ఐదుగురి నుంచి 2500 మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగిన ఢెలివరి

లాజిస్టిక్స్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఢెలివరిమొదట దేశ రాజధాని సమీపంలో డెలివరీ సేవలురెండేళ్లలో అనూహ్యమైన వృద్ధినెలకు 7 లక్షల ఆర్డర్ల డెలివరీఢెలివరీ సక్సెస్ స్టోరీ

ఐదుగురి నుంచి 2500 మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగిన ఢెలివరి

Friday April 17, 2015,

2 min Read

మార్కెటింగ్, టెక్నాలజీ, సేవల రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి కానీ లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులకు సంస్థాగత ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదన్న భావన చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. నిజానికి ఈ కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలిచే లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి గత ఐదేళ్లలో రెండు మూడు కంపెనీలే తెరపై కనిపించాయి. ఈ లోటును భర్తీ చేసేందుకే గుర్గావ్‌లో ఢెలివరికి బీజం పడింది.

ఢెలివరీ టీం

ఢెలివరీ టీం


ఢెలీవరీ 2011లో ప్రారంభమైంది. ఐదుగురు కలిసి ఈ కంపెనీ ప్రారంభించారు. అప్పట్లో ఆ కంపెనీలో పట్టుమని పది మంది డెలివరీ బాయ్స్ కూడా లేరు కానీ ఇప్పుడు 2500 మంది ఉద్యోగులు పనిచేసే స్థాయికి ఎదిగింది. 600 మంది క్లయింట్స్‌కు సేవలు అందించడం ఢెలీవరీ ప్రత్యేకత. గత మూడేళ్లలో ఎవరినీ కాదనకుండా సేవలందించామని కంపెనీ సక్సెస్ స్టోరీని ఒక్క మాటలో చెప్పేశారు ఆ సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సాహిల్ బారువా.

బ్రిక్ అండ్ మోర్టార్ రిటైలర్లు, చిన్న వ్యాపారులకు సేవలందిస్తూ ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. మూడు నగరాల్లో 10 వేల చదరపు అడుగుల ప్రాంగణంతో ప్రారంభమైన ఆ కంపెనీ ఏడాదిలో 60 వేల చదరపు అడుగులకు విస్తరించింది. ‘ఘర్ పే’ అనే క్యాష్ కలెక్షన్ నెట్వర్క్‌ను కూడా ఢెలీవరీ స్వంతం చేసుకుంది. అయితే ఎంతకు కొనుగోలు చేశారో మాత్రం వెల్లడించేందుకు నిరాకరిస్తోంది.

సాహిల్ బారువా, మోహిత్ టాండన్, భవేష్ మంగలానీ, సూరజ్ సహారన్, కపిల్ భారతీ కలిసి ఢెలీవరీని ప్రారంభించారు. తొలుత గుర్గావ్‌లో ప్రారంభించి తర్వాత నేషనల్ క్యాపిటల్ రిజియన్ (ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు) మొత్తానికి విస్తరించారు. లాజిస్టిక్ వ్యాపారంలో పెట్టుబడి ఎక్కువగా అవసరమైనందున నిదానంగా విస్తరించాల్సి వచ్చిందని కంపెనీ ప్రమోటర్లు చెబుతున్నారు. 1800 పిన్ కోడ్లతో దేశంలో 25 వేల షిప్‌మెంట్లు రవాణా చేస్తున్నారు.

ఢెలీవరీ వసూలు చేసే రుసుము విషయానికి వస్తే.. అరకిలో బరువుండే పార్సిల్‌ను NCR ప్రాంతంలోనే డెలివరీ చేయాలంటే 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే బరువున్న ప్యాకెట్‌ను మెట్రో నగరాలకు పంపాలంటే నలభై నుంచి నలభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు.ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకైతే యాభై రూపాయలు తీసుకుంటున్నారు.

రోబోటిక్ టెక్నాలజీని వినియోగించుకుంటూ ఢెలీవరీ సంస్థ తన పనుల్లో వేగం పెంచుకుంది. ప్రస్తుతం ఒక చోటే ఉన్న రోబోటిక్ టెక్నాలజీని ఇతర ప్రదేశాలకు విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. 250 నగరాలకు తమ సేవలను విస్తరించడమే లక్ష్యమని సాహిల్ చెబుతున్నారు. ఇందులో ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ నెట్వర్క్ ప్రధానమైనది. గిడ్డంగి వ్యవస్థ, రవాణా, గ్లోబల్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. షిప్ స్మార్ట్, కోమ్స్, ఆమ్నీ ఛానెల్ సర్వీస్, కస్టమర్/ఛానెల్ ఎనలిటిక్స్ లాంటి సేవల్లో టూల్ కిట్స్ ని కూడా విస్తరించాలనుకుంటున్నారు.