ఇల్లు మారడం అనే ప్రహసనాన్ని ఈజీ చేస్తున్న ఫ్లాట్ హుడ్

0

అతుర్ అగర్వాల్, పీయూష్ గుప్తా రియల్ ప్రెన్యూర్స్ అవుతామని అనుకోలేదు. వాళ్ల టార్గెట్స్ వేరే ఉన్నాయి. మూవో అనే స్టార్టప్ మీద వర్క్ చేసే సమయంలో ఢిల్లీలోని మాల్వియా నగర్ లో ఇంటికోసం చూడాల్సి వచ్చింది. ఆ క్రమంలో చాలా రియల్ ఎస్టేట్ పోర్టల్స్ వెతికారు. కొత్తవి పాతవి కలిపి వడపోశారు. బుర్ర వేడెక్కి పిచ్చెక్కిపోయింది. బ్రోకర్ల దందా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలా అయితే లాభం లేదని తామే రంగంలోకి దిగారు.

నగరాల్లో దాదాపు 33 శాతం జనం అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. ఇల్లు మారాలంటే మినిమం నెల రోజులు పడుతుంది. దానికోసం పనులు మానుకోవాలి. లేదంటే మధ్యవర్తుల మీద ఆధారపడాలి. ఈ తలనొప్పి లేకుండా ఇల్లు మారడం అనే ప్రహసనాన్ని ఈజీ చేయాలనే ఉద్దేశంతోనే ఫ్లాట్ హుడ్ అనే స్టార్టప్ తో అడుగు ముందుకు వేశారు. ఫ్లాట్ హుడ్ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫాం.

అద్దె ఇల్లు చూసిపెట్టడం ఫ్లాట్ హుడ్ కి ఒక్క రోజులో పని. సామాన్లతో షిఫ్టడం మహా అయితే పదిరోజుల్లో పూర్తవుతుంది. బ్యాచిలర్, కపుల్, ఫ్రెండ్లీ హౌజెస్ ఇలా కస్టమర్లకు ఎలాంటి ఇల్లు కావాలన్నా వెతికిపెడతారు. ఫర్నిచర్, గృహోపకరణాలు కావాలన్నా సమకూర్చుతారు. అంతా వన్ టైం చార్జీలే. ఒక ప్యాకేజీలా మాట్లాడుకుని ఎండ్ టు ఎండ్ సర్వీస్ అందిస్తారు.

2020 నాటికి ఇండియన్ రెంటల్ మార్కెట్ 180 బిలియన్ డాలర్లని టచ్ చేస్తుందని అంచనా. దేశ జీడీపీలో దానివంతు కాంట్రిబ్యూషన్ ఆరు శాతం. ఇండియాలో ప్రతీ పిన్ కోడ్ పరిధిలో సుమారు వెయ్యిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లున్నారు. వాళ్లు కాకుండా నోబ్రోకర్, కామన్ ఫ్లోర్, మ్యాజిక్ బ్రిక్స్, 99 ఎకర్స్, ప్రాప్ టైగర్ వంటి సంస్థలు రియల్ సెక్టారులో బిజినెస్ చేస్తున్నాయి.

ఇన్ని ఉన్నా సరే ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ పోర్టళ్ల విషయంలో ఒకటే సమస్య. అన్నిట్లో సమాచారం అరకొరగా ఉంటుంది. పక్కా ఇన్ఫమేషన్ దొరకడం లేదు.అప్ డేట్ చేయడంలో విఫలం అవుతున్నాయి. స్కేలింగ్‌ కి అది ప్రధాన అడ్డంకిగా మారిందనేది చాలామంది భావన.

యువర్ ఓన్ రూం, హోమిగోండ్ నెస్ట్ అవే లాంటి రెంటల్ స్టార్టప్స్ 43 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిస్ చేశాయి. వాటి బిజినెస్ అంతా కో లివింగ్ మోడల్ లో ఉంటుంది. నిజానికి కో లివింగ్ మోడల్‌ లో స్టే అబోడ్, కోహో, రెంట్‌ రూమి, వుడ్ స్టే లాంటి సంస్థలు కంప్లీట్ ప్లగ్ అండ్ ప్లే సొల్యూషన్ అందిస్తున్నాయి.

అయితే ఫ్లాట్ హుడ్ మాత్రం రెంటల్ తో పాటు సర్వీస్ కూడా అందిస్తోంది. ఇటు ఓనర్లకు, అటు టెనెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డీల్స్ సెట్ చేస్తోంది. కస్టమర్లు కోరితే ఫ్లాట్ మేట్స్, రూమ్ మేట్స్ ని అరెంజ్ చేసి పెడుతుంది. సమస్యల్లా సర్వీస్ ఫీజు పే చేయడమే అంటారు ఫ్లాట్ హుడ్ ఫౌండర్ అతుర్. సర్వీస్ ఫీజు అనే సరికి డబ్బుల్లేకుండా పని అవదా అన్నట్టుగా మాట్లాడుతున్నారట.

ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి నెలఅద్దెలో సగం చార్జీల కింద వసూలు చేస్తోంది. ఢిల్లీ, గూర్గావ్ లో ఫ్లాట్ హుడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. త్వరలో వేరే ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు.

Related Stories

Stories by team ys telugu