ఇంగ్లీష్ ఛాన‌ల్‌ను ఈజీగా ఈది ప‌డేసిన త‌ల్లీకూతుళ్లు!

ఇంగ్లీష్ ఛాన‌ల్‌ను ఈజీగా ఈది ప‌డేసిన త‌ల్లీకూతుళ్లు!

Monday January 11, 2016,

2 min Read

మైన‌స్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌. గ‌డ్డ‌క‌ట్టుకుపోయే చ‌లి. కానీ.. రికార్డ్ బ్రేక్ చేయాల‌నే త‌పన ముందు అవేవీ పెద్ద అవ‌రోధాల్లాగా క‌నిపించ‌లేదు. అందుకే అతి త‌క్కువ స‌మ‌యంలో ఇంగ్లీష్ ఛాన‌ల్‌ని స‌ర‌దాగా ఈదేశారు త‌ల్లీ కూతుళ్లు. చ‌రిత్ర‌లో ఈ ఫీట్ చేసిన వారిగా రికార్డు న‌మోదు చేశారు.

image


లీనా, భ‌క్తి. 2008లో మైన‌స్ 1 డిగ్రీ ఉష్ణోగ్ర‌త‌లో 2.25 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం 52 నిమిషాల్లో ఈది, అమెరిక‌న్ స్విమ్మర్లు లూయిస్ ప‌గ్‌, లిన్నే కాక్స్‌ ల రికార్డును బ్రేక్ చేశారు. వీళ్లు సాధించిన ఘ‌న‌త‌ను అభినందిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ట్వీట్ కూడా చేశారు. ఇందుకోసం ఇద్ద‌రూ రోజుకు 20 గంట‌ల పాటు ప్రాక్టీస్ చేశారు.

ఇంత పెద్ద రికార్డును అంత ఈజీగా సాధించ‌లేదు. అందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంత‌కంటే ముందు నైపుణ్యం సాధించాలి. లీనా దాన్ని చిన్న‌త‌నంలోనే సాధించారు. కోచ్‌లు లేరు. నేర్పించేవాళ్లు లేరు. ఊరంతా చెరువులే. అందుకే.. రాజ‌స్ధాన్‌లోని ఉద‌య‌పూర్‌కు చెందిన లీనా త‌న‌కు తానుగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు. తోటి స్విమ్మ‌ర్స్‌ ని చూసి మెళ‌కువ‌లు తెలుసుకున్నారు. ఇక తల్లిని చూసి భ‌క్తి కూడా ఫాలో అయిపోయింది. న‌డిసంద్రంలో ఈద‌డంతో పాటు జీవితంలోని అవ‌రోధాల‌ను ఎలా అధిగ‌మించాలో తెలుసుకుంది.

తాను ఈ స్ధాయిలో ఉండ‌టానికి త‌న త‌ల్లి లీనానే ఇన్‌స్పిరేష‌న్ అంటారు భ‌క్తి. త‌ల్లిగా, కోచ్‌ గా లీనా త‌న‌కు నేర్పిన పాఠాలే ఈ స్ధాయిలో నిల‌బెట్టాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆమె రాష్ట్ర‌, జాతీయ‌స్ధాయి పోటీల్లో వంద‌ల మెడ‌ల్స్ గెలుచుకున్నారు. కేవ‌లం 25 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌పంచంలోని అన్ని స‌ముద్రాల‌ను ఈదిన మ‌హిళ‌గా రికార్డు సొంతం చేసుకున్నారు.

నీళ్లంటే భ‌యం లేని వ‌య‌సులోనే పిల్ల‌ల‌కు స్విమ్మింగ్ ప‌ట్ల ఆస‌క్తిని క‌లిగించాలని చెప్తున్నారు లీనా. అందుకే.. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే భ‌క్తి.. ధార‌మ్‌ త‌ల్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వ‌ర‌కూ 9 గంట‌ల 30 నిమిషాల్లో స్విమ్ చేసేలా ట్రైనింగ్ ఇచ్చారు.

స‌ముద్రాల్లో స్విమ్మింగ్ అంటే పూల్స్‌లో చేసినంత ఈజీ కాదు. తేడా వ‌స్తే శాల్తీలే గ‌ల్లంత‌యిపోతాయి. అనుకోని సంఘ‌ట‌న జ‌రిగితే ప‌రిస్థితిని ఊహించ‌డం కూడా క‌ష్టంగానే ఉంటుంది. అలాంటి అరుదైన ఫీట్‌ ను ఎంతో సాహ‌సంతో పూర్తి చేసిన లీనా, భ‌క్తిల‌ను యువ‌ర్ స్టోరీ అభినందిస్తోంది.