జీవితాన్ని మార్చేసిన కేదారనాథ్ యాత్ర

గ్రామీణ భారతంలో వెలుగులు నింపిన యువకుడుఎం.ఎన్.సి. ఉద్యోగం వదిలి హిమాలయాలకు..!పల్లె భారతానికి సరికొత్త అర్థం చెప్పిన చతుర్వేది

జీవితాన్ని మార్చేసిన కేదారనాథ్ యాత్ర

Wednesday June 24, 2015,

3 min Read

అజయ్ చతుర్వేది వార్టన్ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి సిటి బ్యాంక్ లో వర్క్ చేసేవారు. మంచి ఉద్యోగం, అంతకంటే మంచి జీతం. ఓ రోజు ఏమైందో ఏమో ఒక్కసారిగా అతను హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయారు. ఆఫీస్ లో రెండు వారాలు మాత్రమే అత్యవసర సెలవులు ఇస్తారు. చతుర్వేది హిమాలయాలకు వెళ్లి రెండు వారాలు పూర్తి కావడంతో తర్వాత ఏం చేద్దాం అని తనను తాను ప్రశ్నించుకున్నారు. అంతే ఏం నిర్ణయం తీసుకున్నారో ఏమో... ఉద్యోగం వదిలేశారు. ఆరునెలల పాటు హిమాలయాల్లోనే గడిపారు.

అజయ్ చతుర్వేది

అజయ్ చతుర్వేది


ఉద్యోగమనే పంజరానికి జీవితాన్ని అంకితం చేయడం అజయ్ చతుర్వేదికి ఇష్టం లేదు. అయితే చతుర్వేది ఆత్మశోధన భవిష్యత్తుపై ఓ స్పష్టత ఇచ్చింది. బిట్స్ పిలానీ నుంచి వచ్చిన తర్వాత మొదటి ఉద్యోగం రెండేళ్ల కంటే ఎక్కువ కాలం చేయలేదు. 1990లో మార్కెట్లు మంచి జోరుమీద ఉన్నప్పుడు ట్రేడింగ్ వైపు వెళ్లాలనుకున్నారు. ఆ తర్వాత మార్కెట్లన్నీ కుప్పకూలాయి. వార్టన్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడే చతుర్వేది లైఫ్ జర్నీ మొదలైంది. అక్కడే అతని మదిలో మెదులుతున్న కొన్ని ప్రశ్నలకు జవాబులూ దొరికాయి.

అజయ్ చతుర్వేది హిమాలయాల్లోనే పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ పర్యటన ఆతని జీవితాన్నే మార్చేసింది. అక్కడ మదిలో మెదిలిన కొత్త ఆలోచనల వైపుగా చతుర్వేది అడుగులు వేశారు. గ్రామీణ భారతానికి తనవంతుగా ఏదైనా చేయాలని భావించారు. అందులో భాగంగానే హార్నెసింగ్ వాల్యూ ఆఫ్ రూరల్ ఇండియా ( హార్వా ) ను స్థాపించారు.

చింద్వారాలోని హర్వా ఎక్స్పీవో (మధ్యప్రదేశ్)

చింద్వారాలోని హర్వా ఎక్స్పీవో (మధ్యప్రదేశ్)


ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలకు వీలైనన్ని అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని చతుర్వేది గ్రహించారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అవకాశాలు కల్పిస్తున్నా అవి డ్రైవర్, చౌకిదార్ లాంటి వాటికే పరిమితమవుతున్నాయి. అంతకంటే మెరుగైన అవకాశాలు అందించాలని చతుర్వేది నిర్ణయించుకున్నారు. మనకెందుకులే అనుకునే వ్యక్తికి దేనినీ విమర్శించే హక్కు ఉండదని చతుర్వేది బలంగా నమ్ముతారు. పల్లెల్లో తెలివైన వారు ఉన్నా వారిని గుర్తించే వారు కరువయ్యారు. అలాంటి వారితో కలిసి పని చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని చతుర్వేది భావించారు.

హార్వా....హార్నెసింగ్ వాల్యూ ఆఫ్ రూరల్ ఇండియా....స్కిల్ డెవలప్ మెంట్ కోసం దీనిని స్థాపించారు. ఇదో బిపిఓ సంస్థ. స్పష్టమైన విజన్ తో ఇది పని చేస్తుంది. ఇదేదో లాభాల కోసం స్థాపించిన సంస్థ కాదు. పల్లెల్లో ఉన్న యువత, గృహిణిల నైపుణ్యాలకు పదును పెట్టే సంస్థ. చతుర్వేది హర్వా స్థాపించిన మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. మెల్లమెల్లగా పల్లె భారతంలో కదలిక వచ్చింది. చతుర్వేది ప్రయత్నానికి అందరూ స్వాగతం పలికారు. అతనికి తోడ్పాటుగా నిలిచారు. అందుకే ఇప్పుడు హార్వా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది.

మైక్రో ఫైనాన్స్ రూపంలో పల్లె ప్రజలకు చేయూతనివ్వడం హార్వాలో ఓ భాగం. అజయ్ అతని టీమ్ నిరుద్యోగుల కోసం ఎంప్లాయి లోన్ ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం హార్వా బ్రాంచ్ లు 20 వరకు ఉన్నాయి. ఇందులో 5 హార్వా సొంతం కాగా మిగతావి ఫ్రాంచైజీలకు ఇచ్చారు. దేశంలోని 14 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో హార్వా సేవలందిస్తోంది. ఇందులో 70 మంది మహిళలే ఎక్స్ పీవోలుగా పని చేస్తున్నారు. అజయ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రముఖ విద్యాసంస్థల్లో చదివిన సాఫ్ట్‌ వేర్ నిపుణులు కాదు, గ్రామాల్లో స్కూలు ఫైనల్ కూడా దాటని మహిళలు. అదీ హార్వా స్పెషాలిటీ. హర్వా వెయ్యి కుటుంబాలకు సపోర్ట్ గా నిలుస్తోంది. ఇందులో పని చేస్తున్న ఉద్యోగులు 15 వందల నుంచి 14 వేల వరకు వ్యవసాయం, స్టూడెంట్ హెల్ప్ డెస్క్ ఇన్సూరెన్స్ కు ఇస్తున్నారు.

హార్వాను విస్తరించేందుకు చతుర్వేది సిద్ధమయ్యారు. దీనికోసం ఫ్రాంచైజీల సహాయం తీసుకున్నారు. హర్వా విస్తరించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అజయ్ తన చిన్న లక్ష్యాలను ఉద్యోగులతో పంచుకుంటూ ముందుకెళ్తారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి చెందినట్లే. అప్పుడు మనం ఇతర దేశాలకు మార్గదర్శకంగా మారుతామని చతుర్వేది నమ్ముతారు.

ఎక్స్పీవోలో పనిచేస్తున్న మహిళలు

ఎక్స్పీవోలో పనిచేస్తున్న మహిళలు


హార్వా స్థాపించినప్పుడు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత తీర్చడం అజయ్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది. అందుకే ఎక్స్ పీవో సెంటర్లు ప్రారంభించారు. పల్లెల్లో నివసించే ప్రజల మైండ్ సెట్ మార్చడం అజయ్ కు మరో ఛాలెంజ్ గా మారింది. కాని రూరల్ స్థాయిలో ఏ... బిపీఓ సంస్థ సాధించలేని గ్రోత్ హార్వా సాధించింది. పల్లె ప్రజాలకు హార్వా మంచి అవకాశాలను కల్పిస్తుంది (అవి వైట్ కాలర్ ఉద్యోగాలతో సమానంగా ఉంటాయి). అందుకే గ్రామీణ ప్రాంత ప్రజల హార్వాలో పని చేసేందుకు ఉత్సాహంగా పోటీ పడతారు. అంతేకాదు మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో హార్వా 7 శాతం ప్రీమియం కూడా చెల్లిస్తుంది.

అజయ్ చతుర్వేది పనితనాన్ని ప్రపంచమంతా ప్రశంసించింది. వరల్డ్ ఎకానమిక్ ఫోరం చతుర్వేది ప్రతిభను గుర్తించి అతని 2013 యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందజేసింది. తాజాగా క్రియేటివ్ లీడర్స్ కు సంబంధించి అమస్టర్ డమ్ స్కూల్ చేసిన వరల్డ్ వైడ్ సర్వేలో టాప్ 50 లో చతుర్వేది నిలిచారు. నేటి యువతకు చతుర్వేది మార్గదర్శకంగా మారారు. వన్ బిలియన్ పీపుల్ ఫేస్ బుక్ అకౌంట్లు కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో అలాంటి ఘనత సాధించడమే తమ లక్ష్యమంటారు చతుర్వేది. అవకాశాలు సృష్టించేందుకు పని చేస్తూ ఆర్ధిక వ్యవస్థకు ఓ మోడల్ గా మారుతున్నారు. అందుకే అందరూ ఎదిగితే అదీ అద్భుతమంటారు అజయ్ చతుర్వేది.