సరదాగా పాల్గొన్న వేలం పాటే ఇప్పుడు 300 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిని చేసింది

మారుమూల పంపిణీతో విజయవంతమైన మోహని టీ...డార్జిలింగ్ నుంచి ప్రారంభమైన వ్యాపార ఆలోచన...గ్రామీణ ప్రాంతాలే చాలాపెద్ద మార్కెట్ గా గుర్తించిన సంస్థ...ఉత్తర భారతంలో 5శాతం వాటానే ముందున్న సవాలు...

సరదాగా పాల్గొన్న వేలం పాటే ఇప్పుడు 300 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిని చేసింది

Wednesday June 17, 2015,

3 min Read

గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే విహారయాత్రకు డార్జిలింగ్ వెళ్ళాడు రమేశ్ చంద్ర అగర్వాల్. కానీ ఆ యాత్ర తన జీవిత యాత్రనే మార్చేస్తుందని అతను ఊహించలేదు. ఉత్తర బెంగాల్‌లోని తేయాకు తోటలు చూడ్డానికి వెళ్ళినప్పుడు బహిరంగ మార్కెట్లో తేయాకు వేలం వేయటం చూశాడు. తానూ వేలం పాడాలనుకున్నడు. రమేశ్ అప్పటికప్పుడే కొద్దిపాటి తేయాకు కొనేసి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు. అంతే, ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదట్లో రమేశ్ కేవలం తేయాకు టోకు అమ్మకంలోనే నిమగ్నమై తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాడు. కానీ ఒక సంఘటన అతడి దృక్కోణాన్నే పూర్తిగా మార్చేసింది. 

“ అదెలా జరిగిందంటే, ఒకసారి టీ పొడి విడిగా అమ్మే ఒక చిల్లర వ్యాపారి దగ్గర కూర్చున్నా. అప్పుడొక కస్టమర్ వచ్చి టీ పొడి నాణ్యత బాగా లేదని ఫిర్యాదు చేసింది. పైగా, కొద్ది రోజులకిందట తనకు అమ్మిన టీ పొడిని వెనక్కి ఇచ్చేస్తానంటోంది. సరిగ్గా అప్పుడే నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. సొంతగా పాకెట్ టీ పొడి అమ్మాలని, సరసమైన ధరకే నాణ్యంగా అందించాలని నిర్ణయించుకున్నా. బ్రూక్ బాండ్, లిప్టన్ లాంతి పెద్ద పాకెట్లు అందని చిన్న చిన్న గ్రామాలకు చేరాలన్నది నా లక్ష్యం. “ అని చెబుతారు రమేశ్. మారుమూల ప్రాంతాల ప్రజల సమస్య పరిష్కరించటానికి ముగ్గురు సోదరుల సాయంతో రమేశ్ తన సొంత బ్రాండ్ టీ మొదలుపెట్టాడు.

రమేశ్ చంద్ర అగర్వాల్

రమేశ్ చంద్ర అగర్వాల్


అంత ఈజీయా ?

తేయాకు పంట సీజన్ వారీగా వచ్చేదే అయినా, జనం మాత్రం ఏడాది పొడవునా వాడుతూ ఉంటారు. అస్సాం, ఉత్తర బెంగాల్, తమిళనాడు, కేరళ లాంటి రకరకాల రాష్ట్రాలనుంచి శాంపిల్స్ సేకరించటం మొదలుకొని పాకింగ్ దాకా ఇది చాలా పెద్ద పని. వేరు వేరు ఏజెంట్లనుంచి శాంపిల్స్ సేకరించిన తరువాత ఒక ప్రామాణికమైన తనిఖీ జరుగుతుంది. అప్పుడే ఆర్డర్ పెడతారు. అలా ఏజెంట్ల నుంచి వచ్చిన మొత్తం సరకును కాన్పూర్ లోని కేంద్రంలో పెట్టి అక్కడే మళ్ళీ పరీక్షించి ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకు మొత్తం సరఫరా మొదలు పంపిణీ దాకా మూడునెలలపాటు జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి ఒక నిపుణుల బృందం ఉంది.

సవాళ్ళు

అన్ని వినియోగ వస్తువులలాగానే వీళ్ళు కూడా అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పంపిణీ విషయంలో. గ్రామీణప్రాంతాలు చాలాపెద్ద మార్కెట్. కానీ వాళ్ళను చేరుకోవటమే అతి పెద్ద సవాలు. “ మొదట మేం కాన్పూర్ లో మా పాకెట్ టీ కార్యకలాపాలి మొదలుపెట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ లోని మారు మూల పల్లెలకు పంపిణీ చేయటం అతిపెద్ద సవాలు అని గ్రహించాం. అందరూ అప్పుమీద ఇమ్మని అడుగుతారు. ఎక్కువగా అమ్ముడుపోక పోవచ్చు అనే అనుమానంతో తక్కువ సరకు అడుగుతారు. ఏమైతేనేం ఓపికతో మేం చేసిన కృషి ఫలించింది. మొహని టీ చిన్నపట్టణాలలో ప్రజాదరణ పొందుతూ వచ్చింది.” అని చెప్పారు రమేశ్.

ఒకప్పటి అతిపెద్ద సవాలు మెల్లగా వాళ్ళ బలంగా మారింది. స్థానిక అమ్మకం దారుల పోటీని అధిగమించటానికి ఎంతో సమయం పట్టలేదు. “మార్కెట్లో స్థానిక అమ్మకం దారులు చాలామంది ఉన్నారు. చిన్న ప్రాంతంలో కావచ్చు, కొన్ని జిల్లాల్లో కావచ్చు..వాళ్ళ ఆధిపత్యం ఉంది. ధరల్లో పోటీపడటం, రకరకాల స్కీములు పెట్టటం లాంటివి చేసేవారు. మా దృష్టంతా ప్రధానంగా గ్రామాలు, చిన్నపట్టణాలు, నగర శివార్లు కాబట్టి మేం నేరుగా యూనీలీవర్, టాటా లాంటి పెద్ద తయారీదారులతోనే పోటీపడ్డాం. కానీ స్థానిక పోటీదార్ల వత్తిడి బాగానే ఉంది. ఇందులో టెక్నాలజీ ప్రమేయమేమీ లేదు, పంపిణీలో పట్టు. బ్రాండింగ్, వాడకం దారుల నమ్మకం, సరైన పంపిణీ వ్యవస్థ ఉండాలంతే. సరిగా ఇక్కడే మాది పైచేయి అయింది” అంటారు రమేశ్.

image


భవిష్యత్తు

ప్రస్తుతానికి ఉత్తర భారతదేశంలో ఐదు శాతం మార్కెట్ వాటాని సొంతం చేసుకున్నామంటారు రమేశ్. ప్రధానంగా వీళ్ళ మార్కెట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమూకాశ్మీర్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ఇప్పుడు వాళ్ళ టర్నోవర్ సుమారు 300 కోట్ల రూపాయలుండగా, వచ్చే ఐదేళ్లలో కనీసం వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించటం తమ లక్ష్యమని రమేశ్ చెబుతున్నారు