించే విధంగా అభివృద్ధి చేశాము. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న లియా, హర్షలు 15 మంది హోమ్ చెఫ్‌ల తో ఈ ఏడాది ఏప్రిల్ ఆరున బెంగుళూర్ లో కార్యకలాపాలను ప్రారంభించారు. రెండు వారాల పైలెట్ రన్‌తో ." కొచీ లో ఉన్న Masalabox లో 45 మంది చెఫ్‌లు సేవలు అందిస్తున్నారు. మరో వైపు బెంగుళూర్ 200 మంది టాప్ చెఫ్‌లు నిరంతరం సేవలు అందిస్తున్నారని " హర్ష చెప్పారు.

మసాలా బాక్స్ నుంచి నోరూరించే కేరళా డిష్

మసాలా బాక్స్ నుంచి నోరూరించే కేరళా డిష్


ఇంటి నుంచే ఆర్డర్లు

హోమ్ ఫుడ్ కావాల్సిన వినియోగదారుడు వెబ్ సైట్ నుంచి కానీ మొబైల్ అప్లికేషన్ ద్వారా, ముందుగానే ఆర్డరు బుక్ చేసుకొనే అవకాశం ఉంది. స్టాక్‌ను బట్టి ఆన్‌లైన్‌లోనే ఆర్డరు చేసుకోవచ్చు. వారి ఆర్డర్లకు తగ్గట్టుగానే ఆన్‌లైన్ చెల్లింపు చేయవచ్చు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకపోవడంతో... "మా హోమ్-చెఫ్స్ రుచి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటామని చెబుతుంటారు. మేము సాధారణంగా ఒక రోజులో మాత్రమే అమ్ముడయ్యే పరిమాణంలో మాత్రమే వంటకాలు సిద్ధం చేస్తారని హర్ష చెబుతారు.

image


హోమ్-చెఫ్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియ విస్తృతం కావడంతో... మెను తయారు చేయడంలోనూ... క్వాలిటీ విషయంలో ఓ ప్యానెల్ రూపొందించాం. మసాలా బాక్స్ ప్యాకింగ్ చేసే ముందు ప్యానెల్ రుచి బాగుందని భావిస్తేనే కస్టమర్ ఇంటికి పంపిస్తారు. ఎంపిక అయిన ఆహారాన్ని ఫోటోషూట్ కూడా చేసి వెబ్‌సైట్లో అప్ లోడ్ చేస్తామని చెబుతారు. ఈ ఫోటోలు చూడటానికి సైట్ లో అందంగా పెడతారు. మరో వైపు చెఫ్‌ల వంటగది తనిఖీ చేసి.. చట్టబద్దమైన ఆమోదాలను ఉన్న తర్వాతే వారికి అనుమతి ఇస్తారు.

"మేము మసాలా బాక్స్ కింద ఏదో కమర్షియల్‌గా ఉన్న చెఫ్‌లను తీసుకురావడం ఇష్టం లేదు. ఇళ్లలో ఉండే మహిళలు తయారు చేసిన వంటలు రుచికరంగా ఉంటాయంటారు హర్ష. అంతే కాదు..మంచి రుచికరంగా తయారు చేసే ఎవరైనా మసాలా బాక్స్‌ను సంప్రదించవచ్చని సూచిస్తారు. మహిళలే వంటలు తయారు చేయడం మాకు అదనపు ఉపయోగం. ఒకసారి అప్లికేషన్ లాంఛ్ చేసుకుంటే..వారి అవసరాలును గమనిస్తూ సేవలు అందిస్తారు.

Masalabox ప్యాకేజింగ్ మెటీరియల్, ఆహార సరఫరా విషయంలో జాగ్రత్త తీసుకుంటుంది. భోజనం, స్పిల్-ప్రూఫ్ మైక్రోవేవ్-లాంటి సేఫ్ మొక్కల ఫైబర్స్ నుంచి బాక్స్ లు తయారు చేస్తారు. వెదురు మరియు చెరకు వంటి మొక్కలతో తయారు కావడంతో నేరుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లాస్టిక్ మరియు కాగితం రీసైకిల్ పదార్థాల నుంచి తయారు చేస్తారు. కొచ్చి లో ఆరు నెలలుగా 260 రకాల వివిధ వంటల రుచులు చూపించామని చెబుతున్నారు. "వినియోగదారులు మా మెను నూ ఎప్పటికీ విసుగు చెందరు. నాణ్యతతో పాటు కొత్త రకాల ఫుడ్ ఐటెమ్స్ మా బిజినెస్ పెరగడానికి కారణమవుతుందని "హర్ష వివరిస్తుంది.

image


మసాలా బాక్స్, బాగా, వండి వడ్డిస్తుంది "ఇది నా కిచెన్ అమ్మమ్మను నాకు గుర్తుచేస్తుంది అనే ఆలోచనను ప్రజల్లో తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని మసాలా బాక్స్ టీమ్ చెబుతోంది. వినియోగదారుడి ఫోన్ కాల్ అందిన వెంటనే సేవలు, అవసరమైన ఆహారం అందిస్తూ ఉండడంతో ఊహించిన దాని కంటే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తొంది. "మేము రాబోయే ఐదు సంవత్సరాలలో తొమ్మిది నగరాల్లో విస్తరించాలన్నది తమ లక్ష్యమని భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తున్నారు లియా..