మీ మొబైల్ పోయినా.. కాంటాక్ట్ నంబర్లు మాత్రం సేఫ్.. ఆరిజన్ యాప్ మేజిక్

మీ మొబైల్ పోయినా.. కాంటాక్ట్ నంబర్లు మాత్రం సేఫ్.. ఆరిజన్ యాప్ మేజిక్

Tuesday April 05, 2016,

4 min Read


టెక్నాలజీ పెరిగాక వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ మరింత తేలికయ్యింది. వేగం పెరిగింది… దూరం తరిగింది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులభమయ్యింది. ఒక్కరోజు మొబైల్, ఇంటర్నెట్ లేకపోతే ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లనిపిస్తుంది. మొబైల్ పోతే లేదా కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ అయిపోతే జీవితమే శూన్యమైపోయిన ఫీలింగ్. అవే కాంటాక్ట్స్ ఎక్కువైపోయినా టెన్షనే. వాటిని భద్రపరచుకోవడం చాలా కష్టం. ఫోన్ రింగయినప్పుడు పేరు డిస్ ప్లే అయినా... అదెవరో ఒక్కోసారి గుర్తుపట్టలేం. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు వచ్చింది ఆరిజన్ యాప్.

మొబైల్ కాంటాక్ట్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండేలా చేస్తుంది ఆరిజన్ యాప్. ఈ యాప్ మొబైల్ లో ఇన్ స్టాల్ చేస్తే అస్సలు కాంటాక్ట్స్ పోయే అవకాశమే లేదు. సెల్ పోయినా నంబర్లు మాత్రం పదిలం. అంతేకాదు ఈ యాప్ లో కస్టమ్ ప్రొఫైల్స్, ఫొటోలు, ఎవర్ని ఎప్పుడు కాల్ చేయాలన్న వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. కాంటాక్ట్స్ కి టైమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఫోన్ వచ్చినప్పుడు కాలర్ వివరాలన్నీ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి.

ఈ యాప్ ఎలా పనిచేస్తుంది?

ఈ యాప్ ఇండియా, అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, సింగపూర్,యునైటెడ్ కింగ్ డమ్ లో అందుబాటులోకి వచ్చింది. యాప్ డౌన్ లోడ్ అయ్యాక కాంటాక్ట్ నంబర్ తో సైన్ ఇన్ అవ్వాలి. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ... యాప్ ఇన్ స్టాల్ చేయాలి. కస్టమర్ ప్రొఫైల్ సృష్టించుకోవాలి. ఈ యాప్ లో ప్రీడిజైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. దీంతో యూజర్ పని మరింత తేలికవుతుంది. యూజర్ ప్రొఫైల్ నే స్మార్ట్ కాలర్ గా ఉపయోగించుకుంటారు. ఆరిజన్ యాప్ ఇన్ స్టాల్ అయిన ఫోన్ కు కాల్ వస్తే… కాలర్ ప్రొఫైల్ వివరాలు అవతలి వ్యక్తికి వెళ్తాయి. దీంతో ఎవరు ఫోన్ చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రొఫైల్ మార్చుకునే వీలుంది. గూగుల్ యాప్, ఇతర కాంటాక్ట్ యాప్స్ లోని ఫోన్ నంబర్లను సైతం ఈ యాప్ ద్వారా మేనేజ్ చేయొచ్చు.

image


ఆసక్తికర ఫీచర్స్

కాల్ నోట్ : ఒక పర్సన్ కు కాల్ చేసేటప్పుడు 60 లెటర్స్ కు మించకుండా మెసేజ్ పెట్టవచ్చు. కాల్ తో పాటు ఆ మెసేజ్ అవతలి వ్యక్తి స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. అయితే ఇద్దరూ ఆరిజన్ యాప్ లో లాగిన్ అయ్యుండాలి. ఆరిజన్ యాప్ లేకపోతే కాల్ నోట్… అవతలి వ్యక్తికి ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తుంది.

యాక్టివ్ స్టేటస్: యాజర్స్ కు స్టేటస్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎవైలబుల్, అర్జెంట్ కాల్స్ ఓన్లీ, డోన్ట్ డిస్టర్బ్ ను స్టేటస్ మెసేజ్ లుగా పెట్టుకోవచ్చు. వీటిని బట్టే అవతలివారు ఫోన్లు చేస్తారు.

డీపర్ సెర్చ్ : మన ప్రొఫైల్స్ బట్టే అవతలి వ్యక్తి కాంటాక్ట్ అయ్యే వీలుంటుంది. ప్రొఫెషన్, కంపెనీ పేరు, ఇతర వివరాలతో నంబర్ సేవ్ చేసుకోవచ్చు.

HIYA: ఫేస్ బుక్ లోని పోక్, యో యాప్ మాదిరిగా… ఇందులో హయా ఉంటుంది . దీనివల్ల ఇతరుల దృష్టిని ఆకర్షించవచ్చు. వారిపట్ల మన ఆసక్తిని వ్యక్తపరచవచ్చు.

ఆరిజన్ యాప్ ఎలా పుట్టింది?

ప్రమోద్ (39), దినేష్ (37) కలిసి ఆరిజన్ యాప్ తయారుచేశారు. 17 ఏళ్లపాటు వివిధ కంపెనీల్లో పనిచేసిన అనుభవముంది. ప్రస్తుతం ఈ స్టార్టప్ లో 17 మంది పనిచేస్తున్నారు. కాఫీతాగుతూ దేశంలో కమ్యూనికేషన్ విప్లవం గురించి మాట్లాడుకుంటుండగా ఈ యాప్ రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. భవిష్యత్ లో వ్యక్తుల మధ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ తయారుచేశామంటున్నారు.

ఆ ఆలోచనలనే ఆచరణలో పెట్టారు. పలు దేశాల్లో పర్యటించి… యూజర్స్ ట్రెండ్స్ పసిగట్టారు. 85 శాతం మంది ప్రజలు ఇప్పటికీ వాయిస్ కాల్స్, టెక్స్ ట్ మెసేజ్ లు, ఈ మెయిల్స్ నే వాడుతున్నారని గుర్తించారు. సోషల్ మీడియాను ఎంతగా వాడుతున్నా… వాటికి ప్రాధాన్యత తగ్గలేదని తేల్చారు. అందుకే కాంటాక్ట్ నంబర్స్ తోనే … కమ్యూనికేషన్ లో మేజిక్ చేయాలనుకున్నారు.

కాంటాక్ట్స్ ను బెటర్ గా మేనేజ్ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఎవరిని ఎప్పుడు కాంటాక్ట్ చేయాలో చెబుతుంది. కాంటాక్ట్స్ కోసం సింగిల్ పాయింట్ ఫ్లాట్ ఫాం రూపొందించడమే ఫౌండర్ల లక్ష్యం. క్యాలెండర్, ఆర్గనైజర్, సోషల్ టూల్స్ మొత్తం అందులోనే ఉండాలి. ఆరిజన్ యాప్ లో వాట్సప్ కూడా అనుసంధానమై ఉంటుంది. త్వరలో స్కైపీ, వీచాట్, వైబర్ లను చేర్చనున్నారు. యూజర్ ఇన్ఫర్మేషన్ ను తాము సర్వర్ లో సేవ్ చేయమని చెప్తున్నారు. క్లైంట్ల ప్రైవసీకి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ఫ్రీగానే దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్స్ కు ఇది అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్ యాప్ ను డెవలప్ చేస్తున్నారు.

image


సెక్టార్ ఎలా ఉంది?

దేశంలో స్మార్ట్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. ఫోన్ నంబర్ ఆధారంగా వినియోగదారులతో కంపెనీలు కాంటాక్ట్ అవుతున్నాయి. విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ట్రూకాలర్ ఈ రంగంలో దూసుకుపోతోంది. ఇందులో రెండు కోట్ల మొబైల్ నంబర్లకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆన్ నోన్ ఫోన్ నంబర్ కొడితే చాలు.. దాని పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవచ్చు. ఇటీవలే ఎస్డీకే ప్రారంభించారు. దానిద్వారా దేశంలోని 12 స్టార్టప్స్ కు తమ కస్టమర్లను కాంటాక్ట్ చేసే అవకాశం కల్పించారు. ర్యాపోర్టివ్ స్టార్టప్ ను లింకిడ్ఇన్ 2012లో కొనుకోలు చేసింది. ఆరిజన్ యాప్ అంతకన్నా మెరుగ్గా కాంటాక్ట్స్ ను ఎలా ఉపయోగించుకోవాలో చెబుతుంది. కొలరాడోలోని ఫుల్ కాంటాక్ట్ ఆరిజన్ యాప్ లాంటి స్టార్టప్పే. కాల్ కు ముందు కాలర్ సమాచారం పంపించే యాప్ కాల్ ట్యాగ్. స్టాటస్ స్టార్టప్ ద్వారా వ్యక్తి ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఆటోమేటిక్ గా స్టాటస్ ను అప్ డేట్ చేస్తుంది. ఆరిజన్ యాప్ కు మార్కెట్లో మంచి భవిష్యత్తే ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇంకా అభివృద్ధి చేయొచ్చా?

ఆరిజన్ యాప్ లో ఇంప్రూవ్ మెంట్ కు ఇంకా స్కోప్ ఉంది. HIYA ఫీచర్స్ పై కొన్ని నియంత్రణలున్నాయి. యూజర్స్ ఫీడ్ బ్యాక్ బట్టి కొన్ని సాంకేతిక సవరణలు చేస్తామని ఫౌండర్ దినేష్ చెప్పారు.

image


యువర్ స్టోరీ మాట

ఇంటర్నెట్ విశ్వానికి కేంద్రం మొబైల్ ఫోన్లయితే … నంబర్స్ వాటి డిజిటల్ ఐడెంటిటీస్. మొబైల్ ఐడెంటిటీ వల్ల కమ్యూనికేషన్ మరింత సమర్ధవంతంగా చేయొచ్చు. ఆరిజన్ యాప్ కు మరిన్ని మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచి బిజినెస్ మోడల్ తో మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆరిజన్ యాప్ పనితీరు మీకు పూర్తిగా తెలియాలంటే… వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో దీన్ని ఇన్ స్టాల్ చేసుకోండి.