బర్త్ డే ఎప్పుడో చెప్పండి.. అర్ధరాత్రి కేక్ తెచ్చి వాళ్లే సెలబ్రేట్ చేస్తారు  

మెమరబుల్ సర్ ప్రైజ్ ఇస్తున్న మిడ్ నైట్ కేక్

2

ఈమధ్య అర్ధరాత్రి బర్త్ డే జరుపుకునే కల్చర్ పెరిగింది. గడియారం ముల్లు పన్నెండు దాటగానే కేక్ కట్ చేసి గోలగోల చేస్తున్నారు. ఇక బ్యాచిలర్లయితే ఎంజాయ్ మెంట్ కి హద్దుండదు. అయితే ఇదంతా ప్రిప్లాన్డ్ వరకే. ఉన్నట్టుండి సర్ ప్రైజ్ చేయాలంటే మాత్రం కష్టమే. అంతరాత్రి కేక్ దొరకడం అసాధ్యం. బొకేలు అసలే ఉండవు. బెలూన్లు కనిపించవు. కానీ ఒక్క క్లిక్ చేస్తే కేకు, బొకే, గ్రీటింగ్, సింగర్స్ సహా మిడ్ నైట్ మెమరబుల్ సర్ ప్రైజ్ మేమిస్తామంటోంది మిడ్ నైట్ కేక్ అనే స్టార్టప్.

చేయాల్సిందల్లా ఒకటే. సైట్ లోకి వెళ్లి నచ్చిన కేక్ ఆర్డర్ ఇవ్వడమే. మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. ఠంచనుగా 12 గంటలకు తలుపుతడతారు. కేక్ ఒక్కటే కాదు. బొకే, బెలూన్లు, హాండ్ క్రాఫ్టెడ్ గ్రీటింగ్ కార్డు, ఒక డిజిటల్ కెమెరా, దాంతోపాటు వీడియో క్యామ్, గిటారిస్టు, ఒక యాంకర్. ఒకసారి ఊహించుకోండి సీన్ ఎలా వుంటుందో. అదీ ఈ స్టార్టప్ స్పెషాలిటీ. ఒక్క బర్త్ డే అనే కాదు. వాలెంటైన్స్ డే, మ్యారేజ్ యానివర్సరీ, మదర్స్ డే ఇలా సందర్భం ఏదైనా ఈవెంట్ ని కలకాలం గుర్తుండిపోయేలా చేస్తారు. ఫోటోలతో మంచి ఆల్బమ్ చేసిస్తారు. వీడియోని అందంగా ఎడిట్ చేసి సీడీ రూపంలో అందజేస్తారు.

ఈ స్టార్టప్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఉదాహరణకు మీకు నచ్చిన వాళ్లు బర్త్ డే టైంలో ట్రైన్ జర్నీలో ఉన్నారనుకోండి. ఆ టైంలో కూడా కేక్ డెలివరీ చేస్తారు. అలా ఎన్నోసార్లు రైల్వే స్టేషన్లలో బర్త్ డే జరుపుకునేలా చేసి చిరకాలం గుర్తుండిపోయే సర్వీస్ ఇచ్చారు.

ప్రస్తుతానికి ఇండియాలోని 200 సిటీల్లో మిడ్ నైట్ కేక్ సర్వీస్ ఉంది. కంపెనీ గ్రోథ్ రేటు 50 నుంచి 80 శాతం వరకు ఉంది. వచ్చే ఏడాది అది మరో 30 శాతం పెరగొచ్చని భావిస్తున్నారు. సంస్థ ఏడాది టర్నోవర్ 36 లక్షలు.

మలాయ్, నమన్ అనే ఇద్దరు సోదరులు 8 వేల రూపాయలతో 2012లో వెబ్ సైట్ స్టార్ట్ చేశారు. మొదట్లో పెద్దగా రెస్పాండ్ లేదు. రెండు నెలల తర్వాత బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Related Stories

Stories by team ys telugu