కృషితో నాస్తి దుర్భిక్షమ్

డిమ్ లైట్ చదువు నుంచి డ్రీమ్ టెక్కీస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వరకూకష్టాలను ఈదుతూ టాప్ రేంజ్ కి చెరిన పరుచూరి రాణికెన్యా,నైజీరియా,ఘనా,నేపాల్ లోనూ డ్రీమ్ టెక్కీస్ సేవలు

కృషితో నాస్తి దుర్భిక్షమ్

Monday July 27, 2015,

4 min Read

పట్టుదల..కృషి..ఈ రెండు పదాలకున్న శక్తి అపరిమితం..కాకపోతే చిమ్మచీకట్లో బెడ్ లైట్ వెలుగులో చదువుకున్న ఓ బాలిక..ఇప్పుడు వందలాది జీవితాల్లో వెలుగు నింపుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందేం లేదు..ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెటూరు లక్ష్మీపురం...పేదరికంలో మగ్గుతూనే చదువు సాగించింది పరుచూరి రాణి అని రెండు ముక్కల్లో చెప్పడం చాలా సులభం..తల్లిదండ్రులిద్దరూ నిర్లక్షరాస్యులు కావడం..అందులోనూ తండ్రి ఆమె 12ఏళ్ల వయస్సులో చనిపోవడం..ఈ రెండూ అనుభవించే వారికే కానీ చెప్పడంలో ఆ కష్టాలు అర్ధం కాదు..చిన్నవయస్సులో కుటుంబాన్ని పోషించాలా...లేక చదువుకోవాలా..ఇదీ ఆ చిన్న బుర్రలో ఆందోళన..ఆవేదన..బతుకుబండికి కష్టసుఖాలు చక్రాలంటారు..మరి రెండు చక్రాలూ కష్టాలే అయినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది..

ఎదురు దెబ్బలే ఎదురులేని మనిషిగా మార్చుతాయ్

పరుచూరి రాణి

పరుచూరి రాణి


అలా కష్టాలను ఈదుతూ రాణి..ఇంటర్ చదువుతున్న రోజుల్లో.. వాళ్లింటికి ఓ సాయంత్రం ఆమె మేనమామ వచ్చాడు..అర్ధరాత్రిదాకా గుడ్డివెలుగులో రాణి పడుతున్న కష్టం చూసి చలించిపోయిన ఆయన..తనతోపాటు హైదరాబాద్ తీసుకెళ్లాడు..అదే రాణి లైఫ్ ని మలుపు తిప్పింది. .హైదరాబాద్ లయోలా అకాడమీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేర్పించాడు..ఇది జరిగింది 1989లో..అప్పట్లో కంప్యూటర్లంటే అవో బ్రహ్మపదార్ధాలు..నవలల్లో సినిమాల్లో మాత్రమే కన్పించే కంప్యూటర్లపై రోజూ కాలేజీలో పనిచేయడం రాణికెంతో థ్రిల్ కి గురి చేసేది..ఆమె డిగ్రీ చదివే రోజుల్లోనే ఓ సంఘటన బాగా ప్రభావం చూపించిందని చెప్తుందామె. రెండు సంఖ్యలను కూడటమనే చిన్న ప్రోగ్రామ్ ను రాయాల్సిందిగా అస్సైన్ మెంట్ ను లెక్చరర్ ఇచ్చారు..రాణి క్లాస్ లో ఓ అమ్మాయి దాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగా..మిగిలినవాళ్లంతా కాపీ చేశారట..ఇది జరిగి పాతికేళ్లవుతున్నా కంప్యూటర్ల వాడకంలో ఉన్న అసలు సౌలభ్యం వాటిలో ఉన్న పొటెన్షియల్ తెలిసిన ఆ క్షణం ఇప్పటికీ ఆమెకి పొల్లుపోకుండా గుర్తుండిపోయేలా చేసింది..

అలానే తన లైఫ్ లో మరో సంఘటననూ రాణి మర్చిపోలేనిదని చెప్తుంటోంది..రాణి స్నేహితురాలు ఒకొరు ఓ సంక్షిష్టమైన కాన్సెప్ట్ ను కంప్యూటర్ సాయంతో వందమంది స్టూడెంట్స్ కి అతి సులభంగా అర్ధమయ్యేలా చెప్పడం చూసింది..మామూలుగా అయితే అదే కాన్సెప్ట్ ను స్టూడెంట్స్ కి చెప్పడానికి మిగిలినవాళ్లు నానా తిప్పలూ పడటం గమనించింది ..ఇదే కంప్యూటర్లతో పని చేయడంపై ఆమెకి మరింత మక్కువను పెంచింది..ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే..డిగ్రీ పూర్తయ్యేచివరిరోజుల్లో..తర్వాత ఏం చేయాలనేది రాణికి తోచలేదు..మైండ్ అంతా బ్లాంక్..కళ్లముందు తల్లి తన చదువుకోసం ఖర్చు పెట్టిన 35వేల రూపాయలు మాత్రమే కన్పించాయ్..సరిగ్గా అప్పుడే అదృష్టం కాలేజీ హెచ్ఓడీ (కంప్యూటర్ డిపార్ట్ మెంట్ హెడ్ ) రూపంలో రాణికి ఓ ఆఫర్ ఇచ్చేలా చేసింది."ల్యాబ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తావా "అని అడిగాడాయన.. నెలకు 1500 జీతం...అప్పటికే భవిష్యత్ పై ఏ మాత్రం ఆలోచన లేని రాణి ఆయన ఆఫర్ ను ఆనందంగా స్వీకరించింది..ల్యాబ్ లో పాస్కల్,కోబాల్ లో విద్యార్ధుల సందేహాలు తీర్చడం..క్లాసులు తీసుకోవడం ఇదే రాణి జాబ్..ఐతే ఆమె స్టూడెంట్స్ కి మొదటిసారిగా క్లాస్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత తాను ఇంగ్లీష్ లో ధాటిగా(ఫ్లూయెంట్) మాట్లాడలేకపోవడం గమనించింది..ఐతే రోజులు గడిచేకొద్దీ అందులో కూడా ప్రావీణ్యం సంపాదించింది..ఆ సమయంలోనే రాణికి పెళ్లైంది..అప్పుడామె వయస్సు 20 ఏళ్లు. లయోలాలో అలా ఏడాదిన్నర ల్యాబ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసిన రాణికి బ్లూచిప్ ఇన్ఫోటెక్ లో ట్రైనర్ గా అవకాశమొచ్చింది. అదే టైమ్ లో డిటిపి కోర్సూ కూడా నేర్చుకుంది రాణి..అది కూడా ఆమెలోని కార్యసాధనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు..తనకు పరిచయమైన ఓ ఫ్రెండ్ డిటిపి ఆపరేటర్ గా పని చేసేది.అప్పట్లో డెస్క్ టాప్ పబ్లిషింగ్ చేసేవాళ్లకు మంచి రెప్యుటేషన్ ఉండేది. ఆమెతో డిటిపి నేర్చుకుంటానని రాణి అడిగితే.." డిటిపి నేర్చుకోవాలంటే ఆర్టిస్టిక్ ఇన్ స్టింక్ట్ కావాలి.." అని ఆమె కాసింత ఎగతాళిగా సమాధానం వచ్చింది..దీంతో రాణి ఇంటికి వెళ్లి రాత్రి పదిగంటలవరకూ తెల్ల కాగితాలపై తనకు నచ్చిన బొమ్మలు గీసి..స్నేహితురాలింటికి వెళ్లింది...అంత రాత్రిలో రాణి రావడం..ఆమె వేసిన డ్రాయింగ్స్ చూడటంతో..డిటిపి నేర్పేందుకు అంగీకరించింది..డిటిపి నేర్చుకుంటూనే సమ్మర్ లో చిన్నపిల్లలకు కంప్యూటర్ కోర్సులు నేర్పేది రాణి..ఇలా జీవనయానం చేస్తూనే సి-డాక్ లో జావా నేర్చుకుంది..అందులోనూ కోర్సును 95శాతం scjp స్కోరుతో పూర్తి చేసింది.. ఆ తర్వాత ఆమే స్వయంగా జావా కోర్సులు టీచ్ చేయడం ప్రారంభించింది..ఇక్కడనుంచి రాణి హవా వీయడం ప్రారంభమైంది..కొన్ని కొన్ని సంస్థలు మా జావా ట్రైనర్ రాణి అని పబ్లిసిటీ ఇచ్చేరేంజ్ కి ఎదిగింది రాణి..

కొన్ని సెమినార్లు పూర్తైన తర్వాత మిమ్మల్ని చూడాలనే మా కల నెరవేరిందని చెప్పేవాళ్ల సంఖ్యా ఎక్కువైంది..అలా అలా రాణికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది.. ఆమె దగ్గర సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకున్నవాళ్లు..పెద్ద జీతాల్లో స్ధిరపడిన తర్వాత కృతజ్ఞతలు చెప్పడం కోసం వచ్చేవాళ్లు..

అలా లైఫ్ అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో...పెద్ద కుదుపు..సాఫ్ట్ వేర్ రంగం డౌన్ ఫాల్ మొదలైన వేళ..స్టూడెంట్స్ తగ్గిపోయారు..రాణి తల్లి కూడా ఆస్పత్రి పాలయ్యారు..తల్లిని సంరక్షించుకోవడం..రాత్రిళ్లు సాఫ్ట్ వేర్ క్లాసులకు ప్రిపేరవడం ఇదే సరిపోయేది..అలా ట్రీట్ మెంట్ జరుగుతుండగానే.. రాణి తల్లి కన్నుమూసింది..నేనేం చేసినా తల్లి మొహంలో చిరునవ్వు చూడటం కోసమే అని చెప్పే రాణి తల్లి అంత్యక్రియలు ముగిసిన ఆరోరోజే తిరిగి క్లాసులకు బయల్దేరింది..2001లో చకిలం ఇన్ఫోటెక్ లో ప్రాజెక్టు మేనేజర్ గా జాయినై తర్వాతి ఏడాదికే ఇంటెల్ లో చేరింది రాణి..2002 నుంచి 2005 వరకూ ఇంటెల్ లో పని చేసిన తర్వాత రాణి..తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అలా డ్రీమ్ టెక్కీస్ సాఫ్ట్ వేర్ ప్రవేట్ లిమిటెడ్ ప్రారంభమైంది..ఇన్సూరెన్స్ కంపెనీలకు కోర్ బిజినెస్ సొల్యూషన్స్ తయారు చేయడం డ్రీమ్ టెక్కీస్ పని..నలుగురు ఎంప్లాయీలతో మొదలైన ఈ డ్రీమ్ టెక్కీస్ సాఫ్ట్ వేర్ కంపెనీ..ఆ తర్వాత ఆసియా ఖండంలోనే కాకుండా..ఆఫ్రికా దేశాలైన కెన్యా,నైజీరియా,ఘనా,నేపాల్ కూ విస్తరించింది..ప్రారంభించిన సంవత్సరం నుంచీ మూడేళ్ల పాటు 40శాతం వృధ్ది రేటు సాధించిందీ కంపెనీ..రీసెంట్ గా మై ఇన్సూర్ బుక్ పేరుకో ఓ యాప్ కూడా డెవలప్ చేసింది డ్రీమ్ టెక్కీస్.

తన తల్లితో రాణి

తన తల్లితో రాణి


అప్ లే కాదు..డౌన్స్ కూడా

జావా క్లాస్ రూమ్ లో రాణి(1998)

జావా క్లాస్ రూమ్ లో రాణి(1998)


డ్రీమ్ టెక్కీస్ విజయగాధలోనూ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయ్.. 2009లో సంస్థ కరెంట్ ,వాటర్ , ఇంటర్ నెట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి దాపురించింది..ఆఫీస్ ఆవరణతో పాటు..సాక్షాత్తూ సీఈఓ రాణి కేబిన్ లో మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా డబ్బుల్లేక..వాటిని పీకేయాల్సివచ్చిందట.ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఆఫీస్ ను తక్కువ రెంట్ ఉన్న ప్రదేశానికి షిష్ట్ చేయడంతో పాటు..ఉద్యోగుల సంఖ్యలో..వారి జీతాల్లోనూ కోత విధించుకున్నారు..ఆ తర్వాత డ్రీమ్ టెక్కీస్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది..

ఉద్యోగులను ఎంపిక చేసుకోవడమే పెద్ద ఛాలెంజ్ గా చెప్తారు రాణి.. యాస్పిరెంట్స్ లో నేర్చుకోవాలనే తపనతో పాటు..సాఫ్ట్ వేర్ రంగానికి అవసరమైన కనీస అర్హతలున్నాయా లేదా అని చూస్తానంటారామె..

సోదరుడితో రాణి

సోదరుడితో రాణి


చివరిగా నేను చెప్పేదొకటేనంటారామె..సాఫ్ట్ వేర్ రంగంలో మహిళలు రాణించడమనేది కష్టమే..కానీ మన నిబద్దత..పట్టుదలే గుర్తింపునిస్తాయంటారు.. ఓ చిన్న డిమ్ లైట్ లో చదువుకున్న స్థాయి నుంచి అందరూ కలలు కనే స్థాయికి ఎదగడం వెనుక తన కుటుంబమిచ్చిన ప్రోత్సాహాన్ని మరవనంటారు రాణి.. చిన్నతనంనుంచి తాను పెరిగి పెద్దై ఉద్యోగం చేసేంతవరకూ తల్లి..సోదరుడు ఇచ్చిన సపోర్ట్ ..పెళ్లైన తర్వాత భర్త ప్రోత్సహిస్తున్న తీరు ఎప్పుడూ తనని విజయం వైపు నడిపించాయంటారు రాణి..