రైల్లోనూ రుచికర ఆహారానికి ట్రావెల్ జైకా

రైళ్లలో దొరికే భోజనానికి ప్రత్యామ్నాయం ట్రావెల్ జైకాట్రైన్‌లోని భోజనం నచ్చక వచ్చిన ఐడియా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం సేవలుదేశంలోని ప్రతీ రైలులో సేవలు అందించడం లక్ష్యం

రైల్లోనూ రుచికర ఆహారానికి ట్రావెల్ జైకా

Friday April 17, 2015,

2 min Read

గోవా నుండి జైపూర్ ప్రయాణిస్తున్న పంకజ్ చందోలా ట్రైన్‌లో IRCTC ద్వారా భోజనం ఆర్డర్ చేసారు. కానీ రుచి లేని ఆ భోజనంతో నిరాశకు గురయ్యారు పంకజ్. ఇక తన స్నేహితుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో, రైల్వే క్యాటరింగ్‌పై పరిశోధన చేసారు ఆ ఇద్దరు. చాలా మంది ప్రయాణికులకు వివిధ కారణాలతో అందులోని ఫుడ్ నచ్చడంలేదని తెలుసుకున్నారు. ఆహారంలో క్వాలిటీ లేకపోవడం, డెలివరీ చేసే వ్యక్తుల వ్యవహర శైలితో పాటు వేరే చాయిస్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు.

image


ట్రావెల్ జైకా టీమ్

ట్రావల్ జైకా సీఈఓ మరియు కో-ఫౌండర్ పంకజ్ చందోలా GIMT మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్ కావడంతో పాటు మార్కెటింగ్, సేల్స్‌లో ఎక్స్‌పర్ట్ కూడా. ఐటీ ఇండస్ట్రీలో ఏడేళ్ల అనుభవం కూడా పంకజ్‌కు ఉంది. మరో కో-ఫౌండర్ కరణ్ ట్రేడింగ్ మరియు ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్‌లో ఐదేళ్ల అనుభవం సంపాదించారు. ఇక మీరట్ యునివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఈ కంపెనీ సీఓఓ రజత్ గోయల్, HRM మరియు కస్టమర్ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ అనుభవం ఉన్న వ్యక్తి.

ట్రావెల్ జాయికా ప్రారంభం

కరణ్

కరణ్


అక్టోబర్ 2014 జైపూర్‌లో ప్రారంభమైన ‘ట్రావెల్ జైకా’ని 8 మంది గల టీమ్ నడిపిస్తోంది. మార్కెటింగ్ మరియు స్ట్రాటజీ టీమ్‌ గజియాబాద్ నుండి తమ కార్యకలాపాలు చూస్తుంది. ప్రయాణికులు ఎక్కువగా ఉండే స్టేషన్స్‌ని టార్గెట్ చేసుకున్న ‘ట్రావెల్ జైకా’ టీమ్, 10-15 కిలోమీటర్ల దూరంలో రుచికరమైన ఫుడ్ సప్లై చేసే వెండర్స్‌తో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ టీమ్‌తో 50 మంది వెండర్స్ ప్రతీ రోజు సుమారు 50-60 ఆర్డర్లు ఒక్కొక్కరు సప్లై చేస్తున్నారు. ప్రధానంగా మథురా, అలిగడ్, న్యూడిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, అబూ రోడ్, అజ్మిర్, కోటా, రత్లాం, భోపాల్, సూరత్, వడోదర, ఇటార్సి, అహ్మదాబాద్, పుణే, మరియు నాసిక్ లాంటి నగరాల నుండి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు జైకా టీమ్.

రైళ్లలో ప్రయాణించే కస్టమర్లు నేరుగా ట్రావెల్ జైకా వెబ్‌సైట్‌లో వారి PNR లేదా ట్రైన్ నంబర్ టైప్ చేయగానే ఆయా స్టేషన్స్‌లో ట్రేన్ ఆగే సమయంతో పాటు ధర, ఇతర వివరాలతో మెను డిస్‌ప్లే అవుతుంది. పేమెంట్ ఆన్ లైన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకునే సదుపాయాన్ని కల్పించారు ‘ట్రావెల్ జైకా’. ఇప్పటి వరకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్న 'ట్రావెల్ జైకా' ని 15 శాతం మంది పాత కస్టమర్లు ఇష్టపడుతున్నారు.

ట్రావెల్ జైకా ఎదురుకున్న సవాళ్లు

ఇప్పటి వరకు ఏడు లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన ‘ట్రావెల్ జైకా’ టీమ్, అనుకూలమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకోవడం, వెండర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం మరియు మార్కెట్లో ఉన్నపోటీని ఎదురుకోవడం వంటి సవాళ్లు ఎదురుకున్నాం- చందోలా

ఇప్పటి వరకు ఏడు లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన ‘ట్రావెల్ జైకా’ టీమ్, అనుకూలమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకోవడం, వెండర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం మరియు మార్కెట్లో ఉన్నపోటీని ఎదురుకోవడం వంటి సవాళ్లు ఎదురుకున్నాం- చందోలా


అయితే ట్రావెల్ జైకా ఇంకా ప్రారంభ దశలో ఉందని, అప్పుడే లాభాల గురించి పెద్దగా ఆలోచింలేమని అంటున్నారు పంకజ్. ప్రస్తుతం మా క్వాలిటీ, సర్వీస్‌తో కస్టమర్లు సంతోషపడితే చాలనేది వీళ్ల ఆలోచన. భవిష్యత్తులో ఈ సర్వీస్‌ను బస్సులకు కూడా వ్యాపించే ఆలోచన ఉందంటున్నారు పంకజ్. ఇక మీ కంపెనీ ‘ట్రావెల్ ఖానా’ లాంటి ఇతర కంపెనీలతో ఏ విధంగా మెరుగైందనే ప్రశ్నకు, మా ఫుడ్ అందరి కన్నా బెస్ట్ అని కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు పంకజ్.