ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే మీ పిల్లలు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిసిపోద్ది..!!

ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే మీ పిల్లలు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిసిపోద్ది..!!

Monday April 11, 2016,

3 min Read


రూపాయి పొదుపు చేయడమంటే రూపాయి సంపాదించినట్లే లెక్క. అవసరమైనవాటికి పొదుపుగా ఖర్చుచేయడం ఎంత ముఖ్యమో ఓ ఇంగ్లీష్ సామెత చెబుతుంది. ఉద్యోగాలుచేసే పిల్లలు ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేస్తే జులాయిల్లా మారతారేమోనని తల్లిదండ్రులు భయపడతారు. ఈ సమస్యకు చెక్ పెడుతోంది స్లోన్ కిట్ అనే యాప్. పిల్లలు చేసే ఖర్చు తల్లిదండ్రులకు తెలిసేలా చేస్తుంది. అంతేకాదు పిల్లలకు సైతం ఆర్థిక పాఠాలు చెబుతోంది.

ఉద్యోగంలో చేరిన మొదటి నెల జీతాన్ని ఏం చేస్తారు? కుటుంబ సభ్యులకో, స్నేహితులకో మంచి గిఫ్ట్స్ కొనిస్తారు. పబ్బుల్లో పార్టీలంటూ ఎంజాయ్ చేస్తారు. చాలామంది కుర్రాళ్లకు డబ్బు విలువ తెలియదు. ఎవరు చెప్పినా యువతరం వినదు. ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న ఆలోచన నుంచే పుట్టింది స్లోన్ కిట్. నవతరానికి డబ్బు విలువ చెప్పాలన్న లక్ష్యంతో ఓ ఇద్దరు తండ్రులు ఈ స్టార్టప్ పెట్టారు.

యాప్ మాయాజాలం

స్లోన్ కిట్ అనేది ఒక యాప్. తల్లిదండ్రులు – పిల్లలకు రెండు వెర్షన్ల యాప్ప్ ఉంటాయి. డీసీబీ బ్యాంక్ సాయంతో వీసా డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. బ్యాంకులో ముందుగానే డబ్బులేసుకుని డెబిట్ కార్డును వాడాల్సి ఉంటుంది. ఆన్ లైన్లోగానీ, ఆఫ్ లైన్లోగానీ కార్డు గీకిన ప్రతిసారీ ఎక్కడ ఏం కొన్నారు.. డబ్బును ఏమేరకు సద్వినియోగం చేసుకుంటున్నారన్న వివరాలు వెంటనే తల్లిదండ్రుల యాప్ కు వెళ్లిపోతాయి. అంటే తమ పిల్లలు డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారో పేరెంట్స్ కు వెంటనే తెలిసిపోతుందన్నమాట. 

ఉన్న డబ్బును ఎలా సద్వినియోగం చేయాలన్న విషయంలోనూ స్లోన్ కిట్ యాప్ సలహాలనిస్తుంది. మనీ మేనేజ్ మెంట్ పై… ప్రాథమిక అంశాలు ఈ యాప్ లో ఉంటాయి. పదేళ్ల పైబడ్డవారు ఈ యాప్ ఉపయోగించొచ్చు. తల్లిదండ్రులు డబ్బు వినియోగంపై పరిమితులు విధించవచ్చు. ఒకవేళ పిల్లలు అయిందానికీ కానిదానికీ ఖర్చు పెడుతన్నారు అనుకుంటే యాప్ పనిచేయకుండా చేయొచ్చు. దాంతో వాళ్ల తోక కత్తిరించినట్టే.

తొలి అడుగులు

స్లోన్ కిట్ కన్నా ముందు న్యూయార్క్ లో ఈక్వెస్ వెంచర్స్ పేరుతో మురాద్ ఒక కంపెనీ పెట్టారు. ముంబైలోని బియాన్ అండ్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. క్లోవర్ ఇన్ఫోటెక్ కంపెనీని స్థాపించారు. ఇద్దరూ కలిసి కొత్త కాన్సెప్టుతో స్లోన్ కిట్ ఏర్పాటు చేశారు. అంతకన్నా ముందు కొంత స్టడీ చేశారు. భారతదేశంలో పిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరు.10 నుంచి13 ఏళ్ల మధ్య వయుస్కులపై ఇలాంటి పరిశోధనలు చేశారు. 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైతేనే డబ్బిస్తున్నారు. ఫిక్స్ డ్ పాకెట్ మనీ ఇవ్వడం లేదు. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 40 శాతం మందికి మాత్రం ఫిక్స్ డ్ పాకెట్ మనీ లభిస్తోంది.

మన పిల్లలకు పొదుపు నేర్పాలనుకుంటాం. డబ్బుపై వారికి నియంత్రణ అవసరం. వారి దగ్గర డబ్బుంటేనే దాన్ని సేవ్ చేయడం నేర్చుకుంటారు. అనుభవపూర్వకంగా నాలెడ్జ్ వస్తుంది. మనీ మేనేజ్ మెంట్ అంటే ఏమిటో చిన్న వయసులోనే స్లోన్ కిట్ నేర్పుతుంది- మురాద్

భవిష్యత్ ప్రణాళిక

స్లోన్ కిట్ ఫుల్ టైం కోర్ టీంను నియమించుకునే పనిలో ఉంది. పాత కంపెనీల్లో జావెద్, మురాద్ తో కలిసి పనిచేసిన పలువురు… స్లోన్ కిట్ లో చేరారు. 40 వేల మందికిపైగా దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. కస్టమర్లు 3.2 రేటింగ్ ఇచ్చారు. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నవారిలో ఎక్కువమంది మెట్రో నగరాల్లోనివారే. ఐదేళ్లపాటు తమ కస్టమర్లయి.. 18 ఏళ్ల వయసు గలవారైతే చాలు వారందరికీ లోన్ ఇచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.

image


చిన్నారులకు సహకారం

ఒకప్పుడు పిల్లల దగ్గర పెద్దవారు డబ్బు గురించి అస్సలు మాట్లాడేవారు కాదు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. ఓస్పర్ సంస్థ స్టడీ ప్రకారం…13 శాతం మంది తల్లిదండ్రులు ఆర్థిక వ్యవహారాలను చిన్నారులతో చర్చిస్తున్నారని తేలింది. ఓస్పెర్, ఓయింక్, బ్యాంక్ రో, గో హెన్రీ లాంటి సంస్థలు పిల్లల మనీమేనేజ్మెంట్ లో వచ్చిన స్టార్టప్స్. సంప్రదాయ బ్యాంకులైన KOTAK, SBI, HDFC చిన్నారులను బ్యాంకింగ్ రంగంలో భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారికోసం ప్రత్యేకంగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నాయి.