అంతరిక్షయానం చేయబోతున్న మరో భారత సంతతి యువతి  

0

కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత మహిళా వ్యోమగాముల జాబితాలో చేరింది మరో భారత సంతతికి చెందిన యువతి. ఇండో-కెనడియన్ అయిన డాక్టర్ షానా పాండ్యా త్వరలో అంతరిక్షయానం చేసి భారతదేశ కీర్తిపతాకాన్ని దిగంతాలకు చాటిచెప్పబోతోంది.

32ఏళ్ల షానా పాండ్య బహుముఖ ప్ర‌జ్ఞాశాలి. నాసా వ్యోమగామి ఒక్కటే కాదు.. జనరల్ ఫిజీషియన్, న్యూరోసర్జన్, ఇంటర్నేషనల్ తైంక్వాండో ఛాంపియన్, ఒపెరా సింగర్. మంచి రచయిత్రి కూడా.

మొత్తం 3,200 మందిలో షానాకు మాత్రమే అంతరిక్షయానం చేసే అవకాశం దక్కింది. 2018లో 8 మందితో కూడిన బృందం స్పేస్ లోకి అడుగుపెట్టబోతోంది. ఆ బ్యాచ్ లో షానా వుంది. థాయ్ లాండ్ కి చెందిన ముయే థాయ్ అనే యుద్ధకళలో కూడా షానా శిక్షణ పొందింది. చిన్నప్పటి నుంచే అంతరిక్షం అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? చుక్కలు, పాలపుంతలు ఎలా ఉంటాయి? అని తెలుసుకోవాలనే తపన ఉండేదని షానా చెప్తోంది. ఆ కల ఇలా నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందని అంటోంది.

అల్బెర్టా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ న్యూరోసైన్స్ చేసిన షానా, తర్వాత ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీలో స్పేస్ సైన్స్ లో మాస్టర్స్ చేసింది. దాంతోపాటు అల్బెర్టా యూనివర్శిటీ నుంచి మెడిసిన్ ఎండీ చదవింది. ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలపై పట్టు సాధించింది.

ముంబైకి చెందిన షానా పాండ్యా, ఇటీవలే ఫ్యామిలీతో కలిసి నగరానికి వచ్చింది. అక్కడి హాస్పిటళ్లను సందర్శించి, డాక్టర్లతో మాట్లాడింది. మెడికోలను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చింది.  

Related Stories