డిజైనర్లందరినీ ఒకే తాటిమీదికి తెచ్చిన ‘తలాష’

డిజైనర్లందరినీ ఒకే తాటిమీదికి తెచ్చిన ‘తలాష’

Monday April 25, 2016,

2 min Read


హైదరాబాద్ అంటే ఫ్యాషన్ సిటీ. ఎన్ని రకాల ఫ్యాషన్లు వస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త తళుకులు కనిపిస్తునే ఉంటాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్థాయిలోనే చాలా షోలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి ఎంతోమంది డిజైనర్లు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకూ డిజైనర్లు సొంతగా బొటిక్ లు ఏర్పాటు చేసుకున్నారే కానీ, అంతా కలసి ఒక ప్లాట్ ఫాంలోకి రాలేదు. అందుకే ఇప్పుడు దీన్ని ఒక వ్యాపారంగా మార్చి ప్రతి డిజైనర్ కి ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చేలా ఒక ప్లాట్ ఫాం కల్పిస్తోంది తలాష.

“హైదరాబాద్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో పేరున్న వాళ్లు చాలామందే మా దగ్గర డిజైన్స్ అమ్మకానికి పెట్టారు,” అను పెల్లకూరు

అను ఈ సంస్థ కో ఫౌండర్. ముందుగా ఆన్ లైన్ స్టోర్ పెట్టాలని ఆలోచించారు. కానీ ఆఫ్ లైన్ వైపు ఎక్కువ మంది డిజైన్లు మొగ్గు చూపారు. దీంతో ముందు ఆఫ్ లైన్ లో అందుబాటులోకి తెచ్చామని అన్నారామె. భవిష్యత్ లో ఆఫ్ లైన్లో కూడా తీసుకొస్తామని అంటున్నారు. జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఈ స్టోర్ ఉంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సమంత, రెజీనా, లావణ్య త్రిపాఠి, లక్ష్మి మంచు లకు డిజైనర్స్ అయిన నీరజా కోన, ఇంద్రాక్షి, నితీష, శ్వేతా మల్పానీ లాంటి వారు ఈ స్టోర్ లో పార్ట్ నర్స్. బట్టలు, లగ్జరీ వస్తువులు, గాజులు, గాడ్జెట్స్ ఇక్కడ లభిస్తాయి. 

"నగరంలోని హైఎండ్, పేజ్ త్రీ క్రౌడ్ కు ఇది సరైన డెస్టినేషన్. ఎందుకంటే చాలామంది డిజైనర్ల కలెక్షన్లు మా దగ్గరలభిస్తాయి," సుకుతా రెడ్డి

సుకుత మరో కోఫౌండర్. ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. కొత్త డిజైనర్లను స్టోర్లో స్పేస్ కల్పిస్తామని అన్నారామె.

image


తలాష టీం

అను పెల్లకూరు తలాష కో ఫౌండర్. 23 ఏళ్లకే వ్యాపారంలో అడుగు పెట్టిన యంగ్ ఆంట్రప్రెన్యూర్. రెండేళ్ల ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎక్స్ పీరియన్స్ తో దీన్ని ప్రారంభించారు. దేశ విదేశాల్లో జరిగిన లగ్జరీ ఎక్స్ పోల్లో ఎస్ అండ్ ఏ అనే బ్రాండ్ తో పాల్గొన్న అను మొదటిసారి ఆఫ్ లైన్ బొటిక్ తో డిజైన్లను అందుబాటులోకి తెచ్చారు. సుకుత రెడ్డి మరో కో ఫౌండర్. ఎంబీయే పూర్తిచేసిన సుకుత మొదట్లో ఫ్యామిలీ బిజినెస్ వ్యవహారాలు చూసుకున్నారు. అయితే ఆ వ్యాపారాలకు భిన్నంగా సొంతగా మొదలుపెట్టాలని ఈ వెంచర్ లోకి దిగారు. వీరితో పాటు మరో ఆరు మంది ఉద్యోగులున్నారు.

image


ప్రధాన సవాళ్లు

ఈ రోజుల్లో బ్రాండ్ నేమ్ తోనే వస్త్ర వ్యాపారం సాగుతోంది. కొత్త బ్రాండ్ గా మార్కెట్ లో వచ్చిన తలాష ముందున్న కర్తవ్యం కూడా అదే. ఆఫ్ లైన్ కు మద్దతుగా ఆన్ లైన్ ఉన్నప్పుడే నూటికి నూరు శాతం సక్సెస్ రేటు ఉంది. చాలెంజింగ్ ధరలతో క్రియేటివ్ డిజైన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ సమస్యలను అధిగమిస్తామని సుకుత అన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాల్లో తులాష బ్రాండ్ పై స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆన్ లైన్ సేవలను కూడా భవిష్యత్ లో అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు. పలు సినిమాలకు పనిచేసిన డిజైనర్లను తమ స్టోర్లకు అనుబంధం చేసి స్థానికంగా ప్రమోట్ చేస్తామని ఫౌండర్లు చెప్పుకొచ్చారు.