ముంబై ట్యాక్సీ డ్రైవర్ల పాలిట వరం 'క్యాబ్‌జో'

జోరుమీదున్న క్యాబ్ జోహెవీ కాంపిటీషన్ లో ముందుకు పోతున్న స్టార్టప్డ్రైవర్ ని సొంతంగా ఎంచుకొనే సౌకర్యంస్మార్ట్ టెక్నికే ప్రధాన ఆయుధమంటున్న ఫౌండర్ తరుణ్

ముంబై ట్యాక్సీ డ్రైవర్ల పాలిట వరం 'క్యాబ్‌జో'

Wednesday May 20, 2015,

3 min Read

టాక్సీ సర్వీసులకు ఉమ్మడి వేదికలుగా మారి ఓలా, ఉబెర్, టిఎఫ్ఎస్ విజయం సాధిస్తూ ఉండగా, అవ్యవస్థీకృతంగా ఉండిపోయిన కార్ల రెంటల్ రంగం కూడా సంస్కరణల బాట పట్టింది. 2013 వరకు దాదాపు 90శాతం అద్దె కార్లు ఇలా ఏ పద్ధతీ లేకుండా ఉండేవి. కానీ టెక్నాలజీని, సరైన విధానాలను సక్రమంగా వాడుకోవటం ద్వారా వినియోగదారులకు సరసమైన ధరల్లో తక్కువ సమయంలోనే కారు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిసిన తరువాత పరిస్థితిలో మార్పులొచ్చాయి. ఈ విభాగంలో ఓలా, ఉబెర్ మార్కెట్ లీడర్లుగా ఉండగా కొత్త స్టార్టప్ కంపెనీలకు ఇప్పటికీ పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి. ఔత్సాహికులైన యువ వ్యాపారులు వరుణ్, తరుణ్ కొడ్నాని కూడా ఈ విభాగంలో మరింత మందికి అవకాశాలున్నాయని గ్రహించారు. 

ముంబై లోని లోకల్ టాక్సీ డ్రైవర్లకు సహాయంగా ఉండేలా వీళ్ళిద్దరూ గత డిసెంబర్ లో క్యాబ్‌జోని ప్రవేశపెట్టారు. “ ప్రైవేట్ క్యాబ్ కంపెనీలు పెరిగాక స్థానిక టాక్సీ డ్రైవర్ల ఆదాయం బాగా పడిపోయింది. వీళ్ళకి స్మార్ట్ టెక్నికల్ వ్యవస్థ లేకపోవటమే అందుకు కారణం. ఇది చాల ఆన్యాయం. అందుకే వీళ్లకీ మార్కెట్లో సమాన అవకాశాలు కల్పించటానికే మేం ముందుకొచ్చాం “ అంటారు వరుణ్.

నిజానికి క్యాబ్‌జో అనే ఆలోచన వరుణ్, తరుణ్ స్వయంగా ఎదుర్కున్న సమస్య నుంచి పుట్టుకొచ్చింది. ఒకసారి తన సాకర్ మాచ్ అయిపోయాక తరుణ్, టాక్సీ కోసం 30 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం కనబడలేదు. అలా 30 నిమిషాల పాటు నడుస్తూ టాక్సీ స్టాండ్‌కి వెళ్ళేసరికి అక్కడి టాక్సీ డ్రైవర్లు నేనంటే నేనని పోటీ పడ్దారు. ఈ ఘటన తరుణ్‌ని బాగా ఆలోచింపజేసింది. ఈ విషయం వరుణ్‌తో చర్చించాడు. దీంతో వాళ్ళిద్దరూ కలసి కాబ్‌జో ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

image


 ''ఈ డ్రైవర్లకు సాయం చేయటం మాకెంతో ఇష్టమైన పని. ఎందుకంటే, మేం వాళ్ళను కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు గ్రహించాం. ఏ రోజుకారోజు గడిస్తే చాలునన్నట్టు ఉంటారు. అందుకే వాళ్ళందరినీ ఒకచోట చేర్చి వాళ్ళకోసం ఏదైనా చేయాలనిపించింది. మేం మాట్లాడుతున్నది కేవలం ముంబై లో ఉన్న 90 వేలమంది టాక్సీ డ్రైవర్లు, వాళ్ళ కుటుంబీకుల జీవితాల గురించి. దేశ వ్యాప్తంగా వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోవచ్చు'' - తరుణ్

వినియోగదార్లు హెల్ప్ లైన్ సాయంతో క్యాబ్‌జో మీద టాక్సీ బుక్ చేసుకోవచ్చు. ఆసక్తికరమైన విషయమేంటంటే, పెద్ద పెద్ద ఈ కామర్స్ సంస్థలన్నీ డెస్క్ టాప్ మీద అనాసక్తిగా ఉంటే క్యాబ్‌జో మాత్రం త్వరలో వెబ్ సైట్ మొదలు పెట్టాలనుకుంటోంది. ప్రస్తుతం క్యాబ్‌జో యాండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. అన్ని రకాల సాంకేతిక అవరోధాలకంటే కొడ్నానిస్ ఎదుర్కున్న ప్రధానమైన సమస్య అత్యంత చురుకైన, నాణ్యమైన ఆల్గొరిథమ్ రూపొందించటం. దూరం, డ్రైవర్ రేటింగ్ తదితర అంశాల ఆధారంగా డ్రైవర్ల జాబితాను ప్రయాణీకులకు అందుబాటులో ఉంచటం ఇందులో చాలా కీలకమైన అంశం. ప్రయాణీకుల చేతికే పగ్గాలివ్వటమన్నది క్యాబ్‌జో ప్రధానలక్ష్యం.

“ ఎవరో ఒక డ్రైవర్‌ని మేం మీకోసం ఎంపిక చేయం. డ్రైవర్లే మిమ్మల్ని పికప్ చేసుకుంటామంటూ స్పందిస్తారు. మేం ఆయా డ్రైవర్ల పేర్లు, ఫొటో, రిజిస్ట్రేషన్ నెంబర తదితర వివరాలు మీకందిస్తాం. దాంతోబాటే మీరున్న చోటులో మిమ్మల్ని పికప్ చేసుకోవటానికి డ్రైవర్ రావటానికి ఎంత సమయం పట్టేదీ చెబుతాం” అంటాడు తరుణ్.

క్యాబ్‌జో రూపొందించిన యాప్‌ స్క్రీన్ షాట్

క్యాబ్‌జో రూపొందించిన యాప్‌ స్క్రీన్ షాట్


ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, వినియోగదారుడు క్యాబ్ సర్వీస్‌ను బుక్ చేసుకోవటానికి ముందే రేటింగ్ ఆధారంగా డ్రైవర్‌ను స్వయంగా ఎంచుకోవచ్చు. కంపెనీకి ప్రస్తుతం యాండ్రాయిడ్ మీద సుమారు 5,000 మంది వాడకం దారులున్నారు. త్వరలో ఐ.ఓ.ఎస్. కూడా అందుబాటులోకి వస్తోంది. పేరు వెల్లడించని ఒక ఇన్వెస్టర్ దీనికి నిధులు సమకూర్చగా, తర్వాతి దశ నిధుల సమీకరణ త్వరలో జరుగుతుందని ఈ యువ జంట ఉత్సాహంగా చెబ్తోంది.

క్యాబ్ డ్రైవర్లకు వినియోగదార్లు ఇచ్చే రేటింగ్

క్యాబ్ డ్రైవర్లకు వినియోగదార్లు ఇచ్చే రేటింగ్


ఆన్ లైన్ క్యాబ్ మార్కెట్లో ఓలా ఆధిపత్యం సాగుతోంది. అది ఈ మధ్యనే సాఫ్ట్ బాంక్ నుంచి భారీగా నిధులు సమకూర్చుకుంది. టాక్సీ ఫర్ ష్యూర్‌ని కొనుగోలు చేశాక ఉబెర్ తదితర సంస్థలన్నిటినీ మించిపోయింది ఓలా. వివిధ అంచనాల ప్రకార భారత దేశపు రేడియో టాక్సీ మార్కెట్ విలువ సుమారు 600 నుంచి 900 కోట్ల అమెరికన్ డాలర్లుంటుంది. ఇది ఏటా 17నుంచి 20 శాతం మేర పెరుగుతూ ఉంటుందని కూడా అంచనా వేశారు. మరీ ముఖ్యంగా ఈ రంగంలో కేవలం 4 నుంచి 8 శాతం మాత్రమే ఇప్పటికీ వ్యవస్థీకృతమైంది. అంటే, మరింత మంది ఈ రంగంలో ప్రవేశించటానికి అవకాశముంది.

ఏమైనప్పటికీ ముంబై తదితర మెట్రో నగరాలలో మార్కెట్ ని ఛేదించటం స్టార్టప్ కంపెనీలకు చాలా కష్టం కావచ్చు. ఓలా, ఉబెర్ రెండిటికీ భారీగా నిధులున్నాయి. పైగా వెంచర్ కాపిటల్ నిధుల అండడండలున్నాయి కాబట్టి స్టార్టప్ కంపెనీల ఎదుగుదలను సులభంగా అవి అడ్డుకోగలవు.